మైలవరపు గోపి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మైలవరపు గోపి
జననం
మైలవరపు లక్ష్మీ గోపాలకృష్ణమూర్తి

(1949-08-15)1949 ఆగస్టు 15
యద్దనపూడి, కృష్ణా జిల్లా
మరణం1996 సెప్టెంబరు 8(1996-09-08) (వయసు 47)
విద్యఎస్. ఎస్. ఎల్. సి
వృత్తికవి, నటుడు, సినీ గేయ రచయిత
తల్లిదండ్రులు
  • సత్యనారాయణ (తండ్రి)
  • అంకమాంబ (తల్లి)
జాతకరత్న మిడతంభొట్లు

మైలవరపు గోపి (ఆగస్టు 15, 1949 - సెప్టెంబర్ 8, 1996) తెలుగు సినిమా రంగంలో ఒక ఉత్తమమైన భావాలున్న రచయిత.

జననం, బాల్యం

[మార్చు]

1949, ఆగస్టు 15కృష్ణాజిల్లా యద్దనపూడి (మొవ్వ)లో సత్యనారాయణ - అంకమాంబ దంపతులకు జన్మించాడు. ఇతని పూర్తి పేరు మైలవరపు లక్ష్మీ గోపాలకృష్ణమూర్తి. హైస్కూలు విద్యార్థిగా ఉన్నప్పుడే పలు నాటకాల్లో ముఖ్య పాత్రలు పోషించాడు. జిల్లా స్థాయి నాటక పోటీలు, ఏకపాత్రల పోటీల్లో పాల్గొని బహుమతులెన్నో పొందాడు. పద్యాలు, పాటలు, కథలు, నాటికలు వ్రాశాడు. ఎస్. ఎస్. ఎల్. సి. పూర్తయిన తర్వాత చదువుపట్ల ఆసక్తి సన్నగిల్లింది. సినిమా రంగం వైపు దృష్టి మళ్ళించాడు. ఇంట్లోవారు వద్దంటున్నా 1964 సెప్టెంబరులో మద్రాసు వచ్చాడు.

సినిమారంగం

[మార్చు]

తెలుగు సినిమా రంగంలో ఉత్తమమైన భావాలున్న ఒక రచయిత గోపి. ఆత్రేయ అంతేవాసి, మరో మనసు కవి. మూడు దశాబ్దాలపాటు (1966-1996) విలువైన సినీసాహిత్యాన్ని సృజించాడు. ఆత్రేయ, రాజశ్రీ ల దగ్గర అసిస్టెంట్ గా పనిచేశాడు. 1965లో ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో ఆడిషన్‌ టెస్టులో ఎన్నికై కన్యాశుల్కం నాటకంలో గిరీశం శిష్యుడు వెంకటేశం పాత్రను పోషించాడు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, గోపి 1966 నుండే మంచి మిత్రులు. తొలినాళ్లలో ఇద్దరూ కలిసి, ఒకే గదిలో ఉండేవారు. గోపి ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోయాడు. ఇతడు మొత్తం 200 సినిమాలకుగాను 1500 పాటలు వ్రాశాడు. ఇరవై సినిమాలకు సంభాషణలు రచించాడు. మనసా కవ్వించకే అనే సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు రాయడంతో పాటు దర్శకత్వం కూడా నిర్వహించాడు.

