ఇల్లాలే దేవత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇల్లాలే దేవత
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.ఎల్.వి.ప్రసాద్
నిర్మాణం ఎన్. ఆర్. అనూరాధాదేవి
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
భానుప్రియ,
రాధిక
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ లక్ష్మి ఫిల్మ్ కంబైన్స్
భాష తెలుగు

ఇల్లాలే దేవత 1985లో విడుదలైన తెలుగు సినిమా. లక్ష్మి ఫిలింస్ కంబైన్స్ పతాకంపై ఎన్.ఆర్.అనూరాధా దేవి నిర్మించిన ఈ సినిమాకు టి.ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వం వహించాడు. అక్కినేని నాగేశ్వరరావు, భానుప్రియ, రాధిక ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1] ఈ సినిమా సింగీతం శ్రీనివాసరావు మొదటి కన్నడ చిత్రం హాలు జేను (1982)కు రీమేక్.

గోపి కృష్ణ (అక్కినేని నాగేశ్వరరావు) ఒక మధ్యతరగతి వ్యక్తి. తన భార్య లక్ష్మి (రాధిక) తో కలిసి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడు. లక్ష్మి రక్త క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయిన తర్వాత, ఆమెను రక్షించడానికి గోపి భారీ మొత్తాన్ని కూడబెట్టుకోవలసి వస్తుంది. దాని కోసం అతను మోసగాని‌గా మారి చాలా మందిని తప్పుదారి పట్టించాడు. ఆ ప్రక్రియలో అతనికి మిలియనీర్ దుర్గమ్మ (అన్నపూర్ణ) అనే గయ్యాళీతో పరిచయమవుతుంది. అతను వారు తమ దగ్గరి బంధువులని తప్పుగా ఒప్పిస్తాడు. దుర్గమ్మ కుమార్తె రాధ (భానుప్రియ) ప్రేమలో పడుతుంది. లక్ష్మీ అతనికి రాధతో తన స్నేహం కొనసాగించాలని కోరింది. తరువాత రాధ, లక్ష్మీ స్నేహితులవుతారు. లక్ష్మీ తన గుర్తింపును దాస్తుంది. మరొక వైపు, జిత్తులమారి గోపి రోజురోజుకు తన ప్రణాళికలను పెంచుకుంటాడు కాని దురదృష్టవశాత్తు, ఒకసారి అతను పట్టుబడ్డాడు. అదే సమయంలో లక్ష్మి ఆరోగ్యం క్షీణిస్తుంది. రాధ సహాయం కోసం వచ్చినపుడు గోపి నిధులను ఇవ్వలేక పోతాడు. దీని వెనుక గల కారణాన్ని ప్రశ్నించినపుడు మొత్తం సత్యాన్ని వెల్లడిస్తాడు. సమయానికి, వారు ఆసుపత్రికి చేరుకుంటారు. లక్ష్మి అనారోగ్యంతో ఉంటుంది. చివరగా లక్ష్మి గోపి, రాధలను ఏకం చేసి సంతోషంగా ఆమె చివరి శ్వాస తీసుకుంటుంది.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
 • దర్శకుడు: టి.ఎల్.వి.ప్రసాద్
 • స్టుడియో: లక్ష్మి పిలింస్ కంబైన్స్
 • నిర్మాత: ఎన్.ఆర్.అనూరాధాదేవి
 • సంగీతం: కె.చక్రవర్తి
 • విడుదలతేదీ: 1985 సెప్టెంబరు 12
 • కళ : భాస్కర రాజు
 • నృత్యాలు : ప్రకాష్, సురేఖా
 • సాహిత్యం : ఆచార్య ఆత్రేయ, వేటూరి సుందరరామమూర్తి
 • నేపథ్య గానం : ఎస్పీ బాలు, పి. సుశీల, ఎస్. పి. శైలజ
 • డైలాగులు : సత్యానంద్
 • కథ : పాలగుమ్మీ పద్మరాజు
 • సంగీతం : చక్రవర్తి
 • కూర్పు : కోటగిరి గోపాల రావు
 • ఛాయాగ్రహణం : ఎస్.నవకాంత్

పాటలు

[మార్చు]
 • దొరాగారి ప్రేమ దొరసాని పైన, రచన: వేటూరి సుందర రామమూర్తి,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల
 • నిన్ను చూసిన కళ్ళతో రంభనైన చూడను, రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ,పి సుశీల
 • రాణిగారు మా రాణిగారు , రచన: ఆచార్య ఆత్రేయ గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,ఎస్ పి శైలజ
 • పువ్వులాగా నవ్వుతావే, రచన: ఆచార్య ఆత్రేయ గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
 • శ్రీవారికి కోపాలు , రచన:వేటూరి సుందర రామమూర్తి గానం.పి సుశీల
 • పాలు తేనె కలయికల , రచన: ఆచార్య ఆత్రేయ గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం .

మూలాలు

[మార్చు]
 1. "Illale Devatha (1985)". Indiancine.ma. Retrieved 2020-08-18.

బయటి లింకులు

[మార్చు]