Jump to content

మామ మంచు అల్లుడు కంచు

వికీపీడియా నుండి
మామ మంచు అల్లుడు
దర్శకత్వంశ్రీనివాసరెడ్డి
నిర్మాతవిష్ణు మంచు
తారాగణంఅల్లరి నరేష్
మోహన్ బాబు
మీనా
రమ్యకృష్ణ
పూర్ణ
సంగీతంరఘు కుంచె
అచ్చు రాజమణి
Koti
నిర్మాణ
సంస్థలు
24 ఫ్రేంస్ ఫ్యాక్టరీ
శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్
విడుదల తేదీ
25 డిసెంబరు 2015 (2015-12-25)
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్₹15 cr
బాక్సాఫీసు₹19 cr

మామ మంచు అల్లుడు కంచు 2015 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మించాడు. శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో మోహన్ బాబు, అల్లరి నరేష్, మీన, రమ్యకృష్ణ, ఆలీ, పూర్ణ, వరుణ్ సందేశ్లు ప్రధాన పాత్రలలో నటించారు. 2015 డిసెంబరు 25 న ఈ చిత్రం విడుదలయ్యింది.

ఇది 1991 లో వచ్చిన తెలుగు చిత్రం అల్లరి మొగుడుకు అనధికారిక సీక్వెల్. ఇందులో అదే తారాగణం నటించింది.

ఇద్దరు మహిళలను పెళ్ళి చేసుకున్న భక్తవత్సలం నాయుడు ( మోహన్ బాబు ), ఈ విషయాన్ని ఇద్దరికీ తెలియకుండా రహస్యంగా ఉంచగలిగాడు. అతని స్నేహితుడు ఇస్మాయిల్ ( అలీ ) రహస్యాన్ని రక్షించడంలో అతనికి సహాయం చేస్తాడు. అతని మొదటి భార్య సూర్యకాంతం ( మీనా ) కు శ్రుతి ( పూర్ణ ) అనే కుమార్తె, రెండవ భార్య ప్రియంవద ( రమ్య కృష్ణ ) కు ఒక కుమారుడు గౌతమ్ నాయుడు ( వరుణ్ సందేశ్ ) ఉన్నారు. యాదృచ్ఛికంగా, అబ్బాయి, అమ్మాయి ఇద్దరి పుట్టినరోజులు ఒకటే. ఈ లోపాల కామెడీలో నాయుడు వాళ్లకిచ్చే పుట్టినరోజు బహుమతులు తారుమారౌతాయి. గౌతమ్, శ్రుతి తమ బహుమతులు మార్పిడి చేసుకోవడానికి ఒకరినొకరు కలవాలనుకుంటారు. తన రహస్యం బయటపడుతుందేమోనని నాయుడు వాళ్ళిద్దరూ కలవాలని కోరుకోడు. ఇందుకు అతడు, బాలరాజు ( అల్లరి నరేష్ ) సహాయం కోరుతాడు. కానీ బాలరాజు శ్రుతితో ప్రేమలో పడతాడు. బాలరాజును శ్రుతికి దూరంగా ఉంచడానికి ఒకవైపు, రహస్యాన్ని కాపాడాలనే ప్రయత్నం మరోవైపూ ఇదే ఈ సినిమ అంతా. తరువాత, నాయుడు బాలరాజు గురించి తన తండ్రికి తెలియజేస్తాడు. వాస్తవానికి బాలరాజు గ్రామంలో బాలరాజును ప్రేమించే ఒక అమ్మాయి (గ్రామ పెద్దకు సోదరి) ఉంది. ఆమె అన్న తన చెల్లెలిని పెళ్ళి చేసుకోమని బాలరాజును బలవంతం చేస్తూంటాడు. నాయుడు బాల్‌రాజు గురించి తండ్రికి తెలియజేసే లేఖ ఇచ్చి ఇస్మాయిల్‌ను పంపుతాడు. అమ్మాయి ఇస్మాయిల్ చూసిన మొదటి సందర్భంలోనే ప్రేమలో పడుతుంది. బాలరాజు గురించి తెలుసుకోవటానికి బాలరాజు ఇంటికి వెళ్ళమని నాయుడు శ్రుతికి చెబుతాడు. చాలా చర్చల తరువాత శ్రుతి బలరాజు ప్రేమను అంగీకరిస్తుంది. అలాగే బాలరాజు నాయుడు గురించి శ్రుతికి ఏమీ చెప్పడు. ఇది నాయుడు అతడి ప్రేమను అంగీకరించేలా చేస్తుంది. నాయుడు ఆ ఇద్దరినీ ఎందుకు పెళ్ళి చేసుకున్నాడనేది తరువాతి కథ.

నటవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటసంగీతంగాయనీ గాయకులుపాట నిడివి
1."తనలోని సగభాగాన్ని"అచ్చు రాజమణిమనో, అనిత 
2."టింగు టింగు రంగడు"రఘు కుంచెరఘు కుంచె, మళవిక 
3."చమ్మ చక్క"కోటికుమారి, చిన్మయి, ప్రియా హేమేష్, టిప్పు 
4."కింగులాంటొ సింగమంట"కోటిశివ, సాయిచరణ్ 
5."టైటిల్ సంగీతం"అచ్చు రాజమణిఅనుదీప్ దేవ్, శివ