పొన్నం రవిచంద్ర
డా. పొన్నం రవిచంద్ర గౌడ్ | |
|---|---|
| జననం | 1962 జూన్ 19 |
| వృత్తి | జర్నలిస్ట్, రచయిత, సినీ విమర్శకులు |
| తల్లిదండ్రులు | పొన్నం సత్తయ్య గౌడ్, మల్లమ్మ |
| బంధువులు | పొన్నం అశోక్ గౌడ్, పొన్నం ప్రభాకర్ (సోదరులు), లీలారాణి, విమల (సోదరీమణులు) |
డా. పొన్నం రవిచంద్ర తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, సినీ విమర్శకుడు, కవి, రచయిత. రవిచంద్ర జర్నలిస్ట్ గా తెలుగు సినిమాతో సహా భారతీయ సినిమా, సాహిత్యం, లలిత కళలు, సామాజిక అంశాలపై వందలాది వ్యాసాలు, కవితలు రాస్తున్న బహుముఖ ప్రతిభ కలిగిన వ్యక్తి. ఆంధ్రజ్యోతి, పాలపిట్ట, నవతెలంగాణ, వెలుగు, తంగేడు పత్రికలలో ఇంతవరకు ఆయన రాసిన సినిమా వ్యాసాలు 200కి పైగా ప్రచురితమయ్యాయి. 80 ఏళ్ల తెలుగు సినీ ప్రస్థానంపై ఆయన రచించిన "ప్రస్థానం" పుస్తకానికిగాను 2012లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ సినీ పుస్తకంగా నంది అవార్డును అందుకున్నాడు.[1][2] 2025లో తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్[3] 2024 సంవత్సరానికి గాను ఉత్తమ సినీ విమర్శకుడుగా అవార్డును పొందాడు.
పొన్నం రవిచంద్ర 2024 జనవరి 20న హైదరాబాద్‌లో యునైటెడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు.[4] ఆయన 8వ నేపాల్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి జ్యూరీ సభ్యుడిగా నియమితుడయ్యాడు.[5]
కరీంనగర్ ఫిల్మ్ సొసైటీకి (కఫిసో) అధ్యక్షుడిగా గత 8 సంవత్సరాల (2019-2025) నుండి పనిచేస్తున్నారు. క.ఫి.సొ ద్వారా జాతీయ, రాష్ట్రస్థాయి లఘు చిత్ర, డాక్యుమెంటరీ చలనచిత్రోత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా (దక్షిణ ప్రాంతం)కు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

జననం, విద్యాభాస్యం
[మార్చు]పొన్నం రవిచంద్ర తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పాత బజార్ లో 1962 జూన్ 19న కీ.శే పొన్నం సత్తయ్య గౌడ్, మల్లమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన పదో తరగతి వరకు కరీంనగర్‌లోని దన్గర్ వాడి ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్మీడియేట్ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో, కరీంనగర్ ఎస్. ఆర్. ఆర్. ప్రభుత్వ కళాశాలలో బిఎ, కాకతీయ యూనివర్సిటీలో ఎల్.ఎల్.బి పూర్తి చేశాడు.
జర్నలిస్టుగా
[మార్చు]పొన్నం రవి చంద్ర ఆంధ్రపత్రిక ద్వారా 1987లో తన జర్నలిజం జీవితాన్నిప్రారంభించి కరీంనగర్ స్టోరీలు, ఇంటర్వ్యూలు, బైలైన్ వార్తలను ప్రధానంగా రాసేవాడు. ఆయన ఆంధ్రపత్రిక మూతపడిన తర్వాత ఆంధ్రభూమి దినపత్రికలో నాలుగు నెలలు పనిచేసి ఆ తర్వాత 1991లో 'మానేరు టైమ్స్' వార పత్రికను కరీంనగర్ కేంద్రంగా ప్రారంభించాడు. అప్పట్లో మల్టీకలర్లో 10 వేల కాపీలు ముద్రించి గోదావరిఖని, జగిత్యాల, సిరిసిల్ల ప్రాంతాలకు పంపేవాడు. అందులో 'ఊపర్ శేర్వాని అందర్ పరేషాని' జూకంటి జగన్నాధం శీర్షిక, మానేరు తీరం, మాడభూషి శ్రీధర్ 'హైదరాబాద్ లేఖ', 'ఈ వారం కవిత' తోపాటు 'గోదావరి' పేరు మీద అప్పుడు వస్తున్న ఉద్యమాల మీద వచ్చిన వ్యాసాలు పత్రికకు రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చాయి. ఆ కాలంలో ఈ పత్రికలో పనిచేసిన వారు ఈనాడు ఎందరో ప్రముఖ పత్రికలలో పనిచేస్తున్నారు.