కొన్ని మంచి పాటలు,పాటల్లో సూక్తులు,జీవిత సత్యాలు

[మార్చు]
  • మనసా! కవ్వించకే నన్నిలా ఎదురీదలేక కుమిలేను నేను సుడిగాలిలో చిక్కినా నావను
  • ఆలనగా పాలనగా అలసిన గుండెకు ఆలంబనగా లాలించు నీదానిగా
  • ఒక వేణువు వినిపించెను అనురాగగీతికా ఒక రాధిక అందించెను నవరాగమాలిక
  • ఇదిగో దేవుడు చేసిన బొమ్మా ఇది నిలిచేదేమో మూడు రోజులు బంధాలేమో పదివేలు.అనుబంధాలూ ఆనందాలూ తప్పవు లేరా కడవరకూ .
  • మళ్ళీ మళ్ళీ పాడాలి యీ పాట నీ బ్రతుకంత కావాలి పూల తోట
  • జీవితమెంతో తీయనిది అందుకనే అతిస్వల్పమది.నవ్వూ, పువ్వూ క్షణికములే అవి గడువు తీరితే నిలువవులే
  • పాడమనీ పాట వినే రాజు ఎవ్వరూ మనిషిగా ఒక్కరు మనసు నివ్వరూ
  • నీ చేయి నాచేయి పెనవేసి బాస చేయి నా తోడు యీ బంధం కలకాలం వుండనీయి సాక్షులు మన రెండు హృదయాలు
  • చిన్నారి రాణి సిరిమల్లెపూవు సిరిమల్లెలోన వెన్నెలలు వెలుగు నీకంట నీరు నే చూడలేను
  • 'గాంధీ పుట్టిన దేశం రఘురాముడు ఏలిన రాజ్యం ..బానిస భావం విడనాడి ఏ జాతి నిలుచునో అది జాతి
  • ఈ లోకానికి రావటమే తొలి ప్రయాణం.పై లోకానికి పోవటమే తుది ప్రయాణం (ప్రయాణంలో పదనిసలు)
  • ఒక నువ్వు ఒక నేను అంతా బొమ్మలం (గృహప్రవేశం)
  • నడివీధిన దీపం ఒకటి సుడిగాలికి ఊగుతున్నది (దేవదాసు మళ్ళీ పుట్టాడు)
  • ఈ జీవితపాఠశాలలో అనుభవాలే ఉపాధ్యాయులు (భాగస్థులు)
  • కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు (మనిషి రోడ్డున పడ్డాడు)
  • నవ్వు నవ్వించు.. నవ్వలేని వారికి నీ నవ్వులు పంచు
  • 'అరవైకీ ఆరేళ్లకీ ఏమిటీ అనుబంధం దేమునికీ దీపానికి ఉండే సంబంధం

అప్పుడు నీ అల్లరితో మురిపించావు ఇప్పుడు నా బ్రతుకును అల్లరి చేశావు మనిషికి ఒకటే శిక్ష పెద్దతనం తెలియని శ్రీరామరక్ష పసితనం

  • మిడిసిపడే దీపాలివి మిన్నెగసి పడే కెరటాలివి వెలుగు పంచలేవు ఏ దరికీ చేరలేవు
  • ముచ్చట తీర్చర మువ్వగోపాల, మక్కువగొని నిను చేరిన యీ వేళ
  • ఇల్లాలి హృదయంలో ఎన్నెన్ని రాగాలో పెదవి విప్పిన కాలు కదిపినా

గడియ గడియకొక రాగం అణువు అణువులో అనురాగం

  • 'ఎంకినై పాడాలి ఏ జనమకైనా అయినోళ్ళు కానోళ్ళు ఎవరేమన్నా తెలుగు నా యిల్లని తెలుగు నా వొల్లని'
  • నడివీధిన దీపం ఒక టి

కొన్ని చిత్రాలు

[మార్చు]

మరణం

[మార్చు]

గోపి తన చివరిదశలో ఐదు సంవత్సరాలు పక్షవాతంతో బాధపడుతూ, 1996, సెప్టెంబర్ 8 న కన్ను మూశాడు.

మూలాలు

[మార్చు]
  • మరపురాని మరో మన”సు’కవి మైలవరపు గోపి - డాక్టర్‌ వి.వి. రామారావు - ఆంధ్రప్రభ 6.9.2009,13.6.2009
  • మెరుపుల్లాంటి పాటలకు నెలవు మైలవరపు గోపి - పి.ఎం.సుందరరావు - ఆంధ్రభూమి 02.11.2012
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.