మాప్పిళ్ళై
Appearance
మాప్పిళ్ళై (తమిళం సినిమా) | |
తారాగణం | రజనీకాంత్, అమల, శ్రీవిద్య |
---|---|
సంగీతం | ఇళయరాజా |
భాష | తమిళం |
పరిచయం
[మార్చు]తెలుగులో చిరంజీవి నటించిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రానికి ఇది పునర్నిర్మాణం. నాయికగా అమల (తెలుగులో విజయశాంతి), అత్తగా శ్రీవిద్య (తెలుగులో వాణిశ్రీ) నటించారు. తమిళంలో మాప్పిళ్ళై అంటే అల్లుడు అని అర్థం.
విశేషాలు
[మార్చు]- కథానాయకుడి వివాహం చెడగొట్టటానికి వచ్చిన అల్లరి మూకతో ఫయిట్ చేసి గుడి మెట్ల దగ్గిరే వారిని పంపించే నాయకుడి స్నేహితుడిగా చిరు ఇందులో ప్రత్యేక పాత్రని పోషించాడు. ఆ అల్లరి మూకలో శ్రీహరి కూడా ఉండటం విశేషం. చిరు తన స్వంత గళంతోనే తమిళంలో సంభాషణలు చెప్పటం విశేషం.
- రజినీ తన అత్తని చిరుకు పరిచయం చేసేటప్పుడు, చిరు రజినీ చెవిలో తమిళంలో, 'మీ అత్త బాగుందిరా!' అనటం, దానికి రజినీ చిరుని 'కొంప ముంచేలా ఉన్నావు! నువ్వు బయలుదేరరా బాబూ!' అని అనటం ప్రేక్షకులని గిలిగింతలు పెడుతుంది.