గోవిందా గోవిందా
| గోవిందా గోవిందా (1994 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | రాంగోపాల్ వర్మ |
|---|---|
| తారాగణం | అక్కినేని నాగార్జున, శ్రీదేవి, పరేష్ రావెల్, కోట శ్రీనివాసరావు, సూర్యకాంతం, జె.వి. సోమయాజులు, శ్రీధర్, అన్నపూర్ణ, సుధాకర్ |
| సంగీతం | రాజ్ - కోటి |
| నిర్మాణ సంస్థ | వైజయంతి మూవీస్ |
| భాష | తెలుగు |
గోవిందా గోవిందా రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో 1994లో విడుదలైన చిత్రం. ఇందులో నాగార్జున, శ్రీదేవి ప్రధాన పాత్రలు పోషించారు. తిరుమల ఆలయ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
కథ
[మార్చు]త్రేతా యుగం, కలియుగం మధ్య కాలంలో శ్రీ మహావిష్ణువు వేంకటేశ్వరుడిగా ఎందుకు భూమి వెలశాడో తెలిపే కథతో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. కథ ప్రస్తుతం లోకి వస్తే బ్యాంకాక్ లోని ఓ తాంత్రికుడు వేంకటేశ్వరుడి కిరీటానికి ఓకన్యను బలి ఇవ్వడం ద్వారా, టెలి కైనెసిస్ అనే ప్రక్రియ ద్వారా లోకాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. తిరుమల ఆలయంలోని ఆ కిరీటాన్ని దొంగిలించే బాధ్యత ముంబై లో పేరుమోసిన దొంగయైన పరేష్ అనే వ్యక్తికి అప్పగిస్తాడు. చిన్నప్పటి నుంచి బ్యాంకాక్ లో పెరిగిన నవీన అనే యువతి తన తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో భారతదేశంలో తాడేపల్లి గూడెంలో ఉన్న తన బామ్మను వెంటతీసుకుని వెళ్ళడానికి వస్తుంది.
తారాగణం
[మార్చు]- శీను గా అక్కినేని నాగార్జున
- నవీన గా శ్రీదేవి
- పరేష్ గా పరేష్ రావెల్
- కోట శ్రీనివాసరావు
- అరుణ్ గోవిల్
- సూర్యకాంతం
- ఆలయ అర్చకుడి గా జె వి సోమయాజులు
- శీను తండ్రి గా శ్రీధర్
- అన్నపూర్ణ
- సుధాకర్
- కళ్ళు చిదంబరం
- బాబు గా మాస్టర్ అనిల్ రాజ్
- భృగు మహర్షి గా గుమ్మడి వెంకటేశ్వరరావు
- మహాలక్ష్మి గా యమున
- చాంగ్ గా చాంగ్
- సి.బి ఐ. ఆఫీసర్ గా ఎస్. గోపాల్ రెడ్డి
- బ్యాంకాక్ ఎయిర్ పోర్ట్ ప్రయాణీకుడు గా పేకేటి శివరాం
- శీను ఫ్రెండ్ గా కాదంబరి కిరణ్ కుమార్
- బస్టాండ్ కూలీగా ఉత్తేజ్
- ఐటెం నెంబర్ గా సిల్క్ స్మిత.
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
- సంగీతం: రాజ్ కోటి
- మాటలు: జంధ్యాల
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి, సిరివెన్నెల (చెంబోలు) సీతారామశాస్త్రి
- నేపథ్య గాయకులు: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర, మాల్గాడి శుభ
- ఛాయ గ్రహణం: ఎస్.గోపాల్ రెడ్డి
- ఎడిటింగ్: శంకర్
- నిర్మాత: చలసాని అశ్వనీదత్
- నిర్మాణ సంస్థ: వైజయంతి మూవీస్
- విడుదల:21:01:1994.
పాటల జాబితా
[మార్చు]ఈ చిత్రానికి రాజ్ - కోటి సంగీతాన్నందించారు.
- అమ్మ బ్రహ్మ దేవుడో, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర, మాల్గాడి శుభ
- అందమాఅందమా, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- ఇందిర మందిర, రచన: వేటూరి సుందరరామ్మూర్తి, గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- ఓ నవీనా, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- ప్రేమంటే ఇదంటే, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర