Jump to content

దేవదాసు మళ్లీ పుట్టాడు

వికీపీడియా నుండి
దేవదాసు మళ్లీ పుట్టాడు
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణ రావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
వాణిశ్రీ
సంగీతం ఎస్.రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ దేవి ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణ రావు కాంబినేషన్ లో వచ్చిన తొలిచిత్రం. తెలుగులోవచ్చిన తొలి సీక్వెల్ గా చెప్పవచ్చును. మొదటి దేవదాసుకు ఈ చిత్రం కొనసాగింపు. దేవదాసు చనిపోయి మళ్ళా అదే రూపురేఖలతో పుడతాడు. కాని గతం గుర్తుండదు. పార్వతి ఇంక బ్రతికే ఉంటుంది. చంద్రముఖి వేరే రూపంతో పుడుతుంది. వీరి కలయిక చిత్రకథ. ఐతే కొత్త దేవదాసు ఈ జన్మలో జయప్రదను ప్రేమించి అమెను కోల్పోతాడు. విరాగి ఐన తర్వాత చంద్రముఖిని, పార్వతిని కలుస్తాడు. పాటలలో ముఖ్యమైనవి రామకృష్ణ పాడిన 'ఎవరికి ఎవరు', 'ఎంకి నాయుడు బావ పాట', 'అనురాగమే ఒక ఆలయం' బాలు పాడిన 'దిక్కులు కలిసిన సమయం 'మొదలైనవి ఉన్నాయి.

పాటలు

[మార్చు]
  1. అనురాగమే ఒక ఆలయం ఆ భావనకే మన జీవితం - రామకృష్ణ, పి.సుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి
  2. ఎవరికి ఎవరవో చివరికి ఎవరో ముగియని ఈ ఆటలోన - రామకృష్ణ, పి.సుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి
  3. దిక్కులు కలిసే సమయం ఇది సూర్యుడు చూడని - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల కోరస్ - రచన: వేటూరి
  4. దోసిట సిరిసిరి మల్లెలతొ వాకిట నిలిచిన వలపులతొ - పి.సుశీల
  5. నడివీధిన దీపం ఒకటి సుడిగాలికి ఊగుతున్నది - రామకృష్ణ - రచన: గోపి

బయటి లింకులు

[మార్చు]