సరదాగా అమ్మాయితో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సరదాగా అమ్మాయితో
దర్శకత్వంభానుశంకర్
నిర్మాతపత్తికొండ కుమారస్వామి
తారాగణంవరుణ్ సందేశ్
నిషా అగర్వాల్
సుమన్ తల్వార్
సంగీతంరవివర్మ
పంపిణీదార్లుశ్రీకుమారస్వామి ప్రొడక్షన్స్
దేశంభారతదేశం
భాషతెలుగు

సరదాగా అమ్మాయితో 2013 జూన్ 14 న విడుదలైన తెలుగు చిత్రం.

కథ[మార్చు]

సంతోష్ (వరుణ్ సందేశ్) ఒక సరదా కుర్రాడు. జల్సా జీవితానికి అలవాటుపడి అనేకమంది అమ్మాయిలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటాడు. అతనికి గీత (నిషా అగర్వాల్) తో పరిచయమయ్యాక ఆమెను ప్రేమించడం మొదలుపెడతాడు. ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు కానీ గీత ధ్యాస అతడిపై పడదు. అతని ప్రయత్నాల వలన విసిగి వేసారిన గీత అతనికి ఒక సవాల్ విసురుతుంది. పదిరోజులపాటు మహిళల వసతి గృహంలో గడపాలని, ఏ మహిళనూ లోబర్చుకోరాదనేదే ఆ సవాల్. ఆమె సవాల్ స్వీకరించిన అతడు ఒక మహిళా వసతి గృహంలో వాచ్‌మన్ గా స్థానం సంపాదిస్తాడు. అక్కడ కొంతమంది యువతులు సంతోష్ ను రెచ్చగొట్టినా అతడు సహనం కోల్పోకుండా పది రోజులు గడుపుతాడు. ఈ క్రమంలో నిజమైన ప్రేమ గొప్పతనాన్ని తెలుసుకొంటాడు. గీత దగ్గరికి వెళ్ళి ఆమెను ఒప్పించాలనుకొనే అతడికి , గీత గురించి కొన్ని చేదు నిజాలు తెలుస్తాయి. అసలు గీత ఎవరు?ఆమె నేపథ్యం ఏమిటి? చివరికి వారిద్దరూ ఒక్కటయ్యారా లేదా? అనేది మిగిలిన కథ.

నటవర్గం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకుడు - భానుశంకర్
  • సంగీతం - రవివర్మ
  • నిర్మాత - పత్తికొండ కుమారస్వామి

బయటి లంకెలు[మార్చు]