శ్రీవారి ముచ్చట్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీవారి ముచ్చట్లు
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
నిర్మాణం ఎన్. ఆర్. అనూరాధాదేవి
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
జయప్రద,
జయసుధ
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ లక్ష్మీ ఫిల్మ్స్ కంబైన్స్
భాష తెలుగు

చిత్రకథ[మార్చు]

సంపన్నుడైన గోపీ శ్రీనగర్‌లో రాధను ప్రేమిస్తాడు. కాశ్మీర్ అందానికి ప్రతిరూపం రాధ. పెళ్ళి చేసుకుంటానని బాస చేసి ఉంగరం తొడిగి గాంధర్వ వివాహం చేసుకుంటాడు గోపి. ఇంటికి తిరిగివెళ్ళి తల్లిని, తండ్రిని ఒప్పించి శ్రీనగర్ చేరుకున్న గోపీకి రాధకు వేరే పెళ్ళయిందని తెలిసింది. భగ్నహృదయంతో తెరిగి వెళ్ళిపోయిన గోపీ తన మేనమామ కూతురు ప్రియను వివాహం చేసుకుంటాడు. బావకు నాట్యం అంటే ఇష్టమని ప్రియ నాట్యం ఒక డ్యాన్స్ మాస్టర్ వద్ద నేర్చుకుంటుంది. అరంగ్రేటం రోజున ప్రియకు నాట్యం నేర్పిన గురువును చూసి గోపీ షాక్ అవుతాడు. ఆమె ఎవరో కాదు అతని మాజీ ప్రేయసి రాధ. తన జ్ఞాపకాల మూలంగా గోపి ప్రియకు దగ్గర కావడం లేదని గ్రహించిన రాధ దానికి తగిన ఏర్పాట్లు చేస్తుంది. తన బావ ప్రియురాలు రాధ అని ప్రియకు తరువాత తెలుస్తుంది[1].

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

  1. ఆకాశం ముసిరేసింది ఊరంతా ముసుగేసింది - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  2. ఉదయ కిరణ లేఖలో హృదయ వీణ తీగలో - ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  3. కాళ్ళగజ్జ కంకాళమ్మ కాళ్ళకు గజ్జలు ఎక్కడివమ్మా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
  4. తూరుపు తెల తెలవారగనే తలుపులు తెరచి తెరవగానే - పి.సుశీల
  5. ముక్కుపచ్చలారని కాశ్మీరం ఆ ముక్కుపుడకతో వచ్చింది - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  6. సూర్యుని కొకటే ఉదయం మనిషికి ఒకటే హృదయం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

మూలాలు[మార్చు]

  1. వెంకట్రావు (9 January 1981). "చిత్రసమీక్ష శ్రీవారి ముచ్చట్లు". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 67 సంచిక 276. Retrieved 2 February 2018.[permanent dead link]

బయటిలింకులు[మార్చు]