Jump to content

ఉదయభాను

వికీపీడియా నుండి


ఉదయభాను
జన్మ నామంఉదయభాను
జననం (1980-08-05)1980 ఆగస్టు 5
సుల్తానాబాద్,కరీంనగర్, తెలంగాణ
ఇతర పేర్లు భాను
భార్య/భర్త శ్రీనివాస్

ఉదయభాను ప్రముఖ టెలివిజన్ ప్రయోక్త, నటి. కరీంనగర్ జిల్లా, సుల్తానాబాద్ ఆమె స్వస్థలం. పదోతరగతి చదువుతుండగా మొట్టమొదటగా కెమెరా ముందుకు వచ్చింది. ఈటీవీలో ప్రసారమైన హృదయాంజలి అనే కార్యక్రమంలో ప్రేక్షకులవద్దకు వెళ్ళి వారితో సరదాగా మాట్లాడించడం ఆ షో ప్రధాన ఉద్దేశం. ఆమెకు అప్పటికి యాంకర్ అనే పదానికి అర్థం తెలియకపోయినా గలగలా మాట్లాడుతూ ప్రేక్షకుల ఆదరణ పొందింది.[1]

బాల్యం, తలిదండ్రులు

[మార్చు]

ఆమె తండ్రి డాక్టర్, తల్లి ఆయుర్వేద వైద్యురాలు. ఆమెకు సాప్ట్‌వేర్ జాబ్ చేసే ఒక తమ్ముడు ఉన్నాడు.[2] ఆమె తండ్రి ఒక కవి. ఆయన కలంపేరు ఉదయభాను. దానినే కూతురుకు పెట్టాడు. ఆయన ఉదయభానుకు నాలుగేళ్ళ వయసులో చనిపోయారు. [3] ఆయన చనిపోయాక తల్లి ఒక ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకొంది. అతడికి ఏడుగురు సంతానం. ఆమె 15 వ ఏట ఒక ముస్లీంతో వివాహం జరిగింది. ఆమెకు ఇష్టం లేకపోవటం వలన విడాకుల అనంతరం విజయకుమార్ అనే అతడిని తల్లి అనుమతికి వ్యతిరేకంగా వివాహం చేసుకొన్నది. ఆమె ఎం.ఏ వరకూ చదివింది.

సినీ జీవితం

[మార్చు]

10 వతరగతి చదువుతుండగా మొదటి సినిమా ఎర్ర సైన్యంలో చేసింది,[3] తరువాత కొన్ని తమిళ, కన్నడ సినిమాలో నటించింది

నటించిన చిత్రాలు

[మార్చు]

టెలివిజన్ కార్యక్రమాలు

[మార్చు]
  • హృదయాంజలి (ఈ టీవీ)
  • వన్స్ మోర్ ప్లీజ్ (జెమినీ టీవీ)
  • సాహసం చేయరా డింబకా (జెమినీ టీవీ)
  • డ్యాన్స్ బేబీ డ్యాన్స్ (జెమినీ టీవీ)
  • రేలారే రే రేలా (మా టీవి)
  • ఢీ రియాలిటీ డ్యాన్స్ షో (ఈ టీవీ)
  • జాణవులే నెరజాణవులే (జెమినీ టీవీ)
  • పిల్లలు పిడుగులు (జెమిని టీవి)

మూలాలు

[మార్చు]
  1. "ఉదయభానుపై ప్రముఖ ఆంగ్ల పత్రిక [[ది హిందూ]] లో వచ్చిన వార్త 2". Archived from the original on 2012-11-07. Retrieved 2010-08-08.
  2. "A bundle of energy". The Hindu. Chennai, India. 30 September 2002. Archived from the original on 1 జూలై 2003. Retrieved 16 జూన్ 2016.
  3. 3.0 3.1 ఐడిల్ బ్రెయిన్ లో ఉదయభాను ముఖాముఖి

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఉదయభాను&oldid=4190492" నుండి వెలికితీశారు