తక్కెళ్లపల్లి రవీందర్ రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తక్కెళ్లపల్లి రవీందర్ రావు

ఎమ్మెల్సీ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
01 డిసెంబర్ 2021 నుండి 30 నవంబర్ 2027
నియోజకవర్గం ఎమ్మెల్యే కోటా

వ్యక్తిగత వివరాలు

జననం 9 సెప్టెంబర్ 1964
విస్సంపల్లి, చిన్న గూడూరు మండలం, మహబూబాబాద్‌ జిల్లా, తెలంగాణ
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
పూర్వ విద్యార్థి డిగ్రీ
మతం హిందూ మతము

తక్కెళ్లపల్లి రవీందర్ రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నవంబర్ 2021లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారైయ్యారు.[1] ఆయన ఈ పదవిలో 01 డిసెంబర్ 2021 నుండి 30 నవంబర్ 2027 వరకు కొనసాగుతాడు.[2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

తక్కెళ్లపల్లి రవీందర్ రావు 9 సెప్టెంబర్ 1964లో తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాద్‌ జిల్లా, చిన్న గూడూరు మండలం, విస్సంపల్లి గ్రామంలో జన్మించాడు. ఆయన డిగ్రీ వరకు చదువుకున్నాడు.[3]

రాజకీయ జీవితం

[మార్చు]

తక్కెళ్లపల్లి రవీందర్ రావు 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన టీడీపీలో గ్రామ పార్టీ అధ్యక్ష స్థానం నుంచి ఉమ్మడి వరంగల్‌ జిల్లా సంయుక్త కార్యదర్శిగా వివిధ హోదాల్లో పని చేసి 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించాడు, కొన్ని కారణాల వల్ల వేం నరేందర్‌రెడ్డికి టికెట్ దక్కడంతో ఆయన గెలుపు కోసం పని చేశాడు. రవీందర్ రావు 2007లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. ఆయన వరంగల్‌ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షునిగా, రాష్ట్ర కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా వివిధ హోదాల్లో పని చేశాడు. ఆయన 2019లో హుజూర్‌నగర్‌ నియోజకవర్గం, 2021లో నాగార్జునసాగర్‌ నియోజకవర్గం ఉప ఎన్నికల ఇన్‌ఛార్జిగా పని చేశాడు.[4][5] ఆయన తెలంగాణ శాసనమండలికి 2021లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో 16 నవంబర్ 2021న టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారై, నవంబర్ 22న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[6]

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తో

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (16 November 2021). "ఎమ్మెల్యే కోటా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు". Archived from the original on 16 November 2021. Retrieved 16 November 2021.
  2. TNews Telugu (1 December 2021). "'ఎమ్మెల్యే కోటా' ఎమ్మెల్సీల ప‌ద‌వీకాలం షురూ". Archived from the original on 1 December 2021. Retrieved 1 December 2021.
  3. ETV Bharat News (17 November 2021). "ఇదే తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రస్థానం". Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.
  4. Eenadu (17 November 2021). "ఆరూ తెరాసకే!". Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.
  5. Andhra Jyothy (17 November 2021). "తీన్‌మార్‌". Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.
  6. Andhrajyothy (22 November 2021). "తెలంగాణ: ఆ ఆరు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం". Archived from the original on 22 November 2021. Retrieved 22 November 2021.