రవిచంద్ర 1994 వరకు 'మానేరు టైమ్స్' ను విజయవంతగా నిర్వహించి కరీంనగర్‌లో సంపూర్ణ విద్య కోసం జరిగిన ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన 'అక్షర ఉజ్వల' పత్రిక సంపాదకత్వ బాధ్యతల్లో ఒకడిగా ఉన్నాడు. అక్షర ఉజ్వల ప్రభుత్వ పత్రికకు ఆయన సమయం ఎక్కువగా వెచ్చించడం వల్ల 'మానేరు టైమ్స్' 2006 నుండి 2010 వరకు పక్షపత్రికగా వెలువడింది. రవిచంద్ర మధ్యలో 'మహానగర్' 'మెట్రో' 'వర్తమానం' దిన పత్రికలలో పనిచేసి 2003-2005 మధ్యలో 'మానేరు టైమ్స్' తిరిగి పునరుద్ధరించి దినపత్రికగా తీసుకవచ్చారు. ఆయన 2010 నుంచి 2014 వరకు సమాచార శాఖ వెలువరించే ఆంధ్రప్రదేశ్ మాస పత్రికకు అసోసియేట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించాడు.


రచనలు
[మార్చు]- రవిచంద్ర 2005లో కరీంనగర్ జిల్లా ఏర్పడి వందేళ్లు అయిన సందర్భంగా 2005లో జిల్లా చరిత్రపై సమగ్ర పరిశోధన చేసి "శత వసంతాల కరీంనగర్ " పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించాడు.
- 2012లో 80 వసంతాల తెలుగు సినీ చరిత్రపై "ప్రస్థానం" పేరుతో గ్రంథాన్ని వెలువరించాడు.
- 2024లో బాలీవుడ్ సినీ హీరో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జైరాజ్ జీవితంపై "ది ఇండియన్ సినిమా ఫస్ట్ యాక్షన్ హీరో” పేరుతో సమగ్రమైన పుస్తకాన్ని ప్రచురించాడు.[6]
- 2025లో వివిధ పత్రికలలో ప్రచురితమైన భారతీయ సినీ నటీనటుల బయోగ్రపీస్ తో "భారతీయ సినీ వైతాళికులు" అనే పుస్తకాన్ని ప్రచురించాడు
- 2025లో ‘శింజిని’ పేరుతో కవిత్వ సంకలనం.
- 2025లో "తెలంగాణ సినీ ప్రస్థానం"[7][8]

అవార్డులు
[మార్చు]- 1991: కేంద్ర మానవవనరుల శాఖ వారిచే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఉత్తమ సాంస్కృతిక నిర్వాహకుడు
- 2012: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి నంది అవార్డు
- 2019: తమిళనాడు,గ్లోబల్ ఎకనామిక్ ప్రోగ్రెస్ అండ్ రీసెర్చ్ అసోసియేషన్ నుండి భారతరత్న మదర్ థెరెసా గోల్డ్ మోడల్ అవార్డు[9]
- 2022: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా కీర్తి పురస్కారం
- 2024: యునైటెడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్[4]
- 2025: కళాశ్రీ ఆర్ట్స్ థియేటర్, జగిత్యాల సంస్థ ద్వారా అలిశెట్టి ప్రభాకర్ రాష్ట్రస్థాయి పురస్కారం
- 2024: తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్[3] 2024 సంవత్సరానికి గాను ఉత్తమ సినీ విమర్శకుడుగా
- 2025: బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ గా హైమా అవార్డు
- 2025: తెలంగాణ కల్చరల్ ఫౌండేషన్ వారి పైడి జైరాజ్ స్మారక పురస్కారం[10]
- 2026: ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్
- 2025: తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్- రెండవ ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ - ది ఫస్ట్ యాక్షన్ హీరో పైడి జయరాజ్ ప్రస్థానం[11][12]

- 2026: శ్రుతిలయ సీల్‌వెల్ - ఉగాది విశిష్ట ప్రతిభా పురస్కారాలలో భాగంగా జీవన సాఫల్య పురస్కారం[13]
జ్యూరీ మెంబర్
[మార్చు]- 2007లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకమైన నంది అవార్డుల సెలక్షన్ కమిటీకి జ్యూరీ సభ్యుడు.
- పోర్చుగల్ మెల్గాకో ఇంటర్నేషనల్ (MDOC) డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ మెంబర్ (2022)[14]
- 31 వ ఎల్'ఆల్టర్నాటివా ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ మెంబర్ - స్పెయిన్ (2024)[15]
- 8వ నేపాల్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం జ్యూరీ మెంబర్ - 2025[16][17][18]
డాక్యుమెంటరీ నిర్మాతగా
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Eenadu (6 September 2022). "విభిన్న రంగాలు.. కీర్తి పురస్కారాలు". Archived from the original on 14 September 2022. Retrieved 14 September 2022.
