హ్యాపీ హ్యాపీగా
| హ్యాపీ హ్యాపీగా (2010 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | ప్రియాశరణ్ |
|---|---|
| తారాగణం | వరుణ్ సందేశ్, వేగా తమోటియా, శరణ్య మోహన్ |
| సంగీతం | మణి శర్మ |
| నిర్మాణ సంస్థ | ఓషియన్ ఫిలిమ్స్ |
| భాష | తెలుగు |
హ్యాపీ హ్యాపీగా 2010లో విడుదలైన తెలుగు చిత్రం. వరుణ్ సందేశ్ కథానాయకుడు.
కథ
[మార్చు]సంతోష్ ఒక అనాథ. నలుగురు స్నేహితులతో కలిసి కార్టూన్ గైస్ పేరుతో ఓ గిప్ట్ కార్నర్ తరహా వెరైటీ బిజెనెస్ చేస్తూంటాడు. తమకు కావాల్సిన వారుకి గిప్ట్ ఇవ్వాల్సి వస్తే సంతోష్ కి షాప్ కి ఫోన్ చేస్తే వాళ్ళు ఆ పని పూర్తి చేస్తూంటారు. మరో ప్రక్క సంతోష్ తన ఖాళీ టైమ్ లో తన ప్రేమలో ఎవరన్నా అమ్మాయి పడకపోతుందా అని తిరుగుతూంటాడు. ఈ క్రమంలో అతనికి పూజ పరిచయమవుతుంది. వెంటనే ప్రేమలో పడిన అతను ప్రపోజ్ చేద్దామనుకునేసరికి ఓ విషయం తెలుస్తుంది. అదేమిటంటే ఆమెకి ప్రేమ అంటే సదాభిప్రాయం లేదని. దాంతో నేరుగా ఆమెను ప్రేమిస్తున్నాను అని చెప్పకుండా తను ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నానని అబద్దమాడతాడు. ఎవరా అమ్మాయి తనకు చూపెట్టమని పూజ పట్టుబడితే సంతోష్ అప్పటికప్పుడు తన కళ్ళకు కనపడిన అమ్మాయి ప్రియని చూపెడతాడు. అది నిజమే అనుకుని నమ్మిన పూజ వీరిద్దరనీ కలపాలని ప్లాన్ చేస్తుంది. ఈలోగా మరో మలుపు. ప్రియ మరెవరో కాదు. ఆ ఊళ్ళో ఉన్న పెద్ద డాన్ సూరి చెల్లెలు. అతనికి తన చెల్లి వంక ఎవరు చూసినా నచ్చదు. కాలో చెయ్యో తీసేస్తాడు. ఇలాంటి పరిస్ధితుల్లో ఇరుక్కున్న సంతోష్ ఏం చేసాడు అన్నది మిగిలిన కథ[1].
తారాగణం
[మార్చు]ఈ సినిమాలో నటించిన వివరాలు[2]:
- వరుణ్ సందేశ్ - సంతోష్
- శరణ్య మోహన్ - ప్రియ
- వేగా తమోటియా - పూజ
- ఆలీ
- ఎం. ఎస్. నారాయణ
- పి. రవిశంకర్ - సూరి
- రాజా శ్రీధర్
- రజిత
- తెలంగాణ శకుంతల
సాంకేతికవర్గం
[మార్చు]ఈ చిత్రంలోని సాంకేతిక నిపుణులు[2]:
- మాటలు: అనిల్ రావిపూడి
- సంగీతం: మణిశర్మ
- పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి
- ఛాయాగ్రహణం: వెంకి.ఎ.దర్శన్
- కూర్పు: కె.వి.కృష్ణారెడ్డి
- కళ: బాబ్జీ
- నృత్యం: అజరుసాయి
- నిర్మాత: వడ్లమూడి దుర్గాప్రసాద్
- కథ- స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: ప్రియాశరణ్
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటలన్నీ సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించాడు[3].
- నవ్వాలంటే సందేహం మాని నవ్వేయి అంతే - హరిచరణ్, రీటా
- ఎదురయ్యే ఎవరీ లైలా - రాహుల్ నంబియార్
- పరాగ్గా ప్రేమలో పడినావా - రోజా
- మధురానుభవమా ప్రేమ మతిలేని తనమా ప్రేమ - హేమచంద్ర
- పుటుక్కు జరజర డుబుక్కు మే అడక్కు అది ఒక రహస్యమే - దీప్తి చారి, హేమచంద్ర
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "హ్యాపీ హ్యాపీగా స్టోరి". ఫిల్మ్‌బీట్.కామ్. Retrieved 6 June 2020.
- ↑ 2.0 2.1 సంపాదకుడు (20 April 2010). "వరుణ్‌సందేశ్, వేగ, శరణ్యమోహన్‌ల 'హ్యాపీ హ్యాపీగా'". విశాలాంధ్ర దినపత్రిక. Retrieved 6 June 2020.[permanent dead link]
- ↑ వెబ్ మాస్టర్. "LIST OF HAPPY HAPPYGA SONGS WITH LYRICS". లిరిక్స్ సింగ్ డాట్ కామ్. Retrieved 6 June 2020.