షాజహాన్ బేగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

షాజహాన్ బేగం భారత జాతీయ కాంగ్రేసుకు చెందిన రాజకీయ నాయకురాలు. ఈమె 1952లో పరిగి శాసనసభ నియోజకవర్గం నుండి ఏకగ్రీవంగా ఎన్నికై హైదరాబాదు రాష్ట్ర శాసనసభా సభ్యురాలైంది. ఆ తర్వాత 1957లో షాద్‌నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి, స్వతంత్ర అభ్యర్ధిని ఓడించి, అవిభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ సభ్యురాలైంది.

1952లో ఏదైనా ఒక నియోజకవర్గం నుండి ముస్లిం మహిళను పోటీలోకి దించాలని కాంగ్రేసు అధిష్టానం నిర్ణయం తీసుకున్నది. ఆ మేరకు హైదరాబాదుకు చెందిన షాజహాన్ బేగంను కొత్తగా పాలమూరు నుండి ఏర్పడిన పరిగి నియోజకవర్గం నుండి పోటీ చేయటానికి ప్రతిపాదించారు. స్థానికేతరులకు సీటు కేటాయించడంతో స్థానికులలో కొంత వ్యతిరేకత వచ్చినా, అప్పటి పాలమూరు జిల్లా కాంగ్రేసు అధ్యక్షుడు పల్లె హనుమంతరావు జోక్యంతో వివాదం సద్దుమణిగింది. స్థానిక స్వాతంత్ర సమరయోధుడు కమతం జగన్మోహన్ రెడ్డి అదే స్థానం నుండి పోటీ చేయాలని అనుకున్నా, పార్టీ పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి పోటీ నుండి విరమించుకున్నాడు. అలా షాజహాన్ బేగం పరిగి నుండి ఏకగ్రీవంగా శాసనసభకు ఎన్నికైంది. రెండవ సారి 1957 ఎన్నికల తరుణంలో కూడా పరిగి నియోజకవర్గం నుండి షాజహాన్ బేగంణూ ఏకగ్రీవంగా ఎన్నిక చేసేందుకు ఆమె అనుచరులు ప్రయత్నించినా, అది కుదరలేదు.[1] పరిగి నియోజకవర్గం సీటు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వగా, షాజహాన్ బేగం, షాద్ నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి రెండవ సారి శాసనసభకు ఎన్నికైంది.

మూలాలు

[మార్చు]
  1. "ఆరంభమే సంచలనం.. మహిళలకు అగ్రాసనం". ఈనాడు. 22 అక్టోబరు 2023. Retrieved 26 July 2024.