వీర్లపల్లి శంకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కె. శంకరయ్య (కాసులవాద శంకరయ్య )

ఎమ్మెల్యే
పదవీ కాలం
3 డిసెంబర్ 2023 - ప్రస్తుతం
నియోజకవర్గం షాద్‌నగర్ నియోజకవర్గం

పదవీ కాలం
1995 - 2002

వ్యక్తిగత వివరాలు

జననం 1969 మార్చి 15
వీర్లపల్లి గ్రామం, నందిగామ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు బహుజన్ సమాజ్ పార్టీ
తల్లిదండ్రులు కాసులవాద రామయ్య, అంజమ్మ
నివాసం ఇంటి.నెం.18-392/H/1, భగీరథ కాలనీ, షాద్‌నగర్, ఫరూఖ్‌నగర్ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం

వీర్లపల్లి శంకర్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికల్లో షాద్‌నగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2][3]

జననం, విద్యాభాస్యం[మార్చు]

వీర్లపల్లి శంకర్ 1969 మార్చి 15న తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, నందిగామ మండలం, వీర్లపల్లి గ్రామంలో[4] కాసులవాద రామయ్య, అంజమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన పాఠశాల విద్యను నందిగామలో, ఇంటర్మీడియట్‌ షాద్‌నగర్‌ జూనియర్‌ కళాశాలలో, డిగ్రీ నగరంలోని సిటీ కాలేజీలో బి.కామ్ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

వీర్లపల్లి శంకర్ రాజకీయాలపై ఆసక్తితో 1992లో కాంగ్రెస్‌ పార్టీలో చేరి 1995 నుండి 2002 వరకు సర్పంచ్‌గా గెలిచాడు. ఆయన 2004 నుండి పదేళ్లు కొత్తూర్‌ మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన 2009 ఎన్నికల్లో చౌలపల్లి ప్రతాపరెడ్డి గెలుపులో కీలకంగా పని చేసి 2014 ఎన్నికల ముందు కొత్తూరు జెడ్పీటీసీ టికెట్‌ విషయంలో ప్రతాపరెడ్డితో విభేదించి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి అంజయ్య యాదవ్‌ గెలుపులో కీలకంగా పని చేశాడు. ఆయన ఆ తరువాత 2018 ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోగా ఆయనకు 27,814 ఓట్లు సాధించాడు. [5]

వీర్లపల్లి శంకర్ ఆ తరువాత 2021లో రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరి పార్టీ పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేసి, 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో షాద్‌నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ పొంది, నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి బీఆర్​ఎస్​ అభ్యర్థి అంజయ్య యాదవ్‌పై ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యాడు.[6][7]

మూలాలు[మార్చు]

  1. 10TV Telugu (4 December 2023). "119 అసెంబ్లీ నియోజకవర్గాల విజేతలు ఎవరో తెలుసుకోండి" (in telugu). Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. Andhrajyothy (4 December 2023). "TS Elections Winners: విజేతల వివరాలు ఇలా." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  3. BBC News తెలుగు (5 December 2023). "తెలంగాణ రిజల్ట్స్ 2023: మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు?". Archived from the original on 5 December 2023. Retrieved 5 December 2023.
  4. Sakshi (5 December 2023). "ఇంట గెలిచారు!". Archived from the original on 9 December 2023. Retrieved 9 December 2023.
  5. Andhrajyothy (5 December 2023). "ఒక్కడుగా వచ్చి.. అఖండుడిగా ఎదిగి!". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  6. Sakshi (4 December 2023). "షాద్‌నగర్‌". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  7. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.