బి.ఎస్. నారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బి.ఎస్. నారాయణ
జననం1929
కొత్తపల్లి, కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
మరణంనవంబర్ 23, 1994
హైదరాబాదు
మరణ కారణంశ్వాసకోశ వ్యాధి
నివాస ప్రాంతంహైదరాబాదు, తెలంగాణ
వృత్తితెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత

బి.ఎస్. నారాయణ (1929 - నవంబర్ 23, 1994) తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు చలనచిత్ర దర్శకుడు, నిర్మాత. జాతీయస్థాయిలో తెలుగు సినీరంగానికి మొట్టమొదటిసారి ఉత్తమ నటి అవార్డును, రెండు జాతీయ అవార్డులను అందించాడు.[1]

జననం

[మార్చు]

నారాయణ 1929వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి గ్రామంలో జన్మించాడు.[2]

సినీరంగ ప్రస్థానం

[మార్చు]

సినీరంగంలో స్థిరపడాలన్న ఉద్దేశ్యంతో 1952లో మద్రాసుకు వెళ్ళాడు. తిలక్‌, కె.ఎస్. ప్రకాశరావు, హెచ్‌.వి. బబాబుల వద్ద అసోసియేట్‌ దర్శకుడిగా పనిచేసి 1960లో పూర్తిస్థాయి దర్శకుడిగా మారాడు. నిర్మాతగా 32 చిత్రాలకు పైగా నిర్మించాడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఈయన దర్శకత్వం వహించిన నిమజ్జనం చిత్రం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికవ్వడమేకాకుండా నటి శారదకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డుతో పాటు ‘‘ఊర్వశి’’ అవార్డును తెచ్చిపెట్టింది. ఇది జాతీయస్థాయిలో తెలుlగు సినీరంగానికి వచ్చిన మొట్టమొదటిసారి ఉత్తమ నటి అవార్డు.

1990లో షుగర్ వ్యాధి వల్ల దృష్టిని కోల్పోయిన నారాయణ ఇంటికే పరివితమయ్యారు. అలాంటి పరిస్థితుల్లో కూడా కరీంనగర్లోని రేకుర్తి ఉన్న లయన్స్ కాంతి ఆసుపత్రి పైన తమసోమా జ్యోతిర్గమయ డాక్యుమెంటరీ చిత్రం తీశాడు. అదే సమయంలో 1991లో కరీంనగర్‌లోని యువకులు కొంతమందితో మార్గదర్శి అనే చిత్రాన్ని రూపొందించాడు. అంధుడిగా ఉండి సినిమా నిర్మించినందుకు నారాయణకు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ వచ్చింది. అంతేకాకుండా మార్గదర్శి చిత్రానికి ఉత్తమ జాతీయ సమైఖ్యతా చిత్రంగా నంది అవార్డు కూడా లభించింది.

దర్శకత్వం వహించిన చిత్రాలు

[మార్చు]

గుర్తింపులు

[మార్చు]
  1. బి.ఎస్. నారాయణ దర్శకత్వం వహించిన నిమజ్జనం సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికవ్వడమేకాకుండా తెలుగు సినీరంగంలో తొలి జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకుంది.
  2. నిమజ్జనం సినిమా బెంగళూరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పనోరమా విభాగంలో ప్రదర్శించబడింది.
  3. నిమజ్జనం, ఊరుమ్మడి బతుకులు సినిమాలు మాస్కో, బెర్లిన్, ఫ్రాన్స్ తదితర అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించబడింది.

ఇతర వివరాలు

[మార్చు]
  1. దక్షిణ భారత సినీ దర్శకుల సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశాడు.
  2. సినీ దర్శకుల సంఘాన్ని స్థాపించి, రాజా రామ్ డైరెక్టర్స్ కాలనీ ఏర్పాటు చేశాడు.

మరణం

[మార్చు]

నారాయణ శ్వాసకోశ వ్యాధి కారణంగా 1994, నవంబర్ 23న మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ, వ్యాసాలు (23 November 2016). "సినీ చైతన్యం బి.ఎస్.నారాయణ". వారాల ఆనంద్. Archived from the original on 16 మార్చి 2019. Retrieved 16 March 2019.
  2. ఆంధ్రజ్యోతి, ఎడిటోరియల్ (23 November 2017). "విలక్షణ దర్శకుడు బి.ఎస్‌.నారాయణ". పొన్నం రవిచంద్ర. Archived from the original on 16 March 2019. Retrieved 16 March 2019.