చిట్టి చెల్లెలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిట్టి చెల్లెలు
(1970 తెలుగు సినిమా)
Chitti Chellelu Movie Poster.png
దర్శకత్వం ఎం. కృష్ణన్
తారాగణం నందమూరి తారక రామారావు,
వాణిశ్రీ,
హరనాధ్,
రాజశ్రీ,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
పద్మనాభం
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల, పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి
గీతరచన దాశరథి కృష్ణమాచార్య, సి.నారాయణ రెడ్డి
నిర్మాణ సంస్థ ఎ.వి.ఎం.ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

చిట్టి చెల్లెలు 1970, జూలై 29న విడుదలైన తెలుగు చలనచిత్రం. అన్నాచెల్లెల్ల అనురాగానికి అపూర్వ రూపకల్పన ఈ చిత్రం. ఎం. కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, వాణిశ్రీ, హరనాధ్, రాజశ్రీ, గుమ్మడి వెంకటేశ్వరరావు, పద్మనాభం నటించగా, సాలూరి రాజేశ్వరరావు సంగీంత అందించారు.

మాతృప్రేమను మించినది లోకంలో లేదంటారు. కాని చెల్లెలి పట్ల అన్న ప్రేమానురాగాలు అంతకంటే తక్కువేమి కాదని నిరూపించిన చిత్రం ‘చిట్టిచెల్లెలు’. అన్న పాత్రలో ఎన్.టి.ఆర్. సోదరి పట్ల వాత్సల్యాన్ని అత్యంత సహజంగా కదిలించేలా ప్రదర్శించగా, చెల్లెలి పాత్రలో వాణిశ్రీ అన్నపట్ల అనురాగం చూపించే చెల్లిలిగా తన నటనను ప్రదర్శించింది. శ్రీరామవనపాసం నాటకం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణకాగా, పద్మనాభం-గీతాంజలి, బాలకృష్ణ-సురభి బాలసరస్వతి జంటల హాస్యం బాగా నవ్విస్తుంది. సాలూరి రాజేశ్వరరావు సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘అందాల పసిపాప’, ‘ఈ రేయి తీయనిది’, ‘జుం జుం జుం తుమ్మెద పాడింది’ వంటి పాటలను ప్రజాదరణ లభించింది.[1]

పాటలు[మార్చు]

పాట రచయిత సంగీతం గాయకులు
అందాల పసిపాపా అందరికీ కనుపాపా బజ్జోరా బుజ్జాయి కథలెన్నో చెబుతాలే కలలన్నీ నీవేలే దాశరథి కృష్ణమాచార్య సాలూరు రాజేశ్వరరావు పి.సుశీల
అందాల పసిపాపా అన్నయ్కకు కనుపాపా బజ్జోవే బుజ్జాయి దాశరథి కృష్ణమాచార్య సాలూరు రాజేశ్వరరావు పి.సుశీల
అందాల పసిపాపా మామయ్యకు కనుపాపా బజ్జోరా బుజ్జాయి దాశరథి కృష్ణమాచార్య సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల
ఆహాహ ఈ వనము చూడ చూడ మనోహరము ( శ్రీరామ వనవాసము ) సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల, పిఠాపురం, తిలకం, మాధురి
ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది సి.నారాయణరెడ్డి సాలూరు రాజేశ్వరరావు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
ఒన్ టూ త్రీ ఇటు రావయ్యా అయ్యయ్య ఏమయ్యా సాలూరు రాజేశ్వరరావు ఎల్. ఆర్. ఈశ్వరి
ఝుమ్ ఝమ్ ఝమ్ తుమ్మెద పాడింది గులాబీ ఘం ఘం ఘం సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల, పి.సుశీల
పట్టాలి అరక దున్నలి మెరక ఏర్లన్మి మళ్ళించి తడపగా ఎత్తుపల్లాలు సాలూరు రాజేశ్వరరావు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
మంగళగౌరి మముగన్న తల్లి మా మనవి దయతో వినవమ్మా దాశరథి కృష్ణమాచార్య సాలూరు రాజేశ్వరరావు పి.సుశీల

వనరులు[మార్చు]

  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • డి.వి.వి.ఎస్.నారాయణ: మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

మూలాలు[మార్చు]

  1. ఎపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్ (7 August 1970). "చిట్టిచెల్లెలు చిత్ర సమీక్ష". ఆంధ్రపత్రిక. 57 (128): 7. Retrieved 20 July 2017.[permanent dead link]