రెడ్యా నాయక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డి. ఎస్. రెడ్యా నాయక్
రెడ్యా నాయక్

రెడ్యానాయక్ చిత్రపటము

నియోజకవర్గం డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం

రెడ్యానాయక్

వ్యక్తిగత వివరాలు

జననం (1952-08-20) 1952 ఆగస్టు 20 (వయసు 71)
ఉగ్గంపల్లి మరిపెడ వరంగల్ జిల్లా
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్, భారత్ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి లక్ష్మీ
సంతానం ఇద్దరు కుమారులు ఒక కుమార్తె (మాలోత్ కవిత)మహబూబాబాద్ శాసనసభ నియోజకవర్గం Ex.MLA[2009].
మతం హిందూ మతము

ధరంసొతు రెడ్యానాయక్ వరంగల్ జిల్లాకు చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మాజీ రాష్ట్ర మంత్రి, జిల్లా రాజకీయ నాయకుడు. డోర్నకల్ నియోజకవర్గం నుండి ఆరుసార్లు శాసనసభ సభ్యుడుగా గెలుపొందాడు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

రెడ్యానాయక్ 1952 ఆగస్టు 20లో మహబూబాబాదు  జిల్లా, చిన్నగూడూర్ మండలంలోని ఉగ్గంపల్లి గ్రామంలో రామ్ నాయక్ కు జన్మించాడు.[2] అతను ఆర్ట్స్ లో పట్టభద్రుడయ్యాడు.[3] లక్ష్మీ తో వివాహం జరిగింది, వారికి ఒక కుమార్తె ఇద్దరు కుమారులు.

రాజకీయ జీవితం[మార్చు]

ఉగ్గంపల్లి సర్పంచ్ గా ఎన్నికైన రెడ్యానాయక్ అధ్యక్షుడు, పంచాయితీ సమితి, వ్యవసాయ మార్కెట్. డైరెక్టర్,మరిపెడ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు,AP శాసన అసెంబ్లీ S.T. ఛైర్మన్, కమిటీ 3 సంవత్సరాలు సంక్షేమ సభ్యుడు, AP శాసన, మాజీ కాంగ్రెస్ మంత్రి,2014లో మళ్లీ 5వ సారీ MLA గా అసెంబ్లీలో డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయవేత్త డిఎస్ రెడ్యానాయక్[4].

డోర్నకల్ గెలుపు, ఓటములు[మార్చు]

  • 2018 లో 17,281 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు
  • 2014 101 డోర్నకల్ (ఎస్టీ) దరంసోత్ రెడ్యానాయక్ 1,64,681 సత్యవతి రాథోడ్ 1,41,150
  • 2009 101 డోర్నకల్ (ఎస్టీ)) సత్యవతి రాథోడ్ టిడిపి 69282 దరంసోత్ రెడ్యానాయక్ 64659
  • 2004 264 డోర్నకల్ దరంసోత్ రెడ్యానాయక్ 72669 బనోత్ జయంత్ నాథ్ టిడిపి 53529
  • 1999 264 డోర్నకల్ దరంసోత్ రెడ్యానాయక్ 56339 నరేష్ రెడ్డి నోకల టిడిపి 48303
  • 1994 264 డోర్నకల్ దరంసోత్ రెడ్యానాయక్ 53274 నోకల నరేష్ రెడ్డి ఇండియా 27180
  • 1989 264 డోర్నకల్ దరంసోత్ రెడ్యానాయక్ 46645 సత్యవతి రాథోడ్ టిడిపి 41560.

కుమార్తె కవిత[మార్చు]

తన కుమార్తె మాలోత్ కవిత, మహబూబాబాద్‌ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 2009 లో గెలుపొందారు[5].

యం.యల్.ఎ గా ఓటమి[మార్చు]

2009 ఎన్నికలలో రెడ్యానాయక్ ఓటమిచెందారు. యం.యల్.ఎగా తెలుగుదేశం పార్టీ తరఫున సత్యవతి రాథోడ్ గెలిచారు... 2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున సత్యవతి రాథోడ్ పోటీ చేయగా[6] కాంగ్రెస్ పార్టీ నుండి డిఎస్ రెడ్యా నాయక్, భారతీయ జనతా పార్టీ తరఫున పరశురాం నాయక్, ప్రజారాజ్యం పార్టీ తరఫున బానోతు సుజాత పోటీచేశారు.[7]. 2014లో తెలంగాణగా రాష్ట్రం విడిపోయింది. యం.యల్.ఎగా సత్యవతి రాథోడ్ తెలంగాణ రాష్ట్ర సమితిపార్టీ తరఫున పోటీలో 2014 ఓటమిచెందారు. కానీ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పడింది[8].

శాసనసభ్యునిగా[మార్చు]

2014 5వ సారీ MLA గా అసెంబ్లీలో డోర్నకల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందారు రెడ్యానాయక్[9].

టీఆర్ఎస్ లో చేరారు[మార్చు]

రెడ్యానాయక్ టీఆర్ ఎస్ తీర్దంపుచ్చుకున్నారు.కేసిఆర్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే కవితతో పాటు టిఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు.ఆయనతోపాటు డోర్నకల్,మహాబూబాబాద్,నియోజక వర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు టీఆర్ ఎస్ లో చేరారు.[10]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2015-12-30.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-02-18. Retrieved 2015-12-30.
  3. Eenadu (17 November 2023). "ప్రధాన అభ్యర్థులు విద్యావంతులే". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.
  4. http://www.elections.in/telangana/assembly-constituencies/dornakal.html[permanent dead link]
  5. http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/redya-naik-loses-daughter-wins/article284155.ece
  6. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  7. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009
  8. http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/2009-election-results.html[permanent dead link]
  9. https://www.youtube.com/watch?v=Y7MQK9f4DOI
  10. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-11-14. Retrieved 2015-12-30.

బయటి లింకులు[మార్చు]