షాద్‌నగర్ శాసనసభ నియోజకవర్గం
షాద్‌నగర్ | |
— శాసనసభ నియోజకవర్గం — | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format |
|
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి |
ప్రభుత్వం | |
- శాసనసభ సభ్యులు |
రంగారెడ్డి జిల్లా లోని శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గం 4 మండలాలు ఉన్నాయి. పునర్విభజన ఫలితంగా ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వుడ్ నుంచి తిరిగి జనరల్‌కు మారింది. జనరల్ విభాగములో ఈ నియోజకవర్గము 1967లో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ఎస్.సీలకు కేటాయించబడింది. 1967 నుండి 2007 వరకు ఎస్సీలకు రిజర్వుడ్ నియోజకవర్గముగా ఉంది. గతంలో ఈ నియోజకవర్గంలో భాగంగా ఉన్న బాలానగర్, నవాబుపేట మండలంలోని గ్రామాలు పునర్వ్యవస్థీకరణ ఫలితంగా జడ్చర్ల నియోజకవర్గంలో కలిశాయి. ఈ నియోజకవర్గం నుండి పి. శంకరరావు 4 సార్లు విజయం సాధించాడు.[1][2][3]
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు
[మార్చు]నియోజకవర్గపు గణాంకాలు
[మార్చు]- 2001 లెక్కల ప్రకారం జనాభా: 2,47,626.
- ఓటర్ల సంఖ్య (2008 ఆగస్టు నాటికి): 1,86,498.[4]
- ఎస్సీ, ఎస్టీల శాతం: 18.23%, 8.59%.
ఎన్నికైన శాసనసభ్యులు
[మార్చు]ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ప్రతాప్ రెడ్డి శాసనసభ్యుడిగా కొనసాగుతున్నాడు.
- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ 1952 బూర్గుల రామకృష్ణారావు. కాంగ్రెస్ పార్టీ ఎల్.లక్ష్మారెడ్డి స్వత్రంత్ర అభ్యర్థి 1957 షాజహాన్ బేగం[5] కాంగ్రెస్ పార్టీ ఎల్.లక్ష్మారెడ్డి స్వత్రంత్ర అభ్యర్థి 1962 రాయికల్ దామోదర్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ ఎ.బి.భారి స్వతంత్ర అభ్యర్థి 1967 కె.నాగన్న భారత జాతీయ కాంగ్రెస్ బి.మశ్చీందర్ రావు స్వతంత్ర అభర్థి 1972 ఎన్.వి.జగన్నాథం భారత జాతీయ కాంగ్రెస్ కంబయ్య స్వతంత్ర అభ్యర్థి 1978 బి.కిష్టయ్య భారత జాతీయ కాంగ్రెస్ బంగారు లక్ష్మణ్ జనతా పార్టీ 1983 పి.శంకరరావు భారత జాతీయ కాంగ్రెస్ పి.రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ 1985 ఎం.ఇందిర[5][6] తెలుగుదేశం పార్టీ బి.కృష్ణయ్య భారత జాతీయ కాంగ్రెస్ 1989 పి.శంకరరావు భారత జాతీయ కాంగ్రెస్ ఎం.ఇందిర తెలుగుదేశం పార్టీ 1994 బక్కని నరసింహులు [7] తెలుగుదేశం పార్టీ పి.శంకరరావు భారతీయ జాతీయ కాంగ్రెస్ 1999 పి.శంకరరావు భారత జాతీయ కాంగ్రెస్ ఎస్.బాలు భారతీయ జనతా పార్టీ 2004 పి.శంకరరావు భారత జాతీయ కాంగ్రెస్ బక్కని నరసింహులు తెలుగుదేశం పార్టీ 2009 చౌలపల్లి ప్రతాపరెడ్డి కాంగ్రెస్ పార్టీ అంజయ్య యాదవ్ తెలంగాణ రాష్ట్ర సమితి 2014 అంజయ్య యాదవ్ తెలంగాణ రాష్ట్ర సమితి చౌలపల్లి ప్రతాపరెడ్డి కాంగ్రెస్ పార్టీ 2018 అంజయ్య యాదవ్ తెలంగాణ రాష్ట్ర సమితి చౌలపల్లి ప్రతాపరెడ్డి కాంగ్రెస్ పార్టీ 2023[8] వీర్లపల్లి శంకర్ కాంగ్రెస్ పార్టీ అంజయ్య యాదవ్ బీఆర్ఎస్
1999 ఎన్నికలు
[మార్చు]1999 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన పి.శంకర్ రావు తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎస్.బాలుపై 6010 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. శంకర్ రావుకు 56195 ఓట్లు లభించగా, ఎస్.బాలు 50185 ఓట్లు పొందినాడు. మొత్తం ఐదుగురు పోటీచేయగా ప్రధాన పోటీ వీరిద్దరి మధ్యనే కొనసాగింది. బరిలో ఉన్న మిగితా ముగ్గురు అభ్యర్థులు డిపాజిట్టు కోల్పోయారు.
2004 ఎన్నికలు
[మార్చు]2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో షాద్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన పి.శంకర్ రావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బక్కిని నర్సిములుపై 10632 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. శంకర్ రావుకు 65360 ఓట్లు రాగా, బక్కిని నర్సిములు 54728 ఓట్లు సాధించాడు.
