ఎన్. రఘువీరా రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎన్. రఘువీరా రెడ్డి అనంతపురం జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు.

బాల్యం[మార్చు]

రఘువీరా రెడ్డి, అనంతపురం జిల్లా, మడకశిర నియోజక వర్గానికి చెందిన నీలకంఠాపురం అనే ఊర్లో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు ఎన్. నరసమ్మ, ఎన్.కావేరప్ప. వారిది వ్యవసాయ యాదవ్ కుటుంబం. తండ్రి 30 సంవత్సరాలు గంగులపాళెం పంచాయితీకి ప్రెసిడెంటుగా పనిచేశాడు. పెదనాన్న శ్రీరామరెడ్డి కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు. బీఎస్సీ, ఎల్.ఎల్.బీ చదివాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

1985లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాడు. 1989లో మడకశిర నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున శాననసభ్యుడిగా ఎన్నికయ్యాడు. కోట్ల విజయభాస్కర రెడ్డి మంత్రివర్గంలో పశు సంవర్థక శాఖా మంత్రిగా పనిచేశాడు. 1994 శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలయ్యాడు.1999లో ఎమ్మెల్యేగా గెలుపొందాడు. 2004 లో మరోసారి గెలుపొంది వై.ఎస్.రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖా మంత్రిగా పనిచేశాడు. 2009 ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. వై.ఎస్.ఆర్ మంత్రివర్గంలో మళ్లీ వ్యవసాయ శాఖా మంత్రిగా పనిచేశాడు. వై.ఎస్ మృతి తర్వాత కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలో రెవిన్యూ శాఖా మంత్రిగా పనిచేశాడు. అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో కూడా రెవిన్యూ శాఖా మంత్రిగా కొనసాగాడు.

ఆంధ్ర ప్రదేశ్ విభజన నేపథ్యంలో అవశేష ఆంధ్ర ప్రదేశ్ కు పిసిసి (ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ఆయన 2023 ఆగస్ట్ 20న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా నియమితుడయ్యాడు.[2]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక 12-మార్చి-2014
  2. Namasthe Telangana (20 August 2023). "కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీని పునరుద్ధరించిన ఖర్గే.. సచిన్‌ పైలట్‌, శశిథరూర్‌, రఘువీరాలకు చోటు". Archived from the original on 20 August 2023. Retrieved 20 August 2023.