తండ్రులు కొడుకులు
Appearance
తండ్రులు కొడుకులు (1961 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.హేమాంబరధరరావు |
---|---|
తారాగణం | కొంగర జగ్గయ్య, బి.సరోజా దేవి, జమున |
సంగీతం | టి.చలపతిరావు |
నిర్మాణ సంస్థ | రఘురామ్ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
తండ్రులు కొడుకులు కె.హేమాంబరధరరావు దర్శకత్వంలో కొంగర జగ్గయ్య, బి.సరోజా దేవి, జమున ప్రధాన పాత్రల్లో నటించిన 1961డిసెంబర్ 1 న విడుదలైన నాటి తెలుగు చలన చిత్రం. ఈ చిత్రానికి సంగీతం తాతినేని చలపతి రావు అందించారు.
విడుదల
[మార్చు]ప్రచారం
[మార్చు]తండ్రి-కొడుకులు సినిమా ప్రచారం వినూత్నంగా చేశారు. "కప్పను చూడంగ పాము గడగడ వణికెన్.. హారము లేకాలనే ఆహా యనిపించెన్... ఎలుకలు తమ కలుగులోనికేనుగు నీడ్చెన్.. కన్నకొడుకు భర్తయయ్యెగాయని మురిసెన్.. రాలు దుటుంగరాలు బిగిరాలగ నా జవరాలు దాల్చొగిన్ - ఈ సమస్యలను పూరించిన తీరు రఘురామ్ ఫిలిమ్స్ వారి తండ్రులు కొడుకులు చిత్రంలో చూసి ఆనందించండి" అంటూ భాషాభిమానులు, సాహిత్యపరులను ఆకర్షించేలా ప్రచారం సాగించారు.[1]
పాటలు
[మార్చు]- ఓహోహో సుందరీ నీ అందమేనా ఈ వసంతం[2] గానం:పి.బి.శ్రీనివాస్, ఎస్ జానకి,రచన:శ్రీశ్రీ
- ఉన్నమాట అన్నానని ఉలుకెందుకు, గానం.పి.బి.శ్రీనివాస్ , ఎస్.జానకి, రచన: శ్రీ శ్రీ
- నీ తలపే నీ వలపే నా హృదయాన నిండెను లే నా మనసే , గానం: ఎస్.జానకి, రచన: ఆంజనేయ శాస్త్రి
- మేరే ప్యారి వయ్యారి ఇటు చూడవే ఒకసారి , గానం:మాధవపెద్ది, రచన:కొసరాజు
- ఒకటి రెండు మూడు అది ఎంటో తెలుసా, గానం: ఎస్.జానకి, రచన:కొసరాజు
- కుప్పల కావలి కాయగ (సంవాద పద్యాలు) గానం: పి.బి.శ్రీనివాస్ , ఎస్ జానకి, రచన:కొసరాజు
- నవ్వులు రువ్వే చిన్నది నను కవ్విస్తున్నది , గానం:మాధవపెద్ది, రచన:కొసరాజు
మూలాలు
[మార్చు]- ↑ మాదిరాజు, కనకదుర్గ (1 నవంబరు 2017). చెరుకూరి, రామోజీరావు (ed.). "నేడే చూడండి!". తెలుగు వెలుగు. 6 (3). హైదరాబాద్: రామోజీ ఫౌండేషన్: 50–53.
- ↑ శ్రీశ్రీ (2001). ఉక్కుపిడికిలి - అగ్ని జ్వాల శ్రీశ్రీ సినిమా పాటలు (1 ed.). విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. Retrieved 17 June 2020.
3. ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు .