పులిజూదం (2019 సినిమా)
పులిజూదం | |
---|---|
దర్శకత్వం | బి. ఉన్నికృష్ణన్ |
నిర్మాత | రాక్ లైన్ వెంకటేష్ |
తారాగణం | |
సంగీతం | సుశిన్ శ్యామ్ |
నిర్మాణ సంస్థ | రాక్ లైన్ ఎంటర్ టైనర్స్ |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
పులిజూదం 2017లో మలయాళంలో 'విలన్'పేరుతో విడుదలైన ఈ సినిమాను 2019లో తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. రాక్ లైన్ ఎంటర్ టైనర్స్ బ్యానర్ పై రాక్ లైన్ వెంకటేష్ నిర్మించిన ఈ సినిమాకు బి. ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహించాడు. మోహన్ లాల్, శ్రీ కాంత్ , విశాల్, రాశీ ఖన్నా, హన్సిక, మంజు వారియర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 29 మార్చి 2019లో విడుదలైంది.[1]
కథ
[మార్చు]ఏడు నెలలు సెలవుమీద వెళ్లి వచ్చేసరికి ముగ్గురు హత్యకి గురైన కేసును మాథ్యూ (మోహన్ లాల్) అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) చేపట్టాల్సి వస్తుంది. ఇద్దరు పోలీసు అధికారులు హర్షితా చోప్రా (రాశీ ఖన్నా), ఇక్బాల్ (చెంబన్ వినోద్ జోస్) లని అసిస్టెంట్స్ గా తీసుకుంటాడు. డ్రగ్ మాఫియా ఫెలిక్స్ విన్సెంట్ (శ్రీకాంత్) , డాక్టర్ దువ్వాడ మదన గోపాల్ (విశాల్) ని అనుమానిస్తాడు మాథ్యూ . మదనగోపాల్ కి అసిస్టెంట్ గా డాక్టర్ శ్రేయ (హన్సిక) వుంటుంది. వీళ్ళిద్దరి కార్యకలాపాలు అనుమానాస్పదంగా వుంటాయి. అసలు వీళ్ళ లక్ష్యమేమిటి? డ్రగ్ మాఫియా ఫెలిక్స్ విన్సెంట్ పాత్ర ఏమిటి? చివరికీ మాథ్యూ ఆ హత్యలు చేస్తోన్న వారిని పట్టుకున్నాడా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[2]
నటీనటులు
[మార్చు]- మోహన్ లాల్ [3]
- శ్రీ కాంత్
- విశాల్
- రాశీ ఖన్నా
- హన్సిక
- మంజు వారియర్
- సిద్దిఖ్
- రెంజీ పాణికెర్
- చెంబన్ వినోద్ జోస్
- అథిర పటేల్
- సాయి కుమార్
- ఇర్షాద్
- ముత్తుమణి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: రాక్ లైన్ ఎంటర్ టైనర్స్
- నిర్మాత: రాక్ లైన్ వెంకటేష్
- రచన, దర్శకత్వం: బి. ఉన్నికృష్ణన్
- సంగీతం:
- సినిమాటోగ్రాఫర్: మనోజ్ పరమహంస
మూలాలు
[మార్చు]- ↑ Mana Telangana (12 March 2019). "'పులిజూదం' ట్రైలర్ విడుదల". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News. Archived from the original on 5 జూలై 2021. Retrieved 5 July 2021.
- ↑ Focus, Filmy; Focus, Filmy (21 March 2019). "పులిజూదం". Filmy Focus. Archived from the original on 5 జూలై 2021. Retrieved 5 July 2021.
- ↑ Tollywood Net (27 March 2019). "`పులిజూదం` చిత్రాన్ని పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్ - మోహన్ లాల్ |". Archived from the original on 5 జూలై 2021. Retrieved 5 July 2021.