కోరుకంటి చందర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోరుకంటి చందర్
కోరుకంటి చందర్

కోరుకంటి చందర్


పదవీ కాలము
2018 డిసెంబర్ 11 - ప్రస్తుతం
ముందు సోమారపు సత్యనారాయణ
నియోజకవర్గం రామగుండం శాసనసభ నియోజకవర్గం[1]

వ్యక్తిగత వివరాలు

జననం సెప్టెంబర్ 23, 1972
పట్టణం: గోదావరిఖని, మండలం: రామగుండం, జిల్లా:పెద్దపల్లి తెలంగాణ
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి విజయ
నివాసం పట్టణం: 17-5-225/1, చంద్రశేఖర్ నగర్, గోదావరిఖని, మండలం: రామగుండం, జిల్లా:పెద్దపల్లి తెలంగాణ
మతం హిందూమతము

కోరుకంటి చందర్ పటేల్ (సెప్టెంబర్ 23, 1972 ) తెలంగాణ ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు. 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వార్డ్‌ బ్లాక్‌ పార్టీ టిక్కెట్ పై పోటీచేసి తన సమీప టిఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ పై 26,090 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. మలిదశ ఉద్యమంలో భాగంగా తెలంగాణ సాధన పాదయాత్ర పేరుతొ 48 కి. మీ . పాదయాత్ర చేశాడు. ఇతను ఉద్యమంలో భాగంగా 45 రోజులు జైలు జీవితం గడిపాడు.

బాల్యం, విద్యాబ్యాసం[మార్చు]

కోరుకంటి చందర్ 1972 సెప్టెంబర్ 23 న మల్లయ్య, లక్ష్మీ దంపతులకు రెండో సంతానంగా జన్మించాడు. కాకతీయ యూనివర్సిటీలో MA పొలిటికల్ సైన్స్ పూర్తి చేశాడు. [2]

కుటుంబం[మార్చు]

ఈయనకు 1994లో విజయతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉజ్వల, మనిదీప్.

జీవిత ప్రస్థానం[మార్చు]

తెలుగుదేశం పార్టీ 1993-97 వరకు గోదావరిఖని పట్టణానికి 1997-99 వరకు రామగుండం ప్రాంతానికి తెలుగు యువత తరపున ప్రధాన కార్యదర్శిగా, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా చేశాడు. 2001లో కొప్పుల ఈశ్వర్ అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన తర్వాత రామగుండం శాసనసభ నియోజకవర్గంకు ఉద్యమ సారథిగా వ్యవహరించాడు. 2002లో టీఆర్ఎస్వై సంయుక్త కార్యదర్శిగా, మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం టీఆర్ఎస్వై జనరల్ సెక్రటరీ చేసాడు. 2009 మహాకూటమిలో భాగంగా రామగుండం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయాడు. 2014 ఎన్నికలలో పోటీచేసి 2260 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో సోమారపు సత్యనారాయణ పై ఓడాడు. తెలంగాణ శాసనసభ ఎన్నికలు (2018)లో తన సమీప అభ్యర్థి సోమారపు సత్యనారాయణపై పోటీచేసి 26,090 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు.[3] ఈ నియోజకవర్గంలో మొత్తం 1,35,678 ఓట్లు పోలవగా కోరుకంటి చందర్ కు 60,444 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ కు 34,354 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్‌సింగ్ ఠాకూర్‌కు 26,614 ఓట్లు పోలయ్యాయి.

కార్యక్రమాలు[మార్చు]

  • 2009 - పల్లె నిద్ర - బస్తీ నిద్ర అనే కార్యక్రమాన్ని 6రోజుల పాటు నిర్వహించారు.
వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రశంసా పత్రము బహుకరణం
  • 2009 - తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థి మేలుకో - తెలంగాణ ఏలుకో
  • 2011 - వందరోజుల నిరాహరదీక్ష నిర్వహించారు.
  • 2012 - తెలంగాణ సాధన పాదయాత్ర పేరుతో కుక్కలగూడురు నుంచి కాలని వరకు 48కి.మీ. వందమందితో పాదయాత్ర నిర్వహించారు.
  • 2017 - ప్రపంచ జానపద రోజుని పురస్కరించుకొని తెలంగాణ జానపద కళా ఉత్సవం పేరిట వంద మంది కళాకారులతో వంద నిమిషాలు నిరాటకంగా నిర్వహించి వండర్ బుక్ ఆఫ్ రికార్డుని నెలకొల్పారు.
  • 2017 - అభినందన సత్కార సభ పేరిట వంద మంది ఉద్యమకారులను, ఆత్మీయ సత్కారం పేరిట 2009 మంది ఉద్యమకారులను సత్కరించారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Desk, The Hindu Net (2018-12-11). "Telangana Assembly elections 2018: Rebel candidate K. Chander Patel snatches victory from TRS in Ramagundam". The Hindu (in ఇంగ్లీష్). ISSN 0971-751X. Retrieved 23 September 2019.
  2. కోరుకంటి చందర్. "రైతుల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం". www.ntnews.com. Retrieved 11 December 2017.
  3. "Ramagundam Election Result 2018 Live Updates: Korukanti Chandar Patel of AIFB Wins". News18. Retrieved 23 September 2019.