రాముడు కాదు కృష్ణుడు
రాముడు కాదు కృష్ణుడు (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
---|---|
నిర్మాణం | ఎన్. ఆర్. అనూరాధాదేవి |
రచన | దాసరి నారాయణరావు |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు సత్యనారాయణ రాధిక జయసుధ జయంతి సూర్యకాంతం |
సంగీతం | చక్రవర్తి |
ఛాయాగ్రహణం | వి.ఎస్.ఆర్. స్వామి |
కూర్పు | బి. కృష్ణం రాజు |
నిర్మాణ సంస్థ | లక్ష్మి ఫిల్మ్ కంబైన్స్ |
భాష | తెలుగు |
రాముడు కాదు కృష్ణుడు 1983 లో వచ్చిన సినిమా. దీనిని లక్ష్మి ఫిల్మ్స్ కంబైన్స్ పతాకంపై [1] ఎన్.ఆర్ అనురాధా దేవి నిర్మించగా, దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు.[2] ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, రాధిక ప్రధాన పాత్రల్లో నటించారు.[3] చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.[4] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నమోదైంది.
కథ[మార్చు]
రాము (అక్కినేని నాగేశ్వరరావు) అమాయకుడు. కుటుంబ ప్రతిష్ఠకు కట్టుబడి ఉండే కోటీశ్వరుడు బహదూర్ అప్పా రావు (సత్యనారాయణ) కుమారుడు. రాము చుట్టూ చాలా మంది బంధువులు ఉన్నారు. అతని మామ గోపాలరావు ఒక మోసగాడు. అతని భార్య రాధమ్మ (రాజసులోచన), తల్లి కాంతమ్మ (సూర్యకాంతం), కుమార్తె జయమ్మ (జయమాలిని), మేనల్లుడు గిరి (గిరి బాబు) వీరంతా అతనికి సేవ చేస్తామనే ముసుగులో అతడి ఆస్తిని స్వాధీనం చేసుకునేందుకు కుట్ర పన్నారు. రాముడిని జాగ్రత్తగా చూసుకునేది అతని వదిన వరాలమ్మ (జయంతి), మరణించిన అన్నయ్య భార్య. ఆమెనతను తల్లిగా గౌరవిస్తాడు. రాము ఒక పేద అమ్మాయి శారద (రాధిక) ను ప్రేమిస్తాడు. కాని అతను తన తండ్రి ఆజ్ఞను పాటిస్తూ ఆమెను వదులుకొని జయమ్మను పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమవుతాడు. వాస్తవానికి, జయమ్మకు గిరితో సంబంధం ఉంది, ఇది కూడా వరాలమ్మ గమనించి రాముకు చెబుతుంది. అప్పుడు గోపాలరావు, రాము వరాలమ్మల మధ్య అక్రమ సంబంధాన్ని ఆపాదించి పసిపిల్లలతో పాటు ఆమె ఇంటిని విడిచి వెళ్ళేలా చేస్తాడు. ఆ తరువాత, రాము కూడా ఆస్తిని వదులుకుని వెళ్ళిపోతాడు. ఆ తరువాత, అప్పారావును దివాళా తీయించడం, పిచ్చివాడిగా చూపించి ఇంట్లోనే బంధించి ఉంచడం చేస్తారు.
మరోపక్క, కృష్ణ (అక్కినేని నాగేశ్వర రావే) చలాకీ కుర్రాడు, రాము తమ్ముడు, తన తల్లి లక్ష్మి (సుకుమారి) తో కలిసి నివసిస్తూంటాడు. ఒక అందమైన అమ్మాయి సత్య (జయసుధ) తో ప్రేమలో పడతాడు. ఒకసారి అతను అనుకోకుండా రామును కలుసుకుంటాడు. గోపాల రావు కుటుంబం యొక్క తప్పుడు ఆట కారణంగా ఆమె తండ్రి అప్పారావు గర్భవతిగా ఉన్నప్పుడు తనను మోసం చేశాడని లక్ష్మి గతం వివరిస్తుంది. ఇంతలో, కృష్ణ విచ్ఛిన్నమైన కుటుంబాన్ని కలిపి, శారదను కూడా తిరిగి తీసుకువస్తాడు. అప్పారావు కూడా జైలు నుండి తప్పించుకొని వారిని చేరుకుంటాడు. ప్రస్తుతం, కృష్ణుడు ఒక నాటకం ఆడి, దుష్టుల ఆట కట్టిస్తాడు. రాము - శారద, కృష్ణ -సత్య ల పెళ్ళిళ్ళతో ఈ చిత్రం ముగుస్తుంది.
