ముందడుగు (1983 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముందడుగు
(1983 తెలుగు సినిమా)
Mundadugu 1983.jpg
దర్శకత్వం కె.బాపయ్య
తారాగణం శోభన్ బాబు,
శ్రీదేవి,
కృష్ణ,
చలపతిరావు
సంగీతం కె.చక్రవర్తి
గీతరచన వేటూరి సుందరరామమూర్తి
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

ఇది 1983లో వచ్చిన తెలుగుసినిమా.

చిత్రకథ[మార్చు]

గుమ్మడి, శివకృష్ణ అన్నదమ్ములు. శివకృష్ణ అభ్యుదయభావలు కలవాడు. ఆస్తిని ప్రజల కొరకు ఖర్ఛు చేయబోతే అన్న గుమ్మడి వారిస్తాడు. వారి అభిప్రాయబేధాలను రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, చలపతిరావు పెంచి వారు విడిపోయెటట్లు చేస్తారు. శివకృష్ణ చావుకి కారణమౌతారు. వారి పిల్లలు చక్రవర్తి (శోభన్), తిలక్ (కృష్ణ). చుట్టరికం తెలియకనే కృష్ణ, గుమ్మడి సంస్థలో పనిచేస్తుంటాడు. జయప్రద గుమ్మడికి మేనకోడలు. కృష్ణకు ఆమెకు మధ్య ప్రేమ. చక్రవర్తి వారి సంస్థ లోని స్కూలు టీచరు కూతురు శ్రీదేవిని ప్రేమిస్తాడు. కృష్ణ మీద అవినీతి ఆరోపణ చేస్తారు రావుగోపలరావు బృందం. ఆ సమయంలో వచ్చి అన్నపూర్ణ గతాన్ని గుర్తు చేస్తుంది. తరువాత చక్రవర్తి, తిలక్ ల మధ్య సంఘర్షణ, కలయిక చిత్రకథ. పరుచూరి బ్రదర్స్ శక్తివంతమైన సంభాషణలు చిత్ర విజయానికి తోడ్పడ్డాయి. రావుగోపాలరావు బృందం అక్రమ సంపాదనను సుబ్రహ్మణ్యస్వామి గుడిలో పుట్టలో దాయడం, ముగింపులో పాముల చంపి సొమ్ము తీసుకోవడానికి ప్రయత్నించడం, దానిని కథానాయకులు ప్రతిఘటించడం, అప్పటి పాట - ఇవి దేవుడు చేసిన మనుషులు సినిమాలో క్లైమాక్స్ ను గుర్తు తెస్తాయి. ఈ చిత్రం గురించి రివ్యూలో 'సామ్యవాద ముసుగులో మసాలా సినిమా' అని సితార పత్రిక అభిప్రాయపడింది.

పాటలు[మార్చు]

  1. ఏ తల్లి కన్నదో నిన్ను
  2. నాకొక శ్రీమతి కావాలి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  3. చిలకలూరిపేట కాడ చిలకో - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  4. పోరా ఓ కంతిరి మావా
  5. ప్రేమకు నేను పేదను కాను
  6. వేయి పడగల మీద కోటి మణుగుల నేల మోసి అలసిన స్వామి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం