పొన్నం ప్రభాకర్
పొన్నం ప్రభాకర్ గౌడ్ | |||
![]()
| |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | కరీంనగర్, కరీంనగర్, తెలంగాణ | 1967 మే 8||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రేస్ | ||
జీవిత భాగస్వామి | మంజుల పొన్నం | ||
బంధువులు | పొన్నం అశోక్ గౌడ్ (అన్నయ్య) [1], పొన్నం రవిచంద్ర (అన్నయ్య) | ||
సంతానం | ఇద్దరు కుమారులు (పృథ్వి, ప్రణవ్) | ||
నివాసం | హైదరాబాద్, తెలంగాణ | ||
మతం | భారతీయుడు | ||
వెబ్‌సైటు | పొన్నం ప్రభాకర్ వెబ్ సైట్ |
పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు. భారత జాతీయ కాంగ్రెస్ తరపున కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుండి 2009-14 మధ్య 15వ లోకసభకు పార్లమెంటు సభ్యుడు ప్రాతినిథ్యం వహించాడు.[2] కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుండి ఎన్నుకోబడిన ఎం.పి.లలో పొన్నం ప్రభాకరే చిన్న వయస్కుడు.[3] తెలంగాణలోని నాయకులలో ఒకరిగా ఉన్న పొన్నం ప్రభాకర్ విద్యార్థి ఉద్యమకారుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. పొన్నం ప్రభాకర్ 2022 డిసెంబర్ 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమితుడయ్యాడు.[4] పొన్నం ప్రభాకర్ 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ కమిటీ చైర్మన్‌గా 2023 ఆగస్ట్ 30న నియమితుడయ్యాడు.[5]
పొన్నం ప్రభాకర్ 2009 ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా గెలిచి 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆయన 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నుండి పోటీ చేసి ఓడిపోయాడు.
జననం[మార్చు]
ప్రభాకర్ 1967, మే 8న సత్తయ్య - మల్లమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ లో జన్మించాడు. హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో బిఏ, ఎల్.ఎల్.బి. పూర్తిచేశాడు.
వివాహం[మార్చు]
ప్రభాకర్ కి 2000, ఏప్రిల్ 21న మంజులతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు (పృథ్వి, ప్రణవ్).
రాజకీయ ప్రస్థానం[మార్చు]
- 1987-1988 మధ్యకాలంలో ఎస్.ఆర్.ఆర్. గవర్నమెంట్ డిగ్రీ, పీజీ కళాశాలలో చదువుకునే రోజుల్లో నుండి, ఒక విద్యార్థి నాయకుడుగా, యూనియన్ అధ్యక్షుడుగా పనిచేశాడు.
- 1987-1989 మధ్యకాలంలో ఎన్.ఎస్.యు.ఐ. జిల్లా ప్రధాన కార్యదర్శిగా సేవలందించాడు.
- 1987-1988 మధ్యకాలంలో కరీంనగర్ జిల్లా కళాశాలల కన్వీనర్ గా పనిచేశాడు.
- 1989-1991 మధ్యకాలంలో ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర కార్యదర్శి పదవిని, 1992-1998 మధ్యకాలంలో ఎన్.ఎస్.యు.ఐ. జిల్లా అధ్యక్ష పదవిని చేపట్టాడు.
- 1999-2002 మధ్యకాలంలో ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
- 2002-2003 మధ్యకాలంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ యొక్క ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.
- 2002-2004 మధ్యకాలంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా సెల్ సమన్వయకర్తగా పనిచేశాడు.
- 2004-2009 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్ గా పనిచేసారు.
- 2009లో లోక్ సభకు పోటీచేసే వరకు డి.సి.ఎం.ఎస్. అధ్యక్షుడుగా, మార్కుఫెడ్ విదేశాంగ ఛైర్మన్ గా చేశాడు.
- భారత జాతీయ కాంగ్రెస్ తరపున 2009 లో 15వ లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ లోకసభ నియోజకవర్గం ఎం.పి.గా ఎన్నికయ్యాడు.
- 2018 సెప్టెంబరులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకం.[6] (2019 సార్వత్రిక ఎన్నికల రాజీనామా చేశాడు)[7]
- ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నవారిలో పొన్నం ప్రభాకర్ ఒకరు.
నిర్వర్తించిన పదవులు[మార్చు]
- తెలంగాణ ప్రాంతం నుండి 15వ లోక్‌సభలో అతి పిన్న వయస్కుడైన పార్లమెంటు సభ్యుడు.
- రైల్వే, విద్యుత్ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు.
- రసాయనాలు, ఎరువులు, కంప్యూటర్లపై జాతీయ కమిటీల సభ్యుడు.
- ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్.
మూలాలు[మార్చు]
- ↑ Andrajyothy (19 July 2021). "సీజేఐ రమణతో అశోక్‌గౌడ్ భేటీ". Archived from the original on 19 July 2021. Retrieved 19 July 2021.
- ↑ "Ponnam Prabhakar". loksabhaph.nic.in. Archived from the original on 2021-11-29. Retrieved 2021-11-29.
- ↑ The Economic Times, Election Candidate. "Ponnam Prabhakar". Archived from the original on 14 July 2020. Retrieved 14 July 2020.
- ↑ Andhra Jyothy (11 December 2022). "టీపీసీసీ కార్యవర్గం నుంచి.. కోమటిరెడ్డి ఔట్". Archived from the original on 11 December 2022. Retrieved 11 December 2022.
- ↑ NTV Telugu (30 August 2023). "బీసీ డిక్లరేషన్ కమిటీ చైర్మన్‌గా పొన్నం ప్రభాకర్". Archived from the original on 31 August 2023. Retrieved 31 August 2023.
- ↑ Sakshi (20 September 2018). "కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రభాకర్". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
- ↑ ఎన్ టివి, జాతీయం (28 June 2019). "కీలక పదవికి పొన్నం ప్రభాకర్ రాజీనామా". NTV Telugu (in ఇంగ్లీష్). Archived from the original on 14 July 2020. Retrieved 14 July 2020.