బ్రమ్మిగాడి కథ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ్రమ్మిగాడి కథ
దర్శకత్వంవి.ఈశ్వర్ రెడ్డి
రచనపద్మశ్రీ /రమేశ్ చెప్పాల
నిర్మాతరజత్ పార్థసారధి
తారాగణం
ఛాయాగ్రహణంజవహర్ రెడ్డి
కూర్పుశంకర్
సంగీతంకోటి
నిర్మాణ
సంస్థ
మల్టీ డైమెన్షన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రై.లిమిటెడ్
విడుదల తేదీ
2011 జూలై 1 (2011-07-01)
దేశం భారతదేశం
భాషతెలుగు

బ్రమ్మిగాడి కథ 2011లో విడుదలైన తెలుగు సినిమా. మల్టీ డైమెన్షన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ పై రజత్ పార్థసారధి నిర్మించిన ఈ సినిమాకు వి.ఈశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. రమేశ్ చెప్పాల రచన చేశారు.[1] వరుణ్ సందేశ్, అస్మితా సూద్, పూనమ్ కౌర్, బ్రహ్మానందం, కృష్ణుడు, జయప్రకాష్ రెడ్డి, చలపతి రావు, ఆలీ, నాగినీడు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 1 జులై 2011న విడుదలైంది.

కథ[మార్చు]

విజయవాడ నుండి హైదరాబాద్ కి వస్తున్న శివ (వరుణ్ సందేశ్), అనుకోకుండా మాయ (అస్మిత సూద్) అనే అమ్మాయిని కొందరు దుండగుల బారి నుంచి కాపాడతాడు. శివ మేనమామ (జయప్రకాష్ రెడ్డి)కి సినిమాలంటే పిచ్చి. అతనికి ఒక కూతురు (పూనమ్ కౌర్) ఉంటుంది. ఆమెను తన మేనల్లుడికిచ్చి పెళ్ళి చేయాలని అనుకుంటాడు. శివ మేనమామకి ఒక మంచి సినిమా తీయాలని స్టార్ డైరెక్టర్ బ్రహ్మిని(బ్రహ్మానందం) పిలిపిస్తాడు. బ్రహ్మి సినిమా కథ చెపుతూంటాడు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే బ్రహ్మి చేప్పే కథ సీన్ బై సీన్ శివ, మాయల విషయంలో జరుగుతుంటుంది. అది చూసి శివ మేనమామ టెన్షన్ పడుతూంటే అతనికి కథ బాగా నచ్చి కథలోని పాత్రలో ఇన్ వాల్వ్ అయ్యాడనుకుంటాడు బ్రహ్మి. మాయను దుండగులు ఎందుకు వెంటాడుతున్నారు ? శివ తన మేనమామ కూతురుని పెళ్ళి చేసుకుంటాడా ? లేదా అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: మల్టీ డైమెన్షన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రై.లిమిటెడ్
  • నిర్మాత: పి. రామ్మోహన్ రావు

మూలాలు[మార్చు]

  1. NDTV (9 April 2011). "Varun Sandesh's Next Is Brammigadi Katha". Archived from the original on 19 ఆగస్టు 2021. Retrieved 19 August 2021.
  2. 123 Telugu (2011). "Brahmi Gadi Katha Movie Review - Varun Sandesh, Asmita Sood and others - 123telugu.com". Archived from the original on 19 ఆగస్టు 2021. Retrieved 19 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)