ఎన్. అనూరాధాదేవి

వికీపీడియా నుండి
(ఎన్. ఆర్. అనూరాధాదేవి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఎన్.అనూరాధాదేవి
జననం (1947-10-24) 1947 అక్టోబరు 24 (వయసు 76)
విజయవాడ, ఆంధ్రప్రదేశ్ India
నివాస ప్రాంతంహైదరాబాదు
వృత్తిభారతీయ చలనచిత్ర నిర్మాత
క్రియాశీలక సంవత్సరాలు1970-2000
మతంహిందూ మతం
భార్య / భర్తనంగనూరు శ్రీనివాసరావు
తండ్రిమీర్జాపురం రాజా
తల్లిసి.కృష్ణవేణి

ఎన్. అనూరాధాదేవి తెలుగు చలనచిత్ర నిర్మాత. బహుకొద్దిమంది మహిళా నిర్మాతలలో ఈవిడ ఒకరు. ఈమె మూడు తరాల హీరోలతో చిత్రాలను నిర్మించింది. ఈమె నిర్మించిన సినిమాలలో 80 శాతం విజయవంతమై సక్సెస్‌ఫుల్ నిర్మాతగా పేరు సంపాదించుకుంది.

జీవిత విశేషాలు[మార్చు]

ఈమె 1947, అక్టోబరు 24న విజయవాడలో జన్మించింది. ఈమె తండ్రి శోభనాచల పిక్చర్స్ అధినేత మిర్జాపురం రాజాగా ప్రసిద్ధులైన రాజా వెంకట్రామ అప్పారావు. ఈమె తల్లి సుప్రసిద్ధ నటి, నిర్మాత సి.కృష్ణవేణి. ఈమె మద్రాసులోని గుడ్ షెపర్డ్ స్కూలులో ఎనిమిదవ తరగతి వరకు చదివింది. ఆ తరువాత ఈమెకు చదువు అబ్బకపోవడంతో అంతటితో ఆపివేసింది. ఈమెకు 1967లో వరంగల్లు వాస్తవ్యుడు నంగనూరు శ్రీనివాసరావుతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు అమ్మాయిలు పుట్టారు. ఈమె భర్త 2005లో మరణించాడు.[1]

సినిమా నిర్మాణం[మార్చు]

ఈమె తండ్రి మీర్జాపురం రాజా తన తరువాత కూడా చలనచిత్ర నిర్మాణ రంగ కార్యకలాపాలు కొనసాగాలనే ఉద్దేశంతో ఈమెను నిర్మాతగా కొనసాగమని కోరాడు. అతనే లక్ష్మీ ఫిలిమ్స్ కంబైన్స్ అనే బ్యానరు పేరు పెట్టాడు. ఈమె మొదట కన్నడ భాషలో రాజ్‌కుమార్ హీరోగా భక్త కుంబార అనే సినిమాను కలర్‌లో నిర్మించింది. ఈ సినిమా 1974లో విడుదలయ్యింది. తరువాత ఈ సినిమానే తెలుగులో చక్రధారి పేరుతో అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడిగా రీమేక్ చేసింది. ఆ తరువాత హిందీలో హిట్ అయిన సినిమా "సమాధి"ని నిండు మనిషి పేరుతో నిర్మించింది. ఈ సినిమాలో శోభన్ బాబు ద్విపాత్రాభినయం చేశాడు. ఆ తరువాత ఈమె అక్కినేని నాగేశ్వరరావు, మురళీమోహన్, చిరంజీవి, వడ్డే నవీన్, అబ్బాస్, రవితేజ, జె.డి.చక్రవర్తి మొదలైన హీరోలతో, దాసరి నారాయణరావు, ఎ.కోదండరామిరెడ్డి, సి.వి.శ్రీధర్, టి.ఎల్.వి.ప్రసాద్ వంటి దర్శకులతో ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించింది.

సినిమాల జాబితా[మార్చు]

ఈమె నిర్మాతగా లక్ష్మీ ఫిలిం కంబైన్స్ బ్యానర్‌పై తెలుగులో నిర్మించిన సినిమాల పాక్షిక జాబితా:

  1. చక్రధారి (1977)
  2. నిండు మనిషి (1978)
  3. రావణుడే రాముడైతే (1979)
  4. శ్రీవారి ముచ్చట్లు (1981)
  5. రాముడు కాదు కృష్ణుడు (1983)
  6. అనుబంధం (1984)
  7. ఆలయదీపం (1985)
  8. ఇల్లాలే దేవత (1985)
  9. ప్రియా ఓ ప్రియా (1997)
  10. ప్రేమించేమనసు (1999)
  11. మా పెళ్ళికి రండి (2000)

మూలాలు[మార్చు]

  1. వినాయక, రావు (9 June 2010). "ఇప్పుడేం చేస్తున్నారు? - నిర్మాత ఎన్.ఆర్.అనూరాధాదేవి". నవ్య వీక్లీ: 8–10. Retrieved 11 April 2017.[permanent dead link]

బయటి లింకులు[మార్చు]