ధైర్యవంతుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధైర్యవంతుడు
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం లక్ష్మీదీపక్
తారాగణం చిరంజీవి,
విజయశాంతి ,
చిత్ర
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ దీపక్ రాజ్ పిక్చర్స్
భాష తెలుగు

ధైర్యవంతుడు 1986 లో వచ్చిన తెలుగు సినిమా. దీపక్ రాజ్ పిక్చర్స్ పతాకంపై యాక్స్ స్వామి, రామ్ దీపక్ లు నిర్మించారు. లక్ష్మీ దీపక్ దర్శకత్వం వహించాడు. ఇందులో చిరంజీవి, విజయశాంతి, సితార ముఖ్య పాత్రల్లో నటించారు. రమేష్ నాయుడు సంగీతం సమకూర్చాడు. [1] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నమోదైంది.

కథ[మార్చు]

కిషోర్ ( చిరంజీవి ) నిరుద్యోగ గ్రాడ్యుయేట్. అతను హర్షవర్ధన్ కంపెనీలో పనిచేసే తన సోదరుడు శ్రీనివాసరావుతో కలిసి నివసిస్తున్నాడు. కిషోర్ తన స్నేహితుడి వివాహానికి హాజరైనప్పుడు, అతను రిటైర్డ్ ఆర్మీ అధికారి కుమార్తె రాధ (సితార) ను చూస్తాడు. హర్షవర్ధన్ ఆస్తిపై కన్ను ఉన్న సామ్రాట్, అతడి కుమార్తెను పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. లావణ్య ( విజయశాంతి ) చదువు పూర్తయ్యాక విదేశాల నుండి తిరిగి వచ్చినప్పుడు, ఆమెను సామ్రాట్ కిడ్నాప్ చేస్తాడు. కాని కిషోర్ ఆమెను రక్షిస్తాడు. అప్పుడు జరిగే పోరాటంలో, కిషోర్ జ్ఞాపకశక్తిని కోల్పోతాడు. రాధ అతన్ని చూడటానికి వచ్చినప్పుడు కూడా అతను ఆమెను గుర్తించలేకపోతాడు. మరొక ప్రయత్నంలో, సామ్రాట్, అతని వ్యక్తులు మళ్ళీ దాడి చేస్తారు ఈసారి, కిషోర్ తన జ్ఞాపకశక్తిని తిరిగి పొందుతాడు. కాని వాళ్ళు రాధను చంపేస్తారు. తరువాత, కిషోర్‌ను హర్షవర్ధన్ చూసుకుంటాడు. లావణ్య అతనికి సహాయం చేస్తుంది. వారు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కిషోర్ ఒక ప్రణాళిక గురించి ఆలోచిస్తాడు. సామ్రాట్ కు అతని మనుషులకూ మధ్య జరిగే సంభాషణను రికార్డు చేస్తాడు. ఇది వారి నేరాలను రుజువు చేస్తుంది. పోలీసులు వారిని అరెస్టు చేస్తారు. కిషోర్ లావణ్యను పెళ్ళి చేసుకోవడాంతో సినిమా ముగుస్తుంది.

పాటలు[మార్చు]

పాటలను రమేష్ నాయుడు స్వరపరిచాడు.

మూలాలు[మార్చు]

  1. https://www.thetelugufilmnagar.com/movie/dhairyavanthudu/