బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి
బండ్ల కృష్ణమోహన్ రెడ్డి


పదవీ కాలం
 2018 - ప్రస్తుతం
ముందు డి.కె.అరుణ
నియోజకవర్గం గద్వాల్

వ్యక్తిగత వివరాలు

జననం 1967, సెప్టెంబరు 21
బురెడ్డి పల్లి గ్రామం, ధరూర్ మండలం, జోగులాంబ గద్వాల జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్
తల్లిదండ్రులు వెంకటరామ్ రెడ్డి - రేవతమ్మ
జీవిత భాగస్వామి జ్యోతి
సంతానం ఒక కుమారుడు

బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి తరపున గద్వాల్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1]

జననం, విద్య

[మార్చు]

కృష్ణమోహన్ రెడ్డి 1967, సెప్టెంబరు 21న వెంకటరామ్ రెడ్డి - రేవతమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లాలోని బురెడ్డి పల్లి పల్లి గ్రామం లో జన్మించాడు.[2] 1982లో గద్వాలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి పదవ తరగతి, 1988లో ఆత్మకూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్‌ను పూర్తిచేసాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన కృష్ణమోహన్ రెడ్డి కొంతకాలం వ్యాపారం చేశాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

కృష్ణమోహన్ రెడ్డికి జ్యోతితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు ఉన్నాడు.

రాజకీయ విశేషాలు

[మార్చు]

చదువుకునే రోజుల్లో అఖిల భారత విద్యార్థి పరిషత్ లో చురుకుగా పనిచేశాడు, అక్రమ మైనింగ్‌పై పెద్ద ఎత్తున పోరాటం చేశాడు. తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు.[3] 2009లో తెలుగుదేశం పార్టీ తరపున గద్వాల్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి.కె. అరుణ చేతిలో ఓడిపోయాడు.[4] 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి.కె. అరుణ చేతిలో 8,260 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4][5]ఆయన 2017లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యదర్శిగా నియమితుడయ్యాడు.[6] బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి.కె. అరుణపై 51,687 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[7][8]బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి 26 జనవరి 2022న జోగులాంబ గద్వాల జిల్లా, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[9] ఆయన 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గద్వాల్ నుండి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సరితా తిరుపతయ్యపై రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు[10][11]

బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి 2024 జులై 6న బీఆర్ఎస్‌ పార్టీని వీడి జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[12] ఆయన 2024 జులై 30న తిరిగి బీఆర్ఎస్‌ పార్టీలో చేరాడు.[13]

వివాదం

[మార్చు]

కృష్ణమోహన్‌రెడ్డి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారని ఆయనపై తెలంగాణ హైకోర్టు 2023 ఆగస్ట్ 24న ఎమ్మెల్యేగా ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇచ్చి అనర్హుడిగా ప్రకటించింది.[14]

ఇతర వివరాలు

[మార్చు]

సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదలైన దేశాలు సందర్శించాడు.

మూలాలు

[మార్చు]
  1. "Member's Profile - Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 2021-05-27. Retrieved 2021-09-06.
  2. admin (2019-01-08). "Gadwal MLA Bandla Krishna Mohan Reddy". Telangana data (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-09-06.
  3. "Bandla Krishna Mohan Reddy | MLA | Bureddypally | Dharoor | TRS". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-16. Retrieved 2021-09-06.
  4. 4.0 4.1 "Bandla Krishna Mohan Reddy(TRS):Constituency- GADWAL(MAHBUBNAGAR) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-09-06.
  5. Namasthe Telangana (27 June 2021). "అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తామంటే పాతరేస్తాం". Archived from the original on 5 జూలై 2021. Retrieved 5 July 2021.
  6. Sakshi (10 October 2017). "67 మందితో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గం". Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
  7. "dk aruna defeated by krishnamohan reddy". ww25.saakshyam.com. Archived from the original on 2022-09-26. Retrieved 2021-09-06.
  8. "Bandla Krishna Mohan Reddy(TRS):Constituency- GADWAL(JOGULAMBA-GADWAL) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-09-06.
  9. Namasthe Telangana (26 January 2022). "టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు వీరే.. ప్రకటించిన సీఎం కేసీఆర్‌". Archived from the original on 26 జనవరి 2022. Retrieved 26 January 2022.
  10. Namasthe Telangana (22 August 2023). "సమరానికి సై". Archived from the original on 13 November 2023. Retrieved 13 November 2023.
  11. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  12. Eenadu (6 July 2024). "భారాసకు షాక్‌.. కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే". Archived from the original on 6 July 2024. Retrieved 6 July 2024.
  13. Sakshi (31 July 2024). "మళ్లీ బీఆర్‌ఎస్‌ గూటికి." Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
  14. Andhra Jyothy (25 August 2023). "ఎమ్మెల్యే బండ్ల ఎన్నిక చెల్లదు". Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.