చౌలపల్లి ప్రతాపరెడ్డి
చౌలపల్లి ప్రతాపరెడ్డి | |||
![]()
| |||
నియోజకవర్గం | షాద్‌నగర్ శాసనసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | దూసకల్ | 7 జూలై 1956||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
సంతానం | ఇద్దరు కుమారులు |
చౌలపల్లి ప్రతాపరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఇతను జూలై 7, 1956న [1] షాద్‌నగర్ మండలం దూసకల్ గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. బి.కాం. వరకు విద్యనభ్యసించాడు. 1994లో రాజకీయాలలో ప్రవేశించి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[2] 1995 స్థానిక సంస్థల ఎన్నికలలో షాద్‌నగర్ జిల్లా పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు. 2002 నుండి 2004 వరకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు. 2009 శాసనసభ ఎన్నికలలో షాద్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి 9838 ఓట్ల మెజారిటీతో ఎన్నికయ్యాడు.[3] ప్రతాప్ రెడ్డి 2014, 2018 శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి ఓడిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీలో 2019 మార్చి 22న చేరాడు.[4]
ప్రతాప్ రెడ్డి 2023లో జరిగే తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో 2023 అక్టోబరు 20న ఆమె బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి[5] కోరుట్ల కాంగ్రెస్ విజయభేరి యాత్ర క్యాంప్‌లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[6][7]
కుటుంబం
[మార్చు]ప్రతాపరెడ్డి భార్య చరిత, ఈమె సాధారణ గృహిణి. అన్న కృష్ణారెడ్డి, వదిన అరుంధతి గ్రామ సర్పంచులుగా పనిచేశారు.
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 22-3-2009
- ↑ నమస్తే తెలంగాణ దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 31-7-2011
- ↑ Sakshi (7 August 2023). "ఈసారి షాద్‌నగర్ నియోజకవర్గంలో తొలి హ్యాట్రిక్ సాధ్యమా?". Archived from the original on 21 October 2023. Retrieved 21 October 2023.
- ↑ Andhrajyothy (18 October 2023). "బీఆర్‌ఎ్‌సకు భారీ షాక్". Archived from the original on 18 October 2023. Retrieved 18 October 2023.
- ↑ HMTV (20 October 2023). "బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి". Archived from the original on 21 October 2023. Retrieved 21 October 2023.
- ↑ Disha (20 October 2023). "బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్…కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే, జడ్పీటీసీలు". Archived from the original on 21 October 2023. Retrieved 21 October 2023.
- ↑ V6 Velugu (21 October 2023). "కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి". Archived from the original on 21 October 2023. Retrieved 21 October 2023.
{{cite news}}
: zero width space character in|title=
at position 10 (help)CS1 maint: numeric names: authors list (link)