రామసక్కనోడు
స్వరూపం
| రామసక్కనోడు (1999 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | సాగర్ |
|---|---|
| తారాగణం | సుమన్ , మహేశ్వరి |
| నిర్మాణ సంస్థ | స్వర్ణధార క్రియేషన్స్ |
| భాష | తెలుగు |
రామ సక్కనోడు 1999లో విడుదలైన తెలుగు చలన చిత్రం. స్వర్ణధార క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి సాగర్ దర్శకుడు. ఈ చిత్రంలో సుమన్, మహేశ్వరి జంటగా నటించారు. సంగీతం కోటి సమకూర్చారు. ఈ చిత్రానికి మూడు నంది పురస్కారాలు లభించాయి.[1][2]
తారాగణం
[మార్చు]- సుమన్
- మహేశ్వరి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: సాగర్
- సంగీతం: కోటి
- గీత రచయిత: సురేంద్ర కృష్ణ
- నేపథ్య గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, గోపికా పూర్ణిమ, కోటి, మంజు, డి నళిని
- నిర్మాత: వి.శ్రీనివాస రెడ్డి
- నిర్మాణ సంస్థ: కీర్తి క్రియేషన్స్
- విడుదల:1999.
పాటల జాబితా
[మార్చు]- నీ కళ్లలోనే ఉన్నాదమ్మో పిచ్చి పిచ్చి, రచన: సురేంద్ర కృష్ణ, గానం.గోపికా పూర్ణిమ, ఎస్. పి .బాలసుబ్రహ్మణ్యం
- హెల్లొ హెల్లొ అమ్మాయీ పేరే స్వీటి,రచన: సురేంద్ర కృష్ణ,గానం. కోటి, గోపికా పూర్ణిమ
- అనగనగా ఒక ఇల్లుంది చక్కని జంటోకటుంది , రచన: సురేంద్ర కృష్ణ, గానం.ఎస్ .పి. బాలసుబ్రహ్మణ్యం, మంజు
- హే ఎంటా నవ్వు హే ఎంటా చూపు, రచన: సురేంద్ర కృష్ణ, గానం.కోటి, మంజు
- భువిలో స్వర్గముంటే వీరి లోగిలే పసిడి, రచన: సురేంద్ర కృష్ణ, గానం.కోటి
- రుక్మిణి రుక్మిణి రావమ్మో కన్నుకొట్టి, రచన:సురేంద్ర కృష్ణ, గానం.ఎస్ .పి .బాలసుబ్రహ్మణ్యం, డి.నళిని
- ప్రియసఖి అందం తరగని చందం పదనిసరాగం, రచన: సురేంద్ర కృష్ణ, గానం.గోపికా పూర్ణిమ, ఎస్ .పి .బాలసుబ్రహ్మణ్యం .
మూలాలు
[మార్చు]- ↑ సాగర్. "మొదటి సినిమా-సాగర్" (PDF). కౌముది.నెట్. కౌముది.నెట్. Retrieved సెప్టెంబరు 1, 2015.
- ↑ "RamaSakkanodu (1999)". Indiancine.ma. Retrieved 2025-07-19.