మాయాబజార్ ఫర్ సేల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాయాబజార్ ఫర్ సేల్
దర్శకత్వంగౌత‌మి చిల్ల‌గుల్ల
రచనగౌత‌మి చిల్ల‌గుల్ల
శ్వేతా మంచిరోజు
హరిబాబు దాసరి
మాటలుగౌత‌మి చిల్ల‌గుల్ల
శ్వేతా మంచిరోజు
హరిబాబు దాసరి
నిర్మాతరాజీవ్ రంజ‌న్
తారాగణం
ఛాయాగ్రహణంనవీన్ యాదవ్
కూర్పు
రవితేజ గిరజాల
సంగీతంజెర్రీ సిల్వెస్టర్ విన్సన్ట్
నిర్మాణ
సంస్థ
స్పిరిట్ మీడియా
విడుదల తేదీ
2023 జూలై 2 (2023-07-02)
దేశంభారతదేశం
భాషతెలుగు

మాయాబజార్ ఫర్ సేల్ 2023లో విడుదలైన తెలుగు వెబ్ సిరీస్. స్పిరిట్ మీడియా బ్యానర్‌పై రానా దగ్గుబాటి, రాజీవ్ రంజ‌న్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కు గౌత‌మి చిల్ల‌గుల్ల ద‌ర్శ‌క‌త్వం వహించింది. నవదీప్, ఈషా రెబ్బ, నరేష్, ఝాన్సీ, హరితేజ, రవివర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఏ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను జులై 2న విడుదల చేసి[1], జూలై 14 నుండి జీ 5లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2]

కథ[మార్చు]

నరేష్ (పద్మనాభ శాస్త్రి పాస్ట్రీ) తన కూతురు ఇషా రెబ్బా (వల్లి), భార్య ఝాన్సీ (కుసుమ కుమారి ) కొడుకుతో కలిసి మాయాబజార్‌లోని గేటేడ్ కమ్యూనిటీలో విల్లాలో నివసిస్తూఉంటారు . ఈ క్రమంలో ఈ విల్లాలకు బ్రాండ్ అంబాసిడార్‌ హీరో అభిజిత్ (నవ్‍దీప్) విల్లాల ఓపెనింగ్‍కు వచ్చి భవనంపై నుంచి పడి చనిపోతాడు. నవ్‍దీప్ చనిపోయేందుకు కారణమేంటి? ఈ కమ్యూనిటీలో కట్టే ఇళ్ళు అన్నీ చట్టవిరుద్ధం అంటూ ప్రభుత్వం అధికారులు కూల్చడానికి వస్తారు. ఆ సమయంలో ఈ కుటుంబాలు అన్నీ ఏమి చేశాయి, ఈ సమస్యను ఎలా ఎదుర్కొన్నారు ? మాయాబజార్ విల్లాస్ సమస్య తీరిందా? లేదా అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: స్పిరిట్ మీడియా
  • నిర్మాత: రానా దగ్గుబాటి[3], రాజీవ్ రంజ‌న్
  • కథ & మాటలు : గౌత‌మి చిల్ల‌గుల్ల, శ్వేతా మంచిరోజు, హరిబాబు దాసరి
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గౌత‌మి చిల్ల‌గుల్ల
  • సంగీతం: జెర్రీ సిల్వెస్టర్ విన్సన్ట్
  • సినిమాటోగ్రఫీ: నవీన్ యాదవ్
  • ఎడిటర్ :రవితేజ గిరజాల
  • పాటలు: ఉమా వంగూరి

మూలాలు[మార్చు]

  1. A. B. P. Desam (3 July 2023). "ఓటీటీ మూవీ 'మాయాబజార్ ఫర్ సేల్' ట్రైలర్: ఆక్రమించిన స్థలాల్లో విల్లాలు కడితే?". Archived from the original on 30 జూలై 2023. Retrieved 30 July 2023.
  2. Andhra Jyothy (27 June 2023). "ఓటీటీలో అమ్మకానికి మాయాబజార్.. ఎప్పుడంటే?". Archived from the original on 30 జూలై 2023. Retrieved 30 July 2023.
  3. News18 Telugu (28 June 2023). "ఓటీటీలో మాయాబజార్ ఫర్ సేల్.. రానా స్టెప్ చూశారా..?". Archived from the original on 30 జూలై 2023. Retrieved 30 July 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు[మార్చు]