పోరిక బలరాం నాయక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పోరిక బలరాం నాయక్
పోరిక బలరాం నాయక్


పదవీ కాలము
జూన్ 2009 – మే 2014
తరువాత సీతారాం నాయక్

వ్యక్తిగత వివరాలు

జననం (1964-06-06) 6 జూన్ 1964 (వయస్సు 56)
మహబూబాబాద్, వరంగల్, తెలంగాణ
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి తిరుపతమ్మ
జూలై 17,1986 (వివాహం)
సంతానము ఇద్దరు కుమారులు
నివాసము బంజారాహిల్స్, హైదరాబాద్
పూర్వ విద్యార్థి బి.ఏ. ఆంధ్రా విశ్వవిద్యాలయం, హైదరాబాద్
వృత్తి సామాజిక వేత్త, రాజకీయ నాయకులు,
మతం హిందూ

పోరిక బలరాం నాయక్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, 15వ పార్లమెంటు సభ్యుడు.[1] భారత జాతీయ కాంగ్రెస్ తరపున మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గం నుండి ప్రాతినిద్యం వహించాడు.[2]

జననం - విద్యాభ్యాసం[మార్చు]

బలరాం నాయక్ 1964, జూన్ 6న లక్ష్మణ్ నాయక్, లక్ష్మి (గ్రామీణ బంజారా కుటుంబం) దంపతులకు వరంగల్ లోని మదనపల్లి లో జన్మించాడు. హైదరాబాద్ లోని ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి బి.ఏ. చేశాడు.

వివాహం[మార్చు]

1986, జూలై 17న తిరుపతమ్మతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు.

వృత్తి జీవితం[మార్చు]

బలరాం నాయక్ 2009 లో రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు, పోలీసు కానిస్టేబుల్ గా పనిచేశాడు. అటుతడువాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ప్రవేశించాడు.

రాజకీయ జీవితం[మార్చు]

2009 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గం నుండి 15 వ లోకసభకు ఎన్నికయ్యాడు.[3] లేబర్ కమిటీ సభ్యులుగా ఉన్నాడు. 2012 అక్టోబడులో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా నియమించడ్డాడు.

సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన వ్యక్తుల సంక్షేమ అభ్యున్నతికి కృషి చేశాడు. వృద్ధులకు, జబ్బుపడిన వ్యక్తులకు ఆశ్రయం అందించడానికి వృద్ధాశ్రమ ఏర్పాటు వంటి సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నాడు.[3]

మూలాలు[మార్చు]

  1. http://news.outlookindia.com/item.aspx?707674[permanent dead link]
  2. http://articles.timesofindia.indiatimes.com/2011-06-18/hyderabad/29673897_1_resignations-suresh-shetkar-balram-naik
  3. 3.0 3.1 "Fifteenth Lok Sabha Members Bioprofile - Balram, Shri Porika Naik". Archived from the original on 2010-08-20. Retrieved 2017-02-19.