అరుణ్ గోవిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరుణ్ గోవిల్
జననం (1958-01-12) 1958 జనవరి 12 (వయసు 66)
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1977–ప్రస్తుతం
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామిశ్రీలేఖ గోవిల్
పిల్లలు2
బంధువులుతబస్సుమ్ (వదిన)

అరుణ్ గోవిల్ ( జననం 12 జనవరి 1958) భారతదేశానికి చెందిన సినీ & టెలివిజన్ నటుడు. ఆయన రామాయణం టీవీ సిరీస్ (1987-1988)లో శ్రీరాముని పాత్రకుగాను మంచి గుర్తింపు తెచ్చుకొని[1] పహేలీ (1977), సావన్ కో ఆనే దో (1979), సాంచ్ కో ఆంచ్ నహిన్ (1979), జియో తో ఐసే జియో (1981), హిమ్మత్‌వాలా (1983), దిల్‌వాలా (1986),  గోవిందా గోవిందా (1994)  సినిమాల్లో నటించాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

అరుణ్ గోవిల్ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మీరట్‌లో 1958 జనవరి 12న జన్మించాడు.[2] [3] [4] ఆయన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయంలో పాఠశాల విద్యను  & ఇంజనీరింగ్ సైన్స్ పూర్తి చేశాడు. అరుణ్ తండ్రి శ్రీ చంద్ర ప్రకాష్ గోవిల్ ప్రభుత్వ అధికారి. ఆరుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులలో అరుణ్ నాల్గవవాడు. అతని అన్నయ్య విజయ్ గోవిల్ మాజీ బాలనటి తబస్సుమ్‌ను వివాహం చేసుకున్నాడు. ఆయన దూరదర్శన్ ఫూల్ ఖిలే హై గుల్షన్ గుల్షన్‌లో 21 సంవత్సరాల పాటు కొనసాగిన మొదటి బాలీవుడ్ సెలబ్రిటీ టాక్ షో హోస్ట్ గా వ్యవహరించింది.[5]

