Jump to content

ఖైదీ బాబాయ్

వికీపీడియా నుండి
ఖైదీ బాబాయ్
(1973 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం టి. కృష్ణ
తారాగణం శోభన్ బాబు,
వాణిశ్రీ,
జానకి,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
రమాప్రభ,
పద్మనాభం,
సత్యనారాయణ
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీబాలాజీ చిత్ర
భాష తెలుగు

ఇది 1973లోవిడుదలైన తెలుగు చిత్రం .హిందీలో విజయవంతమైన 'దుష్మన్'చిత్రం ఆధారంగా తీయబడింది.క్రైమ్ అండ్ పనిష్మెంట్ వంటి కథ. ఒక లారీడ్రైవర్ (శోభన్ బాబు) తాగి లారీ నడుపుతున్నపుడు ఆక్సిడెంట్ జరిగి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పాతాడు.ఆవ్యక్తి తాలూకూ కుటుంబం ఆధారంలేకుండాఅవుతుంది. లారీడ్రైవర్ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోర్టు తీర్పు ఇస్తుంది.తమకు సహాయపడతానికివచ్చిన డ్రైవర్ ని మృతుని భార్య (షావుకారు జానకి) అంగీకరించదు.ఆకుటుంబానికి డ్రైవర్ ఎలా దగ్గరయ్యాడు అనేది చిత్రకథ.వాణిశ్రీ బైస్కోపు చూపే అమ్మాయి గా, రమప్రభ శొభన్ బాబును ఇష్టపడే అమ్మాయిగా నటించారు.'ఓ రబ్బీ చెబుతాను', 'బైస్కోప్ పిల్లొచ్చింది', 'ఒట్టంటే మాటలుకాదు చిలకమ్మా' 'చూసినకొద్దీ నిన్నే' వంటి హిట్ పాటలున్నాయి.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. ఎక్కడివాడో గాని చక్కనివాడె ఎక్కడివాడేమి మక్కువగలవాడే - పి.సుశీల , రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి
  2. ఓరబ్బీ చెబుతాను ఓలమ్మీ చెబుతాను పండుగ పూట ఒక - ఘంటసాల, ఎస్. జానకి . రచన: సి. నారాయణ రెడ్డి.
  3. ఒట్టంటే మాటలు కావు చిలకమ్మా అవి ఉత్తుత్తి- వి.రామకృష్ణ, ఎల్.ఆర్.ఈశ్వరి, రచన:సింగిరెడ్డి నారాయణరెడ్డి
  4. చూసినకొద్ది నిన్నే చూడాలని ఉంది దాచాలనివన్నీ నీకే- పి.సుశీల, రచన: సి నారాయణ రెడ్డి
  5. బయోస్కోప్ పిల్లొచ్చింది భలే తమాషా చూపిస్తుంది- పి.సుశీల, రచన: సి నారాయణ రెడ్డి.

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రజ్యోతి, నవ్య (ఓపెన్ పేజీ) (21 June 2020). "ఎన్టీఆర్‌ సినిమా కథతో వీరిద్దరి సినిమా!". www.andhrajyothy.com. వినాయకరావు. Archived from the original on 21 June 2020. Retrieved 14 August 2020.

వనరులు

[మార్చు]