- ↑ BBC News తెలుగు (23 July 2022). "పైడి జైరాజ్: తెలుగు నేల నుంచి తొలి పాన్ ఇండియా స్టార్". Archived from the original on 14 September 2022. Retrieved 14 September 2022.
- 1 2 "మొదటి గద్దర్ అవార్డు ఎవరికో తెలుసా..?". Andhrajyothy. 14 June 2025. Archived from the original on 14 June 2025. Retrieved 14 June 2025.
- 1 2 Raashtra (20 January 2024). "ఘనంగా డాక్టరేట్స్ ప్రదానం.. మీడియా పార్టనర్ గా 'రాష్ట్ర'". Archived from the original on 21 January 2024. Retrieved 21 January 2024.
- ↑ "Juries | Nepal International Film Festival". Nepal International Film Festival. 13 March 2025. Archived from the original on 13 March 2025. Retrieved 13 March 2025.
- ↑ "తెలంగాణ జాతి గర్వించదగ్గ అద్భుతమైన కళాకారుడు పైడి జయరాజ్". Mana Telangana. 28 September 2024. Archived from the original on 10 May 2025. Retrieved 10 May 2025.
- ↑ "తెలంగాణ సినీ ప్రస్థానం రివ్యూ". Navatelangana. 14 February 2026. Archived from the original on 27 February 2026. Retrieved 27 February 2026.
- ↑ "తెలంగాణ సినీ ప్రస్థానంపై పుస్తకం". V6 Velugu. 28 February 2026. Archived from the original on 28 February 2026. Retrieved 28 February 2026.
- ↑ "Karimnagar: Mother Teresa Gold Model Award to Ravichandra" (in ఇంగ్లీష్). The Hans India. 17 December 2019. Archived from the original on 14 March 2025. Retrieved 14 March 2025.
- ↑ "తెలంగాణ వీరుల పేరిట అవార్డులు అభినందనీయం". Andhrajyothy. 28 July 2025. Archived from the original on 29 July 2025. Retrieved 29 July 2025.
- ↑ "గద్దర్ అవార్డ్స్ 2025: చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు". Chitrajyothy. 7 March 2026. Retrieved 7 March 2026.
- ↑ "'ది ఫస్ట్ యాక్షన్ హీరో' డాక్యుమెంటరీకి గద్దర్ అవార్డు.. పొన్నం రవిచంద్రపై ప్రశంసలు | The First Action Hero Documentary Won Gaddar 2026 Film Award Sn 1057418 | 10TV". 10TV Telugu. 7 March 2026. Archived from the original on 7 March 2026. Retrieved 7 March 2026.
- ↑ "డాక్టర్ పొన్నం రవిచంద్ర కు జీవన సాఫల్య పురస్కారం". V6 Velugu. 23 March 2026. Archived from the original on 26 March 2026. Retrieved 25 March 2026.
- ↑ "Ravichandra selected as jury member for Int'l Documentary Film Festival" (in ఇంగ్లీష్). Telangana Today. 23 February 2022. Archived from the original on 14 March 2025. Retrieved 14 March 2025.
- ↑ "Film critic Ponnam Ravichandra selected a jury member for L'Alternativa Film Festival to be held in Spain" (in ఇంగ్లీష్). The Hindu. 21 September 2024. Archived from the original on 14 March 2025. Retrieved 14 March 2025.
- ↑ "Karimnagar-based film critic Ponnam Ravichandra to serve as jury member for IFFS Don Quixote Award for Feature Films" (in ఇంగ్లీష్). 13 March 2025. Archived from the original on 14 March 2025. Retrieved 14 March 2025.
- ↑ "నేపాల్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ మెంబర్గా పొన్నం రవిచంద్ర". V6 Velugu. 14 March 2025. Archived from the original on 14 March 2025. Retrieved 14 March 2025.
{{cite news}}: zero width space character in|title=at position 38 (help) - ↑ "అంతర్జాతీయ చలనచిత్ర జ్యూరీ సభ్యుడిగా పొన్నం రవిచంద్ర". Sakshi. 14 March 2025. Archived from the original on 14 March 2025. Retrieved 14 March 2025.
- ↑ "'The invincible hero' from Telangana" (in ఇంగ్లీష్). The Hindu. 7 February 2018. Archived from the original on 10 May 2025. Retrieved 10 May 2025.
- ↑ "నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు 'సర్వాయి పాపన్న'". V6 Velugu. 20 January 2023. Archived from the original on 10 May 2025. Retrieved 10 May 2025.
బయటి లింకులు
[మార్చు]- "తెలంగాణ సినీ ప్రస్థానం పుస్తక పరిచయ సభ".
Media related to Ponnam Ravichandra at Wikimedia Commons