కాలేజీ బుల్లోడు
Jump to navigation
Jump to search
కాలేజీ బుల్లోడు (1992 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | శరత్ |
---|---|
నిర్మాణం | పి. బలరాం |
తారాగణం | హరీష్, అక్కినేని నాగేశ్వరరావు, రాధిక |
సంగీతం | రాజ్ కోటి |
ఛాయాగ్రహణం | మహీధర్ |
కూర్పు | మురళి రామయ్య |
నిర్మాణ సంస్థ | శ్రీ అనుపమ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
కాలేజీ బుల్లోడు 1992 లో విడుదలైన కామెడీ చిత్రం, దీనిని శ్రీ అనుపమ ప్రొడక్షన్స్ [1] కింద పి. బలరామ్ నిర్మించాడు. శరత్ దర్శకత్వం వహించారు. [2] ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, రాధిక, హరీష్ నటుంచారు. రాజ్-కోటి సంగీతం అందించారు. [3]
కథ[మార్చు]
పారిశ్రామికవేత్త అయిన గోపాల కృష్ణ (అక్కినేని నాగేశ్వరరావు) సమాజంలో ఎంతో గౌరవం ఉన్న వ్యక్తి. కానీ దురదృష్టవశాత్తు, అతను చదువురానివాడు. దానిని వాడుకుని, అతని ప్రత్యర్థి కోటేశ్వరరావు (సత్యనారాయణ) అతన్ని ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటాడు. అదే సమయంలో, అతని కుమారుడు రాజా (హరీష్) కళాశాలలో ఒక అల్లరి చిల్లర వ్యక్తి అవుతాడు. తన గౌరవాన్ని నిలబెట్టుకోవటానికీ తన కొడుకును సక్రమ మార్గంలో పెట్టడానికి, గోపాల కృష్ణ 50 సంవత్సరాల వయస్సులో కళాశాలలో చేరతాడు. గోపాల కృష్ణుడు తన లక్ష్యాన్ని ఎలా సాధిస్తాడనేది మిగతా కథ.
నటీనటులు[మార్చు]
సాంకేతిక వర్గం[మార్చు]
- కళ: శ్రీనివాస రాజు
- నృత్యాలు: సలీమ్, ప్రమీలా, కల్లా
- సంభాషణలు: సత్యానంద్
- సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
- నేపథ్య గానం: ఎస్పీ బాలూ, చిత్ర
- సంగీతం: రాజ్-కోటి
- కథ: బి. వెంకట్రావు
- చిత్రానువాదం: భమిదిపతి రాధాకృష్ణ
- కూర్పు: మురళి-రామయ్య
- ఛాయాగ్రహణం: వై.మహీధర్
- నిర్మాత: పి.బాలారామ్
- దర్శకుడు: శరత్
- బ్యానర్: శ్రీ అనుపమ ప్రొడక్షన్స్
- విడుదల తేదీ: 1992 జూలై 2
పాటలు[మార్చు]
సంఖ్య. | పాట | గాయనీ గాయకులు | నిడివి | |
---|---|---|---|---|
1. | "అందమా ఇలా అందుమా" | SP Balu, Chitra | 4:32 | |
2. | "చమ చమ చమ" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | 5:04 | |
3. | "ఎంతో మధురమీ జీవితం" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 4:49 | |
4. | "రాగింగ్ ఆట" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | 4:51 | |
5. | "ఏమి హాయిలే" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | 4:44 | |
మొత్తం నిడివి: |
24:00 |
మూలాలు[మార్చు]
- ↑ "College Bullodu (Producer)". Filmiclub.
- ↑ "College Bullodu (Direction)". Know Your Films.
- ↑ "College Bullodu (Cast & Crew)". gomolo.com.