మాడభూషి శ్రీధర్
Jump to navigation
Jump to search
మాడభూషి శ్రీధర్ | |
---|---|
జననం | వరంగల్, తెలంగాణ, ఇండియా | 1956 నవంబరు 10
జాతీయత | భారతీయుడు |
వృత్తి | కేంద్ర సమాచార శాఖ కమిషనర్ |
మాడభూషి శ్రీధర్ పాత్రికేయుడు,నల్సార్ లా యూనివర్శిటీ అధ్యాపకుడు, కేంద్ర సమాచార శాఖ కమిషనర్[1][2]. 'జనధర్మ', 'వరంగల్ వాణి' పత్రికల నిర్వాహకుడు.వరంగల్లు పట్టణానికి ఆనుకుని ఉండే గిర్మాజీపేట సొంత ఊరు.తండ్రిగారిఅసలు ఊరు నెల్లికుదురు .మాసూంగల్లీలో ఉన్న మాసూం అలీ హైస్కూల్‌లో చదువుకున్నారు. విద్య నేర్పిన గురువు సాంబశివరావు.నాన్న ఎం.ఎస్.ఆచార్య ఆంధ్రపత్రిక ఏజెంటు.జనధర్మ పత్రికా సంపాదకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు.
భావాలు అనుభవాలు[మార్చు]
- అందుబాటులో ఏదో ఓ బడి ఉండటం ఎంతో ముఖ్యం.
- చిన్నతనంలో నేను, అన్నయ్య కలిసి 'బాల విద్యార్థి సంఘం' స్థాపించాం. నేను పాటలు పాడటం, హరికథలు చెప్పడం, సీతాకల్యాణంలో రావణ పాత్ర పోషించేవాణ్ణి.
- జయప్రకాష్ నారాయణ్ రోడ్(ఇప్పుడు జేపీఎన్ రోడ్, ఒకప్పుడు ముఖరంజా రోడ్)
- ఆజంజాహి మిల్స్ తెలంగాణలో ఏకైక పరిశ్రమ. వరంగల్ నగరానికే ఆ మిల్లు ఒక బొడ్రాయి. అందులో వందలాది మందికి ఉపాధి దొరికేది. దానిలో పనిచేసే అధికారుల కోసం పెద్ద ఇళ్లతో ఒక కాలనీ ఉండేది. అదే మిల్స్ కాలనీ! అందులోనే ఒక పోలీస్ స్టేషను. పెద్ద పెద్ద సభలు, సమావేశాలు జరగాలంటే ఆజంజాహి మిల్స్ గ్రౌండ్స్‌లోనే. ఇందిరాగాంధీ బహిరంగ సభ ఎప్పుడైనా అక్కడే జరిగేది. ఆ మిల్లు కార్మిక నాయకులే అంచెలంచెలుగా రాజకీయ నాయకులుగా ఎదిగేవారు. కానీ ఇప్పుడు అజాంజాహి మిల్లు ఆనవాళ్లు కూడా లేవు. మిల్లులోని వస్తువులన్నీ అమ్మేశారు. చెక్క సామాన్లు చిల్లరగా వేలం వేశారు. మిల్లు స్థలాన్ని, గ్రౌండ్స్‌ను కాలనీల నిర్మాణానికి ఉపయోగించారు. మిల్లు పోయి రియల్ ఎస్టేట్ మిగిలింది. అది అభివృద్ధి అని చెప్పేవాళ్లున్నా... నాకు మాత్రం ఒక చరిత్రను, సంస్కృతిని, ఒక నాగరికతను పాతి పెట్టారనిపిస్తుంది. నగరానికి ప్రాణ బిందువైన మిల్లును చంపి అక్కడ ప్రాణంలేని వ్యాపారాత్మక కాలనీలను నిలబెట్టారు. ఇంతమంది నాయకులు, మంత్రులు ఉన్నారు. వరంగల్లు ఉద్యమ పోరాట కేంద్రం అని చెబుతుంటారు. కానీ ఒక్క మిల్లును కాపాడుకోలేకపోయారు.
- వరంగల్లుకు ఆ పేరును ఇచ్చింది వరంగల్ కోట. అందులోని ఏకశిలా పర్వతం, దాని మీద ఉన్న చిన్న గుడి.
- వరంగల్ వదిలి హైదరాబాద్‌లో పరిశోధనాత్మక జర్నలిస్టుగా కాలం గడిపినా, నల్సార్‌లో న్యాయశాస్త్ర అధ్యాపకుడినైనా, ఇప్పుడు ఢిల్లీలో సమాచార కమిషనర్‌ను అయినా నాది ఏ ఊరంటే వరంగల్లనే చెబుతాను. నేను ఓ విలేకరిగా ముఖ్యమంత్రులను, మంత్రులను కలిసిన సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌లోనే నేనే ఓ విఐపీగా బస చేయడం, జర్నలిస్టుగా రాజకీయ నాయకుల సమావేశాలను కవర్ చేయడానికి పరిగెత్తిన రోడ్ల మీద నేనే ముఖ్య అతిథిగా ఎస్కార్ట్ కార్ల మధ్య అధికారిక వాహనంలో తిరగడం, విలేకరులకు ఇంటర్వ్యూలు ఇవ్వడం గొప్పగా అనిపిస్తున్నా, నా పదవిని, వైభవాన్ని చూడటానికి మా ఊళ్లో నాన్న లేడే అనే బాధ మాత్రం ఉంది.నాన్న సైకిల్ మీద తిరిగి పేపర్లు పంచిన ఊరు, నేను స్కూటర్ మీద పగలనక, రాత్రనక తిరిగి వార్తలుసేకరించిన ఊరు, అదే వీధుల్లో నన్ను వి.ఐ.పి.గా ఊరేగించిన ఊరు నన్ను వరంగల్ వాణి(ణ్ణి)గా తీర్చిదిద్దిన ఊరు.[3]
మూలాలు[మార్చు]
- ↑ http://www.deccanchronicle.com/131122/news-current-affairs/article/prof-sridhar-take-over-cic-today
- ↑ http://newindianexpress.com/cities/hyderabad/Madabhushi-is-Central-Information-Commissioner/2013/11/22/article1904359.ece
- ↑ http://www.andhrajyothy.com/node/53305 Archived 2014-01-16 at the Wayback Machine ఆంధ్రజ్యోతి 12.1.2014