అంజయ్య యాదవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎల్గనమోని అంజయ్య యాదవ్‌
అంజయ్య యాదవ్


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2018 - ప్రస్తుతం
ముందు చౌలపల్లి ప్రతాపరెడ్డి
నియోజకవర్గం షాద్‌నగర్‌

వ్యక్తిగత వివరాలు

జననం 10 మే 1950
ఎక్లాస్‌ఖాన్‌పేట, కేశంపేట మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు ఆగయ్య, బాలకిష్టమ్మ
జీవిత భాగస్వామి లక్ష్మమ్మ
సంతానం ఎల్గనమోని రవీందర్‌ యాదవ్‌, మురళీకృష్ణ యాదవ్‌
నివాసం షాద్‌నగర్‌ & అంజిరెడ్డి నగర్ కాలనీ, కర్మన్‌ఘాట్ , హైదరాబాద్
వృత్తి రాజకీయ నాయకుడు

ఎల్గనమోని అంజయ్య యాదవ్‌, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున షాద్‌నగర్‌ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

ఎ. అంజయ్య యాదవ్‌ 1950, మే 10న ఆగయ్య-బాలకిష్టమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, కేశంపేట మండలంలోని ఎక్లాస్‌ఖాన్‌పేట గ్రామంలో జన్మించాడు.[1] ఆయన ఒకటవ తరగతి నుండి ఐదో తరగతి వరకు ఎక్లాస్‌ఖాన్‌పేట ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో, 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు కొత్తపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, 10వ తరగతి షాద్‌నగర్‌ లోని ప్రభుత్వ పాఠశాలలో పూర్తిచేశాడు. ఎ. అంజయ్య యాదవ్‌ హైదరాబాదు కోఠిలోని వివేకానంద కళాశాలలో ఇంటర్మీడియట్, పత్తర్‌ఘాట్‌లోని ఎంబీ సైన్స్‌ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశాడు.[2] ఆయన విద్యాభాస్యం పూర్తయ్యాక రెవెన్యూశాఖలో మాల్‌ పటేల్‌ ( వీఆర్‌ఓ)గా, పట్వారీగా, పోలీస్‌ పటేల్‌గా పనిచేశాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

అంజయ్య యాదవ్‌ కు లక్ష్మమ్మతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు (రవీందర్ యాదవ్, మరళీకృష్ణ) ఉన్నారు.

రాజకీయ జీవితం[మార్చు]

ఎ. అంజయ్య యాదవ్‌ 1987 నుండి 1992 వరకు ఎంపీపీగా, 2001 నుండి 2006 వరకు జెడ్పిటిసిగా, 2006 నుండి 2011 వరకు ఎంపిటీసీగా పనిచేశాడు. ఆయన తొలిసారిగా 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో షాద్‌నగర్‌ నియోజకవర్గం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి చౌలపల్లి ప్రతాపరెడ్డి చేతిలో 9,838 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.

అంజయ్య యాదవ్‌ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో షాద్‌నగర్‌ నియోజకవర్గం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి చౌలపల్లి ప్రతాపరెడ్డి పై 17,328 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2018లో జరిగిన ఎన్నికల్లో తెరాస తరపున పోటీచేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.[3][4] అంజయ్య యాదవ్‌ శాసనసభలో 2019, సెప్టెంబరు 22 నుండి బీసీ సంక్షేమ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నాడు.

మూలాలు[మార్చు]

  1. Mana Telangana (10 May 2021). "పచ్చదనం పెంచడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి". Archived from the original on 19 July 2021. Retrieved 19 July 2021.
  2. Sakshi (14 July 2019). "వ్యవసాయమంటే ప్రాణం". Archived from the original on 19 July 2021. Retrieved 19 July 2021.
  3. Andrajyothy (12 December 2018). "జనరల్‌ స్థానాల్లో బీసీల హవా!". Archived from the original on 19 July 2021. Retrieved 19 July 2021.
  4. News18 (2018). "Shadnagar Assembly constituency (Telangana)". Archived from the original on 19 July 2021. Retrieved 19 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)