జమై రాజా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జమై రాజా
जमाई राजा
Jamai raja.jpg
జమై రాజా
దర్శకత్వంఎ.కోదండరామిరెడ్డి
నిర్మాతటి. త్రివిక్రమరావు
తారాగణంహేమా మాలిని
అనిల్ కపూర్
మాధురీ దీక్షిత్
సంగీతంలక్ష్మీకాంత్-ప్యారేలాల్
పంపిణీదారువిజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్
విడుదల తేదీ
19 అక్టోబర్ 1990
దేశంభారతదేశం
భాషహిందీ

జమై రాజా 1990లో విడుదలైన ఒక రొమాంటిక్, యాక్షన్, కామెడీ హిందీ సినిమా. ఈ సినిమాలో హేమా మాలిని, అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్ నటించారు. ఈ చిత్రానికి ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించాడు. ఇది 1989లో వాణిశ్రీ, చిరంజీవి, విజయశాంతి నటించిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాకు రీమేక్.

కథ[మార్చు]

దుర్గేశ్వరీ దేవి (హేమా మాలిని) ఒక ధనవంతురాలైన స్త్రీ. ఈమె దురహంకారి. ఈమె తన ఇద్దరు కొడుకులు ధీరజ్, నీరజ్, కూతురు రేఖ (మాధురీ దీక్షిత్), డి.డి.టి.గా పిలువబడే సోదరుడు (అనుపమ్‌ ఖేర్‌), బి.బి.సి అని పిలువబడే అతని స్నేహితుడు (సతీష్ కౌశిక్), ఆమె పర్సనల్ సెక్రెటరీ శక్తి (శక్తి కపూర్) లతో కలిసి ప్యాలెస్ లాంటి ఒక పెద్ద భవంతిలో నివసిస్తూ ఉంటుంది. రేఖ బాంబేలో మెడికల్ కాలేజీలో చదువుతూ ఉంటుంది.దుర్గేశ్వరీ దేవి తన ఇంటి మీద, కంపెనీ మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటుంది. అందరినీ తన చెప్పుచేతలలో ఉంచుకుంటుంది. రేఖను ఒక ధనవంతులైన కుటుంబంలో ఇచ్చి పెళ్ళి చేయాలని ఆమె కోరిక. అయితే రేఖ నిరుద్యోగి, పేదవాడు అయిన రాజా (అనిల్ కపూర్) ను ప్రేమించడంతో ఆమెకు ఆశాభంగం అవుతుంది. రాజా తెలివి తేటలను పసిగట్టిన దుర్గేశ్వరి రేఖతో అతడి పెళ్ళికి అంగీకరిస్తుంది. అయితే ఇల్లరికం ఉండాలని ఒక నియమం పెడుతుంది. రేఖ ముందు రాజాను తక్కువ చేసి చూపడానికి దుర్గేశ్వరీ దేవి అనేక పన్నాగాలను పన్నుతుంది. అయితే వాటన్నింటినీ విఫలం చేస్తూ రాజా చివరకు అత్తగారి అభిమానాన్ని గెలుచుకుంటాడు.

నటవర్గం[మార్చు]

 • హేమా మాలిని - దుర్గేశ్వరీ దేవి
 • అనిల్ కపూర్ - రాజా
 • మాధురీ దీక్షిత్ - రేఖ
 • అనుపమ్‌ ఖేర్ - దీన్ దయాళ్ త్రివేది
 • సతీష్ కౌశిక్ - బంఖె బిహారీ చతుర్వేది
 • శక్తి కపూర్ - శక్తి
 • అలోక్ నాథ్ - విశ్వనాథ్ అనుపమ్‌ ఖేర్‌
 • అన్ను కపూర్ - ఐ.సి.మిశ్రా
 • శశి పురి - ధీరజ్
 • ఆనంద్ బలరాజ్ - నీరజ్
 • సీమా దేవ్ - రాజా తల్లి
 • డిస్కో శాంతి - అరుణ
 • జగ్‌దీప్ - అరుణ తండ్రి
 • వికాస్ ఆనంద్ - పోలీస్ ఇన్స్పెక్టర్
 • దివ్య - ఇందు

పాటలు[మార్చు]

ఈ సినిమాలోని పాటలను జావేద్ అఖ్తర్ వ్రాయగా లక్ష్మీకాంత్-ప్యారేలాల్ సంగీత దర్శకత్వం వహించారు.

# పాట గాయకుడు (లు)
1 "హమ్‌ ఔర్ తుమ్‌ అబ్ నహీ పరాయే" అమిత్ కుమార్, అల్కా యాజ్ఞిక్
2 "తేరె ప్యార్ మే హమ్‌ డూబ్ గయే ఇత్నే సనమ్‌" [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం], ఎస్.జానకి
3 "ప్యార్ హువా హై ముఝే ఔర్ తుఝే" అమిత్ కుమార్, కవితా కృష్ణమూర్తి
4 "తేరి ప్యారీ ప్యారీ బాతే" [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం], ఎస్.జానకి
5 "ఆగ్ లగ్ రహీ హై" అమిత్ కుమార్, అల్కా యాజ్ఞిక్

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=జమై_రాజా&oldid=2887135" నుండి వెలికితీశారు