- వివిధ అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు
క్రమసంఖ్య | అభ్యర్థి పేరు | అభ్యర్థి పార్టీ | సాధించిన ఓట్లు |
---|---|---|---|
1 | పి.శంకర్ రావు | కాంగ్రెస్ పార్టీ | 65360 |
2 | బక్కని నర్సిములు | తెలుగుదేశం పార్టీ | 54728 |
3 | సత్యవతి | బహుజన్ సమాజ్ పార్టీ | 6372 |
2009 ఎన్నికలు
[మార్చు]2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున వనం ఝాన్సీరాణి[9] కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతాప్ రెడ్డి, ప్రజారాజ్యం పార్టీ నుండి మిట్టూనాయక్, లోక్‌సత్తా పార్టీ తరఫున పి.నరేందర్, తెలుగుదేశం పార్టీ మద్దతుతో మహాకూటమి తరఫున తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన అంజయ్య యాదవ్ పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రతాపరెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి వై.అంజయ్య యాదవ్ పై 9400కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.[10]
నియోజకవర్గ ప్రముఖులు
[మార్చు]- బూర్గుల రామకృష్ణారావు
హైదరాబాదు రాష్ట్ర ఏకైక ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు ఈ నియోజకవర్గపు తొలి శాసనసభ్యుడు. షాద్‌నగర్ పట్టణం సమీపంలోని బూర్గుల గ్రామానికి చెందినవాడు. ఆంధ్రప్రదేశ్ అవతరణ సమయంలో తన ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన మహనీయుడు.
- పి.శంకర్ రావు
- వైద్యశాస్త్రం అభ్యసించి వైద్యవృత్తి చేపట్టిన పి.శంకర రావు షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎన్నికైనాడు. 1999-04 వరకు కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఉపనాయకుడిగా వ్యవహరించిన శంకర్‌రావు అంతకు క్రితం 1992-94 కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో చిన్ననీటిపారుదల శాఖామంత్రిగానూ వ్యవహరించాడు.
- చౌలపల్లి ప్రతాపరెడ్డి
దూసకల్ గ్రామానికి చెందిన ప్రతాపరెడ్డి 1995లో జడ్పీటీసి సభ్యుడిగా ఎన్నికై, 2009లో శాసనసభలో ప్రవేశించాడు.
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
[మార్చు]ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2014 84 Shadnagar GEN Anjaiah Yelganamoni M TRS 76000 Chowlapally Pratap Reddy M INC 62530 2009 84 Shadnagar GEN Chowlapally Pratap Reddy M INC 62222 Anjaiah Yelganamoni M TRS 52384 2004 191 Shadnagar (SC) Dr.P.Shankar Rao M INC 65360 Bakkani Narasimulu M తె.దే.పా 54728 1999 191 Shadnagar (SC) Dr.P.Shanker Rao M INC 56195 Dr. Balu.S M BJP 50185 1994 191 Shadnagar (SC) Bakkani Narsimulu M తె.దే.పా 72963 Shanker Rao P M INC 27141 1989 191 Shadnagar (SC) Shankar Rao P. M INC 48314 Indira M తె.దే.పా 39614 1985 191 Shadnagar (SC) M. Indira F తె.దే.పా 37889 B. Kistaiah M INC 30871 1983 191 Shadnagar (SC) Shankar Rao M INC 32919 Puttapaga Radhakrishna M IND 29916 1978 191 Shadnagar (SC) Kistaiah Bheeshva M INC (I) 30669 Bangaru Laxman M JNP 20926 1972 190 Shadnagar (SC) N. V. Jagannadham M INC 24647 Kambiah M IND 10820 1967 190 Shadnagar (SC) K. Naganna M INC 11367 B. M. Rao M SWA 5997 1962 206 Shadnagar GEN Damodara Reddy M INC 16805 Afzal Bia Bani M IND 8817 1957 10 Shadnagar GEN Shahjahan Begum F INC 9965 L. Laxmareddy M IND 6542
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (12 April 2022). "శాసనసభ స్థానాలు-ప్రత్యేకతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
- ↑ Sakshi (7 August 2023). "ఈసారి షాద్‌నగర్ నియోజకవర్గంలో తొలి హ్యాట్రిక్ సాధ్యమా?". Archived from the original on 21 October 2023. Retrieved 21 October 2023.
- ↑ Eenadu (21 November 2023). "పాలమూరు పందెం కోళ్లు". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
- ↑ ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, పేజీ 1, తేది 01-10-2008.
- ↑ 5.0 5.1 Eenadu (29 October 2023). "శాసన సభలో అతివల కేతనం". Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
- ↑ EENADU (9 November 2023). "అతివలకు అవకాశం తక్కువే". Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
- ↑ ఆంధ్రజ్యోతి (19 July 2021). "తెలంగాణ టీడీపీకి కొత్త బాస్". Archived from the original on 19 జూలై 2021. Retrieved 19 July 2021.
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
- ↑ సాక్షి దినపత్రిక, తేది 17-05-2009