Jump to content

జ్వాల (సినిమా)

వికీపీడియా నుండి
జ్వాల
దర్శకత్వంరవిరాజా పినిశెట్టి
రచనసత్యమూర్తి (మాటలు), రవిరాజా పినిశెట్టి (కథ, చిత్రానువాదం)
నిర్మాతపింజల నాగేశ్వరరావు
తారాగణంచిరంజీవి,
రాధిక,
భానుప్రియ
ఛాయాగ్రహణంలోక్ సింగ్
కూర్పువెళ్ళై స్వామి
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
4 సెప్టెంబరు 1985 (1985-09-04)
భాషతెలుగు

జ్వాల 1985లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో చిరంజీవి, రాధిక, భానుప్రియ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రంలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేశాడు. ఇళయరాజా సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని పి.ఎన్.ఆర్ పిక్చర్స్ పతాకంపై పింజల నాగేశ్వరరావు నిర్మించాడు.

ఈ చిత్రాన్ని ప్రతీకార జ్వాల పేరుతో మలయాళంలోకి అనువదించారు.[1][2][3] 1987 లో కన్నడంలో విష్ణువర్ధన్ కథానాయకుడుగా సత్యం శివం సుందరం అనే పేరుతో పునర్నిర్మాణం అయింది. మాతృకలో ఉన్నట్టుగా కాక ఈ చిత్రంలో విష్ణువర్ధన్ మూడు పాత్రలు పోషించాడు.

తారాగణం

[మార్చు]

సంగీతం

[మార్చు]

ఈ చిత్రానికి ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించాడు. వేటూరి సుందరరామ్మూర్తి, సి. నారాయణ రెడ్డి, గోపి పాటలు రాశారు. ఎస్. జానకి, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర పాటలు పాడారు.

  • ఎన్నెలా ఎన్నెలా (గానం: ఎస్. జానకి)
  • కలికి చిలక (గానం: ఎస్. జానకి, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం)
  • ఏవేవో కలలు (గానం: ఎస్. జానకి)
  • తళాంగు దిత్త (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర)

మూలాలు

[మార్చు]
  1. "Prathikaarajwaala". MalayalaChalachithram. Retrieved 2014-10-13.
  2. "Prathikaarajwaala". malayalasangeetham.info. Retrieved 2014-10-13.
  3. "Prathikaarajwaala". spicyonion.com. Archived from the original on 2014-10-16. Retrieved 2014-10-13.