అంతకు మించి (2018 సినిమా)
అంతకు మించి | |
---|---|
దర్శకత్వం | జానీ |
రచన | జానీ |
నిర్మాత | జై పద్మనాభ రెడ్డి |
తారాగణం | రష్మి గౌతమ్ జై అజయ్ ఘోష్ |
ఛాయాగ్రహణం | బాల్‌రెడ్డి |
కూర్పు | క్రాంతి |
సంగీతం | సునీల్ కశ్యప్ |
నిర్మాణ సంస్థలు | సతీష్ జై ఫిల్మ్స్ యు అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ |
విడుదల తేదీs | 24 ఆగస్టు, 2018 |
సినిమా నిడివి | 115 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అంతకు మించి , 2018 ఆగస్టు 24న విడుదలైన తెలుగు రొమాంటిక్ హర్రర్ థ్రిల్లర్ సినిమా.[1][2] సతీష్ జై ఫిల్మ్స్, యు అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లలో జై, పద్మనాభ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు జానీ దర్శకత్వం వహించాడు. ఇందులో రష్మి గౌతమ్, జై, అజయ్ ఘోష్, సూర్య, మధునందన్, రవిప్రకాష్ ముఖ్య పాత్రల్లో నటించగా, సునీల్ కశ్యప్ సంగీతం, బాల్‌రెడ్డి సినిమాటోగ్రఫీ అందించాడు.
కథా నేపథ్యం
[మార్చు]మధ్య తరగతి యువకుడైన రాజు (జై) కష్టపడకుండా లక్షాధికారి కావాలని కలలు కంటూ ఉంటుంటాడు. మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో పాల్గొని కోటీశ్వరుడు అయిపోవాలనుకుని దానికి సంబంధించిన ప్రాసెస్ గురించి తెలుసుకోవాలని అనుకుంటాడు. దెయ్యం ఉందని నిరూపిస్తే ఐదు కోట్లు ఇస్తానని ఓ ప్రొఫెసర్ ఇచ్చిన ఓ ప్రకటనను చూసి, దయ్యాలున్నాయని నిరూపించి ఆ ఐదు కోట్టు కొట్టేయాలని స్మశానాల చుట్టూ తిరుగుతుంటాడు. ఈ క్రమంలో ఒక ఫామ్ హౌస్ లో ఉంటున్న తన సోదరి ఇంటిలోనే కొన్ని విచిత్రమైన సంఘటనలను గమనించి, అక్కడ దెయ్యం ఉందని ఎలాగైనా ప్రూవ్ చెయ్యాలనుకుంటాడు. అదే సమయంలో మూడనమ్మాకాలు నమ్మని బ్యాచ్ ఒకటి ఆ ఇంట్లోకి వస్తారు. అందులో ఉన్న మధుప్రియ (రష్మి) అనే అమ్మాయిని తొలిచూపులోనే ఇష్టపడతాడు రాజు. దెయ్యం ఉందా? లేదా ? ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.
నటవర్గం
[మార్చు]- జై (రాజు)
- రష్మి గౌతమ్ (మధు ప్రియ)
- రవిప్రకాష్
- మధునందన్
- అజయ్ ఘోష్ (క్షుద్ర మాంత్రికుడు)
- సూర్య
- టి.ఎన్.ఆర్
పాటలు
[మార్చు]ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం సమకూర్చగా, సినిమాలోని రెండు పాటలను కరుణాకర్ ఆదిగర్ల రాశాడు. 2018, ఆగస్టు 21న ఆదిత్యా మ్యూజిక్ ద్వారా పాటలు విడుదల చేయబడ్డాయి.[3][4]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ఊసులాడు మెల్లగా" | కరుణాకర్ ఆదిగర్ల | నిఖితా గాంధీ | 4:10 |
2. | "పైసా లోకం" | కరుణాకర్ ఆదిగర్ల | సునీల్ కశ్యప్ | 4:06 |
మొత్తం నిడివి: | 8:16 |
మూలాలు
[మార్చు]- ↑ "Anthaku Minchi". 24 August 2018. Retrieved 24 February 2021.
- ↑ "Review by IndiaGlitz". www.Indiaglitz.com. 5 August 2018. Archived from the original on 20 ఏప్రిల్ 2021. Retrieved 24 February 2021.
- ↑ Jai, RashmiGautham; Satish, Jhony (23 August 2018). "Anthaku Minchi Full Songs Jukebox". youtube.com.
- ↑ "Anchor Rashmi Comments on YouTube Channets at Anthaku Minchi Audio launch | Friday Poster". youtube.com.