సీతారాం నాయక్
సీతారాం నాయక్ | |||
| |||
మాజీ పార్లమెంట్ సభ్యుడు
| |||
పదవీ కాలం జూన్ 2014 – ఏప్రిల్ 2019 | |||
ముందు | పోరిక బలరాం నాయక్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1957, ఆగస్టు 20 మల్లేపల్లి, వరంగల్ జిల్లా, తెలంగాణ, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | బీఆర్ఎస్ | ||
సంతానం | ఒక కూతురు, ఇద్దరు కుమారులు (రాకేష్, రాజేష్) | ||
నివాసం | హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం | ||
మతం | హిందూ |
సీతారాం నాయక్ తెలంగాణ రాష్టానికి చెందిన రాజకీయ నాయకుడు, 16వ పార్లమెంటు సభ్యుడు. 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందాడు.[1][2]
జననం, విద్య
[మార్చు]సీతారాం నాయక్ 1957, ఆగస్టు 20న లక్ష్మణ్ - మంగమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లాలోని మల్లేపల్లిలో జన్మించాడు. వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఎంఎస్సీ, పి.హెచ్.డి. పూర్తిచేశాడు.[3]
వ్యక్తిగత జీవితం
[మార్చు]సీతారాంకు 1978, జూన్ 8న శారదతో వివాహం జరిగింది. వారికి 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు.
వృత్తి జీవితం
[మార్చు]కాకతీయ విశ్వవిద్యాలయం అకాడమిక్ సెక్షన్ లో పనిచేశాడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల తెలంగాణ ఉద్యమ కార్యకర్తగా పాల్గొన్నాడు.[4][5]
రాజకీయ జీవితం
[మార్చు]2014 లోక్‌సభ ఎన్నికలలో మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మాజీ మంత్రి, భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ పై 34,992 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[6]
సీతారాం నాయక్ 2024 మార్చి 10న ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్ సమకంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[7][8]
నిర్వర్తించిన పదవులు
[మార్చు]- 2014 సెప్టెంబరు 1 నుండి: సభా సమావేశాలకు సభ్యులు గైర్హాజరుపై కమిటీ సభ్యులు
- కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
- 2017 సెప్టెంబరు 1 - 2017 నవంబరు 2: సామాజిక న్యాయం - సాధికారతపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు
- 2017 నవంబరు 3 నుండి: రసాయనాలు, ఎరువులపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు
మూలాలు
[మార్చు]- ↑ సాక్షి. "మాట తప్పని కేసీఆర్". Retrieved 22 February 2017.
- ↑ "Telangana: TRS sweeps Assembly and Lok Sabha polls | India Elections 2014 | Saudi Gazette". Archived from the original on 2014-05-17. Retrieved 2017-02-22.
- ↑ "Members : Lok Sabha". loksabhaph.nic.in. Archived from the original on 2021-11-24. Retrieved 2021-11-24.
- ↑ Telangana: Jaipal Reddy trails as TRS leads in 12 LS seats | Business Standard
- ↑ Election results: Jaipal Reddy trails as TRS leads in 12 Lok Sabha seats in Telangana - The Times of India
- ↑ "Prof Azmeera Seetaram Naik: Age, Biography, Education, Wife, Caste, Net Worth & More - Oneindia". www.oneindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2019-05-29. Retrieved 2021-11-24.
- ↑ ETV Bharat News (10 March 2024). "బీఆర్ఎస్కు షాక్ - బీజేపీలో చేరిన మాజీ ఎంపీలు సీతారాం నాయక్, నగేశ్". Archived from the original on 10 March 2024. Retrieved 10 March 2024.
{{cite news}}
: zero width space character in|title=
at position 6 (help) - ↑ ABP Telugu (10 March 2024). "బీజేపీలోకి బీఆర్‌ఎస్ మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు". Archived from the original on 10 March 2024. Retrieved 10 March 2024.