కొత్త బంగారు లోకం
స్వరూపం
| కొత్త బంగారు లోకం | |
|---|---|
![]() | |
| దర్శకత్వం | శ్రీకాంత్ అడ్డాల |
| రచన | శ్రీకాంత్ అడ్డాల |
| నిర్మాత | దిల్ రాజు |
| తారాగణం | వరుణ్ సందేశ్, జయసుధ, ప్రకాష్ రాజ్ రావు రమేశ్, శ్వేతా ప్రసాద్ |
| ఛాయాగ్రహణం | ఛోటా కే. నాయుడు |
| కూర్పు | మార్తాండ్ కే. వెంకటేశ్ |
| సంగీతం | మిక్కీ జె. మేయర్ |
విడుదల తేదీ | 9 అక్టోబర్ 2008 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
కొత్త బంగారు లోకం 2008 లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రము. ఇందులో వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ ముఖ్యపాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జే మేయర్ సమకూర్చారు.
కథ
[మార్చు]మాధ్యమిక విద్య (ఇంటర్) చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య చిగురించిన ఆకర్షణ తదనంతర పరిణామాలు కథానేపథ్యము. విశాఖపట్నం సముద్రతీరంలో చిత్రీకరించిన సన్నివేశాలు ఆకట్టుకొంటాయి.
తారాగణం
[మార్చు]
- వరుణ్ సందేశ్ .. బాలు
- ప్రకాష్ రాజ్ .. బాలు తండ్రి విష్ణుమూర్తి
- జయసుధ .. బాలు తల్లి
- రావు రమేశ్ _లెక్చరర్
- శ్వేతా ప్రసాద్ .. స్వప్న
- ఫణికాంత్
- ప్రవీణ్
- సయ్యద్ సోహైల్_బాలు క్లాస్ మేట్
- సాయి సృజన్ పెళ్ళూరి_బాలు క్లాస్ మేట్
- రజిత_స్వప్న తల్లి
- కన్నెగంటి బ్రహ్మానందం_రాయ్ పవర్, కాలేజ్ ప్రిన్సిపాల్
- ఆహుతి ప్రసాద్_స్వప్న తండ్రి
- రాజబాబు
- గౌతంరాజు .
సాంకేతిక వర్గం
[మార్చు]- నిర్మాత ... దిల్ రాజు
- దర్శకత్వం ... శ్రీకాంత్ అడ్డాల
- సంగీతం ... మిక్కీ జె. మేయర్
- రచన: శ్రీకాంత్ అడ్డాల
- పాటలు: శ్రీకాంత్ అడ్డాల, అనంత శ్రీరామ్, సిరివెన్నెల సీతారామశాస్త్రి
- నేపథ్య గాయకులు: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, కృష్ణచైతన్య, ఆదిత్య, సిద్దార్ధ, క్రాంతి, శశికిరణ్, కార్తీక్, మిక్కీ జే మేయర్ , శ్వేతాపండిట్, నరేష్ అయ్యర్, కళ్యాణి నాయర్
- ఛాయ గ్రహణం: చోటా కె నాయుడు
- ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
- నిర్మాణ సంస్థ: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్
- విడుదల:09:10:2008.
పాటల జాబితా
[మార్చు]- కళాశాలలో, రచన: శ్రీకాంత్ అడ్డాల , గానం. కృష్ణచైతన్య, శశి కిరణ్, ఆదిత్య, సిద్ధార్థ, క్రాంతి
- నిజంగా నేనేనా , రచన: అనంత్ శ్రీరామ్, గానం.కార్తీక్
- నీ ప్రశ్నలు , రచన;సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. శ్రీ పండితారాధ్య బాలసుబ్రహ్మణ్యం
- నేనని నీవని, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.శ్వేతా పండిట్
- ఓకే అనేశా , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. నరేష్ అయ్యర్ , కళ్యాణి నాయర్
- కన్ఫ్యూజన్ , రచన: అనంత శ్రీరామ్ ,గానం. కృష్ణచైతన్య, మిక్కీ జే మేయర్.
పురస్కారములు
[మార్చు]| సంవత్సరం | అవార్డు | విభాగము | లబ్ధిదారుడు | ఫలితం |
|---|---|---|---|---|
| 2008 | నంది పురస్కారాలు[1] | ఉత్తమ ఛాయాగ్రాహకుడు | ఛోటా కె.నాయుడు | గెలుపు |
| 2008 | నంది పురస్కారాలు | ఉత్తమ సంగీతదర్శకుడు | మిక్కీ జె. మేయర్ | గెలుపు |
