Jump to content

అత్తకి యముడు అమ్మాయికి మొగుడు

వికీపీడియా నుండి
అత్తకి యముడు అమ్మాయికి మొగుడు
(1989 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.కోదండరామిరెడ్డి
నిర్మాణం అల్లు అరవింద్
చిత్రానువాదం ఎ.కోదండరామిరెడ్డి
తారాగణం చిరంజీవి,
విజయశాంతి,వాణిశ్రీ,
సుత్తివేలు,
కైకాల సత్యనారాయణ,
అల్లు రామలింగయ్య,
రావు గోపాలరావు,
బేతా సుధాకర్,
అన్నపూర్ణ,
బ్రహ్మానందం
సంగీతం కె.చక్రవర్తి
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.జానకి
సంభాషణలు పరుచూరి సోదరులు
నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్
నిడివి 140 ని.
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ 1989లో నిర్మించిన ,అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రం ఇది. దీనికి దర్శకుడిగా ఎ.కోదండరామిరెడ్డి, కాగా , చిరంజీవి, విజయ శాంతి జంటగా నటించిన ఈ చిత్రం లో అత్తగా వాణిశ్రీ నటించింది. ముఖ్యమైన మాటలు సత్యానంద్ సరిగ్గా సరిపోయారు. తమిళంలో"మా పిళ్లై"పేరుతో ఈ చిత్రాన్ని పునర్నిర్మించారు . సంగీతం కె. చక్రవర్తి అందించారు.

తారాగణం

[మార్చు]

కొణిదల చిరంజీవి

విజయశాంతి

వాణీశ్రీ

సుత్తివేలు

కైకాల సత్యనారాయణ

అల్లు రామలింగయ్య

రావు గోపాలరావు

బేతా సుధాకర్

అన్నపూర్ణ

కన్నెగంటి బ్రహ్మానందం

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: ఎ.కోదండరామిరెడ్డి

సంగీతం:కొమ్మినేని చక్రవర్తి

నిర్మాత: అల్లు అరవింద్

నిర్మాణ సంస్థ: గీతాఆర్ట్స్

మాటలు: సత్యానంద్

పాటలు: వేటూరి సుందర రామమూర్తి, భువనచంద్ర

చిత్రానువాదo: ఎ.కోదండరామిరెడ్డి

నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి

విడుదల:19:01:1989.

విజయభేరి

[మార్చు]

ఈ చిత్రం 14 కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శించబడింది. 1989 జూన్ 24 తేదీన రాజమండ్రిలో శతదినోత్సవం జరిగింది.

పాటలు

[మార్చు]
  • మెరుపులా లా లా, ఆడతా తా తా రచన: భువన చంద్ర, గానం. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, శిస్ట్ల జానకి
  • శాంతి ఓం శాంతి ఆరే ఖైదీ గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి
  • కలలో పెట్టని ముద్దులు పెట్టు , రచన: వేటూరి సుందర రామమూర్తి గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
  • దిగు దిగు దిగు భామ ఆ ప్రేమ, రచన:వేటూరి సుందర రామమూర్తి ,గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
  • టింగు రంగ చక్కనమ్మ చెక్కిలెంత , రచన:వేటూరి సుందర రామమూర్తి,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి

[1]

విశేషాలు

[మార్చు]
  • ఈ చిత్రాన్ని తమిళంలో రజినీకాంత్ కథానాయకుడిగా మాప్పిళ్ళై (అల్లుడు) గా పునర్నిర్మించారు. కథానాయకుడి వివాహం చెడగొట్టటానికి వచ్చిన అల్లరి మూకతో ఫయిట్ చేసి గుడి మెట్ల దగ్గిరే వారిని పంపించే నాయకుడి స్నేహితుడిగా చిరు ఇందులో ప్రత్యేక పాత్రని పోషించాడు. ఆ అల్లరి మూకలో శ్రీహరి కూడా ఉండటం విశేషం. చిరు తన స్వంత గళంతోనే తమిళంలో సంభాషణలు చెప్పటం విశేషం. కథానాయిక పాత్ర అమల పోషించింది. అత్త పాత్ర శ్రీవిద్య పోషించింది. రజినీ తన అత్తని చిరుకు పరిచయం చేసేటప్పుడు, చిరు రజినీ చెవిలో, 'మీ అత్త బాగుందిరా!' అనటం, దానికి రజినీ చిరుని 'కొంప ముంచేలా ఉన్నావు! నువ్వు బయలుదేరరా బాబూ!' అని అనటం ప్రేక్షకులని గిలిగింతలు పెడుతుంది.
  • హిందీలో అనిల్ కపూర్ హీరోగా జమై రాజా పేరుతో ఈ చిత్రాన్ని పునర్మించారు. హేమా మాలిని అత్తగా, మాధురీ దీక్షిత్ కథానాయికగా నటించారు. ఎ.కోదండరామిరెడ్డి హిందీ చిత్రానికి కూడా దర్శకత్వం వహించాడు.

బయటి లింకులు

[మార్చు]

[1] మాప్పిళ్ళైలో చిరంజీవి

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-05-23. Retrieved 2010-05-23.

చిరంజీవి నటించిన సినిమాల జాబితా