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
1977 పహేలి బలరాం
1979 సావన్ కో ఆనే దో బ్రిజ్ మోహన్/బిర్జు
సాంచ్ కో ఆంచ్ నహీం అజయ్ ఎస్. అగర్వాల్
రాధా ఔర్ సీతా శేఖర్ వర్మ
1980 జుడాయి ఉమాకాంత్ ఎస్. వర్మ
గంగా ధామ్ మోహన్
1981 జియో తో ఐసే జియో కుందన్ శర్మ
ఇత్నీ సి బాత్ ఆనంద్
శ్రద్ధాంజలి రాజు కుమార్
కమాండర్ రాకేష్ కుమార్
1982 గుమ్సమ్ శంకర్
అయాష్ అమల్
ససురల్ నరేంద్ర
జవాలా దహేజ్ కీ
బ్రిజ్ భూమి బ్రజ్ భాషా యాస చిత్రం
1983 కల్కా శిబు
లాల్ చునారియా
హిమ్మత్వాలా గోవింద్
జస్టిస్ చౌదరి ఇన్‌స్పెక్టర్ రమేష్ చౌదరి
కల్కా శిభు
1984 ఆస్మాన్ వైద్యుడు
కానూన్ మేరి ముత్తి మే
రామ్ తేరా దేశ్ ప్రకాష్
1985 కర్మ యుద్ రాజేష్
దో దిలోన్ కి దస్తాన్ కమల్
యుద్ ఇన్‌స్పెక్టర్ భార్గవ్
బాదల్ ఠాకూర్ కిరణ్ సింగ్
లల్లూ రామ్ శంకర్/రాజు
1986 దేవర్ భాబీ హిందీ & భోజ్‌పురిలో నటీమణులు షోమా ఆనంద్ (హిందీ) & ఉపాస్న సింగ్ (భోజ్‌పురి)
దిల్వాలా మోహన్ కుమార్
శత్రు సలీం
నఫ్రత్ విజయ్
1987 మాషుక అరుణ్ వర్మ
1989 బిధీర్ బిధాన్ బెంగాలీ సినిమా
ప్యారీ దుల్హనియా భోజ్‌పురి సినిమా
1991 ఏడు కొండలస్వామి వెంకటేశ్వర స్వామి తెలుగు సినిమా
1992 రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రాము రాముడు వాయిస్ మాత్రమే
శివ మహిమ శివుడు
1993 గోవిందా గోవిందా వెంకటేశ్వర స్వామి తెలుగు సినిమా
ముకాబ్లా హవల్దార్ సత్యప్రకాష్
1994 కానూన్ పంకజ్ విశాల్ సోదరుడు
1995 శనివ్రత్ మహిమ భగవాన్ ఇంద్ర/
వెంకటేశ్వర స్వామి
హత్కాడి అరుణ్ చౌహాన్
బుక్ భార భలోబాష సౌమిత్ర దత్ బెంగాలీ సినిమా
1996 గ్రేట్ రాబరీ వెంకటేశ్వర స్వామి తెలుగు సినిమా
1997 ధాల్ ఇన్‌స్పెక్టర్ దేవధర్
అంఖేన్ బరా హత్ దో
లవ్ కుష్ లక్ష్మణుడు
1997 గావ్ దేశ్ బడే చౌదరి భోజ్‌పురి సినిమా
1999 ఉపేంద్ర రాజా విక్రమాదిత్య కన్నడ సినిమా
2006 బాబుల్ ప్యారే పండిట్ హరి సింగ్ భోజ్‌పురి సినిమా
2023 సార్జెంట్ నిఖిల్ తండ్రి JioCinema లో
ఓ మై గాడ్ 2 ప్రిన్సిపాల్ అటల్ నాథ్ మహేశ్వరి
హుకుస్ బుకస్ పండిత్ రాధేషాయం
2024 695
ఆర్టికల్ 370 ప్రధాన మంత్రి హిందీ సినిమా

టెలివిజన్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర
1985 విక్రమ్ ఔర్ బేతాల్ విక్రమాదిత్య రాజు
1987-1988 రామాయణం రాముడు
1989 లవ్ కుష్ రాముడు
1989 విశ్వామిత్రుడు రాజా హరిశ్చంద్ర
1992 ఫూల్వంతి పండిట్ వంకటేష్ శాస్త్రి
1994-95 మషాల్ అజయ్
1995 జై వీర్ హనుమాన్ రామ్
1996- 1997 బుద్ధుడు బుద్ధుడు
1998-1999 ఆషికి సుశీల్
1999-2000 పాల్ చిన్ ప్రతాప్ సింగ్
2000-2001 బసేరా
2001 కైసే కహూన్ జహీర్ అహ్మద్
2002 సాంఝీ అమర్
2003 ఎహసాస్ - కహానీ ఏక్ ఘర్ కి
2003 గాయత్రీ మహిమ రిషి చవాన్
2023 జూబ్లీ నారాయణ్ ఖన్నా

మూలాలు[మార్చు]

  1. "Arun Govil: the first Ram". www.hindustantimes.com (in ఇంగ్లీష్). 2014-10-18. Retrieved 2018-11-10.
  2. "Birthday wishes for Amit, Navina, Yash and Arun". Tellychakkar Dot Com (in ఇంగ్లీష్). 2012-10-30. Retrieved 2020-02-18.
  3. "Arun Govil movies, filmography, biography and songs - Cinestaan.com". Cinestaan. Archived from the original on 2018-04-02. Retrieved 2018-04-01.
  4. "Arun Govil - BollywoodMDB". www.bollywoodmdb.com (in ఇంగ్లీష్). Retrieved 2018-04-01.
  5. "Nargis, Meena Kumari, Madhubala, Suraiya... they all loved me". www.rediff.com. Retrieved 2018-11-11.

బయటి లింకులు[మార్చు]