సోమారపు సత్యనారాయణ
సోమారపు సత్యనారాయణ | |||
| |||
MLA
| |||
పదవీ కాలం 2014 - 2018 | |||
తరువాత | కోరుకంటి చందర్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | రామగుండం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 16-07-1948 మంథని, తెలంగాణ |
సోమారపు సత్యనారాయణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, తెలంగాణ ఆర్టీసీ మాజీ చైర్మన్, రామగుండం మాజీ శాసనసభ సభ్యుడు.
బాల్యం విద్యాభ్యాసం
[మార్చు]సోమారపు సత్యనారాయణ తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా, మంథని లో 16 జులై 1948లో జన్మించాడు.[1] ఆయన వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నుండి ఎంబీఏ పూర్తి చేశాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]సోమారపు సత్యనారాయణ రాజకీయాల్లోకి రాకముందు రామగుండం ఎరువుల కర్మాగారంలో ఇంజినీర్‌గా పని చేశాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ రంగంలోకి వచ్చాడు. ఆయన 30 జూన్ 1998న తొలిసారి ఏర్పడ్డ రామగుండం మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి మున్సిపాలిటీ తొలి చైర్మన్‌గా పని చేశాడు. ఆయన 2004 జూలై 2 వరకు మున్సిపల్ చైర్మన్‌గా పని చేసి 2 జూలై 2004లో తెలుగుదేశం పార్టీ లో చేరాడు.సోమారపు సత్యనారాయణ 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మంథని నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చేతిలో ఓడిపోయాడు. ఆయన 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి బాబర్ సలీంపాషాపై విజయం సాధించిన తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరాడు. తెలంగాణ ఉద్యమం సమయంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ లో చేరాడు. సోమారపు సత్యనారాయణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన 2014లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచాడు.[3] ఆయన 29 ఏప్రిల్ 2016లో తెలంగాణా రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్‌గా భాద్యతలు చేపట్టాడు. ఆయన 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం భారతీయ జనతా పార్టీలో చేరాడు.[4][5]బీజేపీలో చేరిన అనంతరం ఆయనను పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు.
- శాసనసభకు పోటీ
సంవత్సరం | నియోజకవర్గం | నియోజకవర్గం రకం | గెలిచిన అభ్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | ఓడిన అభ్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | మెజారిటీ |
---|---|---|---|---|---|---|---|---|---|
2004 | మంథని | జనరల్ | దుద్దిళ్ళ శ్రీధర్ బాబు | కాంగ్రెస్ పార్టీ | సోమారపు సత్యనారాయణ | తెలుగుదేశం పార్టీ | |||
2009 | రామగుండం | జనరల్ | సోమారపు సత్యనారాయణ | స్వతంత్ర | బాబర్ సలీంపాషా | కాంగ్రెస్ పార్టీ | |||
2014 | రామగుండం | జనరల్ | సోమారపు సత్యనారాయణ | టీఆర్ఎస్ | కోరుకంటి చందర్ | ఆలిండియా పార్వర్డ్‌బ్లాక్ | |||
2019 | రామగుండం | జనరల్ | కోరుకంటి చందర్ | ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ | సోమారపు సత్యనారాయణ | టీఆర్ఎస్ |
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (9 November 2023). "మంథని నేతలు.. మరో చోట ఎమ్మెల్యేలు". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
- ↑ Sakshi (10 July 2019). "రాలిన గులాబీ రేకు". Sakshi. Archived from the original on 14 జూలై 2021. Retrieved 14 July 2021.
- ↑ Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
- ↑ The New Indian Express (10 July 2019). "'Humiliated' former MLA Somarapu Satyanarayana quits 'indisciplined' TRS". Archived from the original on 14 July 2021. Retrieved 14 July 2021.
- ↑ Sakshi (16 July 2019). "కాంగ్రెస్ టు బీజేపీ.. వయా టీడీపీ, టీఆర్‌ఎస్". Sakshi. Archived from the original on 14 July 2021. Retrieved 14 July 2021.