కృష్ణ ప్రభ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కృష్ణ ప్రభ
జననం (1987-11-25) 1987 నవంబరు 25 (వయసు 36)
ఎర్నాకులం, కేరళ, భారతదేశం
వృత్తిసినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు2008–ప్రస్తుతం

కృష్ణ ప్రభ (జననం 1987 నవంబరు 25) భారతీయ నటి, నర్తకి. ఆమె ప్రధానంగా మలయాళ చిత్రాలలో నటిస్తుంది.[1] బి. ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహించిన మాడంపి (2008) చిత్రంతో ఆమె చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిన లైఫ్ ఆఫ్ జోసుట్టి (2015)లో ఆమె మోల్లికుట్టి పాత్రను పోషించింది.

జీతూ జోసఫ్ దర్శకత్వలో మోహన్‌లాల్‌, ప్రియమణి జంటగా వచ్చిన నేరు (2023) చిత్రంలో కృష్ణ ప్రభ డాక్టర్ పాత్ర పోషించింది. ఈ చిత్రం 2024 జనవరి 23 నుండి మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2][3]

ప్రారంభ జీవితం

[మార్చు]

ప్రభాకరన్ నాయర్, షీలా దంపతులకు ఆమె జన్మించింది. ఆమె తన ప్రాథమిక విద్యను కలమస్సేరిలోని సెయింట్ జోసెఫ్స్ స్కూల్ నుండి పూర్తి చేసింది. తేవారాలోని సేక్రేడ్ హార్ట్ కాలేజ్ నుండి హ్యుమానిటీస్‌లో హయ్యర్ సెకండరీ చదివింది. ఆమె మోహినియాట్టం, కూచిపూడి వంటి భారతీయ శాస్త్రీయ నృత్యాలలో ప్రావీణ్యం సాధించింది. బెంగుళూరులోని అలయన్స్ యూనివర్సిటీ నుండి భరతనాట్యంలో డిప్లొమా సర్టిఫికేట్ అందుకుంది. ఆమె మూడు సంవత్సరాల వయస్సు నుండి కళామండలం సుగంధి వద్ద శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందింది.[4]

కెరీర్

[మార్చు]

నర్తకిగా కెరీర్ మొదలుపెట్టిన ఆమె, ఆ తరువాత ఆసియానెట్ టీవీ ఛానెల్‌లో కామెడీ షో సజన్ పల్లురుత్తిలో ప్రజోద్‌లతో కలిసి పనిచేసింది. బి ఉన్నికృష్ణన్ సినిమాలో ఆమె అరంగేట్రం చేసింది. మలయాళ చిత్ర పరిశ్రమలో వరుస చిత్రాలలో విభిన్న పాత్రలను పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.[5]

ఆమె 2017లో తీరమ్ అనే సినిమాలో ఓ పాట పాడింది. ఆమె కొచ్చిలో జైనికా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నడుపుతోంది.

మూలాలు

[మార్చు]
  1. "Dance apart from films". Deccan Chronicle. Kochi. Retrieved 2016-08-13.[permanent dead link]
  2. TV9 Telugu (23 January 2024). "ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ బ్లాక్‌ బస్టర్‌.. తెలుగులోనూ మోహన్‌ లాల్‌ మూవీ స్ట్రీమింగ్‌.. ఎక్కడంటే?". Archived from the original on 23 January 2024. Retrieved 23 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Eenadu (19 January 2024). "మలయాళ బ్లాక్‌బస్టర్‌ 'నేరు'.. ఓటీటీలో వచ్చేస్తోంది". Archived from the original on 23 January 2024. Retrieved 23 January 2024.
  4. "Kalamandalam Suganthi about redefining mohiniyattam" Archived 12 ఏప్రిల్ 2021 at the Wayback Machine. The Hindu
  5. "Krishna Praba compared to sukumari" Archived 19 మే 2017 at the Wayback Machine. The Times of India