పుత్తడి బొమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పుత్తడి బొమ్మ
(1985 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం జంధ్యాల
తారాగణం నరేష్,
పూర్ణిమ ,
అరుణ
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ ఎస్.వెంకటరావు
భాష తెలుగు

ఈ చిత్రంలో సుత్తి వీరభద్రరావు ఓ కవి. తన కవిత్వంతో చుట్టుపక్కల వారినందరినీ బెదరగొట్టేస్తుంటాడు. అతని బెడద వదిలించుకునేందుకు ఆ ఊరి ప్రజలంతా ఓ ఎత్తు‌ వేస్తారు. ‌కవిరాజుకు గజారోహణం చేయించి, ఆ గజాన్ని ఆయనకే బహుకరించాలని తీర్మానిస్తారు. తనకు సన్మానం జరగనుందని తెలిసి వీరభద్రరావు ఎంతో సంబరపడిపోతాడు. కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ తర్వాత తనకే ఆ గౌరవం లభిస్తోందని సగర్వంగా చెప్పుకుంటాడు. వీరభద్రరావుకి ఊరి ప్రజలు సన్మానం చేసి, గజారోహణ అనంతరం ఆ ఏనుగును ఆయనకే బహూకరిస్తారు. అప్పటి నుంచి ఆ కవిరాజుకు పాట్లు మొదలవుతాయి. ఆ ఏనుగుకు తిండి పెట్టలేక సతమతమవుతుంటాడు. ఏనుగును ఇంట్లో ఉంచలేక ఆరుబయట కట్టేస్తాడు. ఏనుగు ఘీంకారాలతో చుట్టుపక్కల వారు ప్రతిరోజూ అతనితో గొడవపడుతుంటారు. ఇల్లు ఖాళీ చేయమని ఇంటి యజమాని అల్టిమేటం కూడా ఇస్తాడు. ఇంకా నయం ఏనుగు బట్టలు కట్టుకోదు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎన్ని తానులైనా సరిపోరు. శాకాహారి కాబట్టి గానీ, మాంసాహారి అయితే ఇంకేమైనా ఉందా? అంటూ కవిరాజు తల్లడిల్లిపోతుంటారు. గడ్డం పెరిగిగిపోయి, బక్కచిక్కిన దేహం, చిరిగిన దుస్తులతో కవిరాజు బిచ్చగాడిలా తయారవుతాడు. ఏ ఏనుగుమీదైతే గజారోహణం చేస్తాడో, అదో ఏనుగుపై కూర్చుని కవిరాజు భిక్షాటన చేస్తుంటాడు.