Jump to content

రష్మి గౌతమ్

వికీపీడియా నుండి
రష్మి గౌతమ్
జననం
ఇతర పేర్లురష్మి
వృత్తినటి, వ్యాఖ్యాత, టెలివిజన్ ప్రెసెంటర్

రష్మి గౌతమ్ ఒక సినీ నటి, టి. వి వ్యాఖ్యాత. ఈటివిలో ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ హాస్యకార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.[1]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

రష్మి తల్లి ఒడిషా రాష్ట్రానికి చెందింది. తండ్రి ఉత్తర ప్రదేశ్కు చెందిన వాడు. ఆమె విశాఖపట్నంలో పుట్టి పెరిగింది.[1] చిత్ర పరిశ్రమ కోసం హైదరాబాదుకు వచ్చింది.[2]

చిత్ర సమహారం

[మార్చు]

2002లో సవ్వడి అనే సినిమాతో ఆమె సినిమా కెరీర్ ప్రారంభమైంది.[1] కానీ ఆ సినిమా విడుదల కాలేదు. తర్వాత ఉదయ్ కిరణ్ కథానాయకుడిగా నటించిన హోలీ సినిమాలో సహాయ పాత్ర పోషించింది. తర్వాత యువ అనే సీరియల్ లో నటించింది. 2010లో తెలుగులో వచ్చిన ప్రస్థానం చిత్రంలో రష్మి సహాయనటిగా చేసింది. ఆ తరువాత ఒక రియాలిటీ డ్యాన్స్ షోలో రష్మి డ్యాన్స్ చూసిన నటి సంగీత కందెన్ సినిమాకి అవకాశం ఇప్పించింది. అలా కందెన్ చిత్రంలో నర్మద అనే ప్రధాన పాత్రను రష్మి పోషించింది. 2011లో తమిళ వచ్చిన కందెన్ అనే శృంగార చిత్రంలో నటించి, తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది[3]

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2002 హోలీ షాలు తెలుగు
2004 ఆది కేరాఫ్ ఎ.బి.ఎన్. కాలేజ్ జ్యోత్స్న తెలుగు
2006 థాంక్స్ తేజస్విని తెలుగు
2009 కరెంట్ గీతా తెలుగు
2009 వెల్ డన్ అబ్బా గీతా హందీ
2009 గణేష్ అర్చన తెలుగు
2009 బిందాస్ గీతా తెలుగు
2010 చలాకీ లో తెలుగు
2010 ప్రస్థానం నదియా తెలుగు
2011 కందెన్ నర్మద తమిళం
2012 లాగిన్ వృతిక హందీ
2012 గురు అంకిత కన్నడ ఉత్తమ మొదటి చిత్ర నటిగా సైమా అవార్డుకు నామినెట్
2012 మాప్పిలై వినాయగర్ తమిళం
2013 ప్రియముదన్ ప్రియ తమిళం చిత్రీకరణలో ఉంది
2015 దౌలత్ తమిళం
2015 బస్తీ ఐటం సాంగ్ తెలుగు
2015 వ్యూహం తెలుగు చిత్రీకరణలో ఉంది
2015 చారుశీల[4][5] చారుశీల తెలుగు
2016 గుంటూర్ టాకీస్[6] సువర్ణ తెలుగు
2016 రాణి గారి బంగళా[7] తెలుగు
2016 అంతం[8] వనిత తెలుగు
2016 తను వచ్చెనంట[9] తెలుగు
2017 నెక్స్ట్ నువ్వే రష్మి
2018 అంతకు మించి మధుప్రియ
2019 శివరంజని మధు (వల్లీ)
2021 బొమ్మ బ్లాక్‌బస్టర్‌
2023 బాయ్స్ హాస్టల్

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం ప్రొడక్షన్ పాత్ర పేరు ఛానల్ పేరు
2007 యువ స్వాతి వనిత టీవీ
2011 ఐడియా సూపర్ పోటీదారురాలు ఈటీవీ
2013 జబర్దస్త్ కతర్నాక్ కామెడీ షో వ్యాఖ్యాత ఈటీవీ
2013 సూపర్ కుటుంబం వ్యాఖ్యాత జెమినీ టీవీ
2014 రగడ ది అల్టిమేట్ డాన్స్ షో వ్యాఖ్యాత టాలీవుడ్ టీవీ
2014 ఎక్స్ట్రా జబర్దస్త్ వ్యాఖ్యాత ఈటీవీ
2016 ఢీ జోడి టీమ్ లీడర్ ఈటీవీ
2022 శ్రీదేవి డ్రామా కంపనీ ఇంద్రజతో సహా వ్యాఖ్యాత ఈటీవీ

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "ఈ లోకం చాలా క్రూరమైంది!". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 10 November 2017. Retrieved 10 November 2017.
  2. DECCAN CHRONICLE, ENTERTAINMENT, TOLLYWOOD (Aug 7, 2015). "I have been cheated: Rashmi Gautam". Retrieved 15 September 2016.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)
  3. ది హిందూ, FEATURES (May 21, 2011). "Kanden - Cool treat". Retrieved 15 September 2016.
  4. వెబ్ దునియా, వినోదం » తెలుగు సినిమా » కథనాలు. "పాటల రికార్డింగ్‌తో ప్రారంభమైన జ్యోత్స్న ఫిలింస్‌ 'చారుశీల'". telugu.webdunia.com. Retrieved 15 September 2016.
  5. సాక్షి, సినిమాకథ (July 17, 2016). "చారుశీల ఏం చేసింది?". Retrieved 15 September 2016.
  6. యూట్యూబ్, గుంటూర్ టాకీస్ సినిమా. "Guntur Talkies Latest Telugu Full Movie 2016". www.youtube.com. Retrieved 15 September 2016.
  7. తెలుగు మిర్చి, సినిమా. "'రాణి గారి బంగ్లా ' వచ్చేస్తుంది". www.telugumirchi.com/. Retrieved 15 September 2016.[permanent dead link]
  8. నమస్తే తెలంగాణ, సినిమా (7 July 2016). "ఈ రోజే రేష్మి గౌత‌మ్‌ 'అంతం' విడుదల". Archived from the original on 12 August 2016. Retrieved 15 September 2016.
  9. లైవ్ భారత్, సినిమా. "జాంబీ కాన్సెప్ట్‌తో వ‌స్తోన్న మూవీ 'త‌ను… వ‌చ్చేనంట‌'". livebharath.com. Archived from the original on 2 May 2016. Retrieved 15 September 2016.

ఇతర లింకులు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రష్మి గౌతమ్ పేజీ