రెండు రెళ్ళు ఆరు (2017 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సినిమా పోస్టర్

రెండు రెళ్ళు ఆరు 2017లో విడుదలైన ఒక తెలుగు చలనచిత్రం. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం, డే డ్రీమ్స్‌ బ్యానర్స్‌ పై ప్రదీప్ చంద్ర, మోహన్ అందే నిర్మించిన ఈ సినిమాకు నందు మల్లెల దర్శకత్వం వహించాడు.[1]

కథ[మార్చు]

రాజు (నరేష్) భార్య, రావు (రవి కాలే) భార్య ఇద్దరూ ఒకే ఆసుపత్రిలో ఒకే సమయంలో ప్రసవిస్తారు. రాజుకు మగబిడ్డ, రావుకు ఆడ బిడ్డ పుడతారు. కానీ ఒక అనుకోని విపత్కర పరిస్థితిలో ఆ ఇద్దరు కూడా తమ బిడ్డల్ని మార్చేసుకుంటారు. కానీ సొంత పిల్లల మీదున్న ప్రేమతో వాళ్ళు ఒకే కాలనీలో నివసిస్తుంటారు. అలా మార్చబడ్డ ఆ ఇద్దరు మ్యాడీ (అనిల్), మ్యాగీ (మహిమ) ఎదురెదురు ఇళ్లలో ఉంటూ ఎప్పుడూ గొడవపడుతూ పెరుగుతారు. ఎప్పుడూ బద్ద శత్రువుల్లా ఉండే వారు ఒకరోజు ప్రేమికుల్లా మారిపోతారు. ఒకరంటే ఒకరికి పడని వారు ఎలా ప్రేమలో పడతారు ? అందుకు కారణమైన పరిస్థితులేమిటి ? అసలు వాళ్ళ తండ్రులు వాళ్ళను ఎందుకు మార్చుకున్నారు? అనేదే ఈ సినిమా.[2]

మూలాలు[మార్చు]

  1. http://www.123telugu.com/telugu/reviews/rendu-rellu-aaru-movie-review-in-telugu.html 123 తెలుగు వెబ్ పత్రికలో వచ్చిన చిత్ర సమీక్ష)
  2. http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-reviews/rendu-rellu-aaru/movie-review/59503577.cms టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైన వ్యాసం