సుమలతా రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుమలతా రెడ్డి
Anchor Sumalatha Reddy.jpg
సుమలతా రెడ్డి
జననంసుమలతా రెడ్డి పోరెడ్డి
జూలై 18
హైదరాబాదు, తెలంగాణ
నివాస ప్రాంతంహైదరాబాదు
విద్యఎం.కాం.
ప్రసిద్ధితెలుగు టెలివిజన్ వ్యాఖ్యాత, నటి, న్యూస్ రీడర్
భార్య / భర్తతిరుమల్ రెడ్డి సుంకరి
పిల్లలుఒక పాప, ఒక బాబు
తండ్రిఅనంతరెడ్డి
తల్లిప్రేమలత

సుమలతా రెడ్డి తెలుగు టెలివిజన్ వ్యాఖ్యాత, నటి, న్యూస్ రీడర్.[1] ఈటీవీ 2లో వచ్చిన సఖి, జీ తెలుగులో వచ్చిన మీ ఇంటి వంట కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా చేసింది.[2]

జీవిత విషయాలు[మార్చు]

సుమలత జూలై 18న హైదరాబాదులో జన్మించింది. తండ్రి అనంతరెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉద్యోగిగా, తల్లి ప్రేమలత పోస్టల్ విభాగంలో ఫ్రీ లాన్సర్ ఉద్యోగిగా పనిచేశారు. ఉస్మానియా మోడల్ హైస్కూల్‌లో పాఠశాల విద్యను చదివిన సుమలత, ఉస్మానియాలో ఎం.కాం పూర్తిచేసింది.

వివాహం - పిల్లలు[మార్చు]

బంధువుల అబ్బాయి సుంకరి తిరుమల్ రెడ్డితో 2005, జూన్ 1న సుమలత పెళ్ళి జరిగింది. వీరికి ఒక పాప, ఒక బాబు.

సినిమారంగం[మార్చు]

చిన్నప్పటి నుండి దూరదర్శన్ లో టి.వి కార్యక్రమాలు చూసిన సుమలతకు టివిరంగంపై అసక్తి పెరిగింది. ఒకరోజు బస్టాప్‌లో సుమలతని చూసిన సాయి కుమార్ సినిమాలో (హీరో చెల్లెలు పాత్ర) పాత్ర ఇచ్చాడు.[3]

టీవీరంగం[మార్చు]

ఈటివిలో వచ్చిన సినీరంజని మనోరంజని కార్యక్రమంలో తొలిసారిగా యాంకరింగ్ చేసింది. తర్వాత వివిధ ఛానళ్ళలో అనేక కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా చేసింది. ఈటివి 2లో సఖి, జీ తెలుగులో మీ ఇంటి వంట (2500 ఎపిసోడ్లు) కార్యక్రమాలు సమలతకు మంచి గుర్తింపును ఇచ్చాయి. ఆ తరువాత వి6 న్యూస్ ఛానల్‌లో న్యూస్ రీడర్‌గా పనిచేసింది.

మూలాలు[మార్చు]

  1. Telangana Today, Features (21 February 2017). "Sweet as honey". Bhawana Tanmayi. Archived from the original on 18 July 2020. Retrieved 18 July 2020.
  2. The Hindu, Andhra Pradesh (30 December 2010). "Seven eventful years and still going strong". T. Lalith Singh. Archived from the original on 18 July 2020. Retrieved 18 July 2020.
  3. ఈ రంగంలో ఓపిక చాలా అవసరం, నవ తెలంగాణ, హైదారాబాదు, 27 డిసెంబరు 2015.