తారాగణం[మార్చు]
- రాము & కృష్ణ పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు (ద్వంద్వ పాత్ర)
- సత్యగా జయసుధ
- శారదాగా రాధిక
- గోపాల్ రావుగా రావు గోపాల్ రావు
- బహదూర్ అప్ప రావుగా సత్యనారాయణ
- లింగంగా అల్లు రామలింగయ్య
- ప్రభాకర్ రెడ్డి
- గిరి బాబుగా గిరి బాబు
- కాంతమ్మగా సూర్యకాంతం
- రాధమ్మగా రాజసులోచన
- వరలమ్మగా జయంతి
- లక్ష్మిగా సుకుమారి
- జయమ్మలిగా జయమలిణి
- మమతగా మమత
సాంకేతిక వర్గం[మార్చు]
- కళ: భాస్కర్ రాజు
- నృత్యాలు: సలీం, ప్రకాష్
- స్టిల్స్: మోహన్జీ - జగన్జీ
- నేపథ్య గానం: ఎస్పీ బాలు, పి. సుశీల, ఎస్. జానకి
- సంగీతం: చక్రవర్తి
- కూర్పు: బి. కృష్ణరాజు
- ఛాయాగ్రహణం: వి.ఎస్.ఆర్ స్వామి
- నిర్మాత: ఎన్.ఆర్ అనురాధ దేవి
- కథ - చిత్రానువాదం - సాహిత్యం - సంభాషణలు - దర్శకుడు: దాసరి నారాయణరావు
- బ్యానర్: లక్ష్మి ఫిల్మ్స్ కంబైన్స్
- విడుదల తేదీ: 1983 మార్చి 25
పాటలు[మార్చు]
చక్రవర్తి సంగీతం సమకూర్చారు. సాహిత్యం దాసరి నారాయణరావు రాశారు. ఈ చిత్రంలోని ఒక లైలా కోసం పాట బ్లాక్ బస్టరైంది. ఇది నాగేశ్వరరావు మనవడు నాగ చైతన్య నటించిన 2014 ఒక లైలా కోసం చిత్రంలో రీమిక్స్ చేసారు. AVM ఆడియో కంపెనీ ద్వారా సంగీతం విడుదల చేసారు.[5]
ఎస్. | పాట పేరు | గాయకులు | పొడవు |
---|---|---|---|
1 | "ఒక లైలా కోసం" | ఎస్పీ బాలు, పి.సుశీల | 5:27 |
2 | "అందమంత అరగధీసి" | ఎస్పీ బాలు, పి.సుశీల | 4:22 |
3 | "చూసాకా నిను చూసాకా" | ఎస్పీ బాలు, పి.సుశీల | 4:24 |
4 | "మంచు ముత్యానివో" | ఎస్పీ బాలు | 4:00 |
5 | "ఒక చేత తాళి" | ఎస్పీ బాలు, పి.సుశీల | 4:20 |
6 | "అన్నం పెట్టమంది అమ్మ" | పి. సుశీల | 2:46 |
మూలాలు[మార్చు]
- ↑ Ramudu Kadu Krishnudu (Banner). Filmiclub.
- ↑ Ramudu Kadu Krishnudu (Direction). Spicy Onion.
- ↑ Ramudu Kadu Krishnudu (Cast & Crew). gomolo.com.
- ↑ Ramudu Kadu Krishnudu (Review). Know Your Films.
- ↑ Ramudu Kadu Krishnudu (Songs). Cineradham.